Begin typing your search above and press return to search.

రసవత్తరంగా దీపావళి బాక్సాఫీస్ ఫైట్..?

తెలుగు రాష్ట్రాల్లో అయితే ఇయర్ మొదట్లో వచ్చే సంక్రాంతి నుంచి ఇయర్ ఎండింగ్ వచ్చే క్రిస్ మస్ వరకు పండగకి సినిమాల రిలీజ్ టార్గెట్ చేసుకుని వస్తాయి

By:  Tupaki Desk   |   1 July 2025 6:59 PM IST
రసవత్తరంగా దీపావళి బాక్సాఫీస్ ఫైట్..?
X

పండగ వచ్చింది అంటే సినిమాల రిలీజ్ లతో ఆ పండుగ శోభని మరింత పెంచుతారు. తెలుగు రాష్ట్రాల్లో అయితే ఇయర్ మొదట్లో వచ్చే సంక్రాంతి నుంచి ఇయర్ ఎండింగ్ వచ్చే క్రిస్ మస్ వరకు పండగకి సినిమాల రిలీజ్ టార్గెట్ చేసుకుని వస్తాయి. సంక్రాంతి తర్వాత దసరా కి ఫైట్ బాగుంటుంది. క్రిస్మస్ రేసులో కూడా సినిమాల హంగామా తెలిసిందే. ఐతే అదే క్రమంలో దీపావళికి కూడా సినిమాల మధ్య పోటీ ఏర్పడుతుంది.

అంతకుముందు ఏమో కానీ లాస్ట్ ఇయర్ దీపావళికి 3 సినిమాలు రిలీజ్ అవగా అవన్నీ సక్సెస్ అయ్యాయి. తెలుగు యువ హీరో కిరణ్ అబ్బవరం నటించిన క, దుల్కర్ సల్మాన్ చేసిన లక్కీ భాస్కర్ తో పాటు కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ నటించిన అమరన్ కూడా సూపర్ హిట్ అయ్యింది. ఐతే ఈసారి కూడా అదే తరహాలో సినిమాలు పోటీకి దిగుతున్నాయని తెలుస్తుంది. దీపావళికి కానుకగా మళ్లీ కిరణ్ అబ్బవరం కె ర్యాంప్ ని రిలీజ్ ఫిక్స్ చేసుకున్నాడు.

ఆల్రెడీ లాస్ట్ దీపావళికి క తో వచ్చి హిట్ అందుకున్న కిరణ్ అబ్బవరం ఈసారి కె ర్యాంప్ తో మరో హిట్ టార్గెట్ పెట్టుకున్నాడు. ఇక ఈసారి కిరణ్ తో పోటీ పడేందుకు కోలీవుడ్ యువ హీరో ప్రదీప్ రంగనాథ్ దిగుతున్నాడు. అంతకుముందు లవ్ టుడే ఈమధ్యనే వచ్చిన డ్రాగన్ సినిమాలతో ప్రదీప్ తెలుగులో కూడా సూపర్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్నాడు. ఆ హీరోతో మైత్రి మేకర్స్ నిర్మిస్తున్న బైలింగ్వెల్ సినిమా డ్యూడ్ దీపావళికి రిలీజ్ ఫిక్స్ చేశారు.

కిరణ్ కె ర్యాంప్, ప్రదీప్ రంగనాథ్ డ్యూడ్ తో పాటు సూర్య ఆర్జె బాలాజి కాంబోలో వస్తున్న కరుప్పు కానీ.. కార్తి సర్ధార్ 2 కానీ రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయట. ఇద్దరిలో ఒకరు వస్తే మరొకరు ఆగే ఛాన్స్ ఉంది. సో కిరణ్ అబ్బవరంతో పాటు తమిళ హీరోలు పోటీకి దిగుతున్నారు. మరి ఈ ఇంట్రెస్టింగ్ ఫైట్ లో ఈసారి ఎవరు గెలుస్తారు. తెలుగు ఆడియన్స్ కి ఏ సినిమా ఎంటర్టైన్మెంట్ అందిస్తుంది అన్నది చూడాలి. తెలుగు ప్రేక్షకులకు నచ్చితే అది డబ్బింగ్ సినిమానా స్ట్రైట్ సినిమానా అన్నది చూడరు. అలా ఇంతకుముందు చాలా సినిమాలు అద్భుతాలు సృష్టించాయి. మరి ఈసారి ఏం జరుగుతుందో చూడాలి.