Begin typing your search above and press return to search.

దీపావ‌ళి పార్టీలో టాలీవుడ్ స్టార్ క‌పుల్స్

బాలీవుడ్ లో దీపావ‌ళి స్పెష‌ల్ వేడుక‌లు క‌న్నుల‌పండుగ‌ను త‌ల‌పిస్తాయి. సండే నైట్ పాపుల‌ర్ డిజైనర్ మ‌నీష్ మ‌ల్హోత్రా ఇంట భారీగా దీపావ‌ళి వేడ‌క‌లు జ‌రిగాయి.

By:  Tupaki Desk   |   6 Nov 2023 5:00 AM GMT
దీపావ‌ళి పార్టీలో టాలీవుడ్ స్టార్ క‌పుల్స్
X

బాలీవుడ్ లో దీపావ‌ళి స్పెష‌ల్ వేడుక‌లు క‌న్నుల‌పండుగ‌ను త‌ల‌పిస్తాయి. సండే నైట్ పాపుల‌ర్ డిజైనర్ మ‌నీష్ మ‌ల్హోత్రా ఇంట భారీగా దీపావ‌ళి వేడ‌క‌లు జ‌రిగాయి. ఈ వేడుక‌ల‌కు హిందీ చిత్ర‌సీమ‌కు చెందిన ప్ర‌ముఖులంతా ఎటెండ‌య్యారు.


ఇప్పుడు అదే క‌ల్చ‌ర్ టాలీవుడ్ లోను క‌నిపిస్తోంది. ఇక్కడా సెల‌బ్రిటీ హోస్టింగుతో దీపావ‌ళి పండుగ‌ను ఎంతో క‌న్నుల‌పండుగ‌గా ప్లాన్ చేయ‌డం ఆస‌క్తిని క‌లిగిస్తోంది. సెల‌బ్రిటీలు కృష్ణారెడ్డి- సుధా ప్ర‌త్యేక దీపావ‌ళి సెల‌బ్రేష‌న్స్ లో టాలీవుడ్ జంట‌లు మ‌హేష్-న‌మ్ర‌త‌, రామ చ‌ర‌ణ్ - ఉపాస‌న ప్ర‌త్యేక అతిథులుగా హాజ‌రు కాగా ప్ర‌స్తుతం ఈ ఫోటోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారాయి. ఈ పార్టీలో న‌మ్ర‌త కుటుంబీకుల‌తో పాటు ఉపాస‌న కుటుంబీకులు బంధుమిత్రులు కూడా క‌నిపించారు. ఇదే దీపావ‌ళి వేడుకలో మ‌హేష్ తో పాటు విక్ట‌రీ వెంక‌టేష్ కూడా క‌నిపించారు.


నమ్రతశిరోద్కర్ స్వయంగా ఈ ఫోటోల‌ను షేర్ చేయ‌గా అవి వైర‌ల్ గా మారాయి. న‌మ్ర‌త ఇన్ స్టాలో షేర్ చేసిన క్యాప్ష‌న్ లో ఈవెంట్ ని హోస్ట్ చేసిన సుధాకు ధ‌న్య‌వాదాలు తెలిపారు. న‌మ్ర‌త వ్యాఖ్యానిస్తూ..``

అద్భుతమైన వ్యక్తులు ..మా అసాధారణ హోస్ట్‌లు, #KrishnaReddy -@sudhareddy.officialతో దీపావళి సీజన్‌కు స్వాగతం. నీ కంటే మెరుగ్గా ఎవరూ చేయలేరు సుధా! ఎంత అద్భుతమైన సాయంత్రం! మీతో స్నేహానికి ధన్యవాదాలు`` అని ఇన్ స్టాలో రాసారు.

తెలుగు సినీప‌రిశ్ర‌మ‌లో దీపావ‌ళి-ద‌స‌రా-వినాయ‌క చ‌వితి- దేవీ న‌వ‌రాత్రులు- సంక్రాంతి వేడుక‌లు ఎంతో సంబ‌రంగా హోస్ట్ చేయ‌డం చూస్తున్నాం. ఇలాంటి సంద‌ర్భాల్లో ప్ర‌త్యేకించి తెలుగు సినీప‌రిశ్ర‌మ క‌పుల్స్ వేడుక‌ల‌లో సంద‌డి చేస్తుంటే అందుకు సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారుతున్నాయి.