Begin typing your search above and press return to search.

'మ‌జిలీ' బ్యూటీని మ‌ళ్లీ తెస్తున్నారే!

ఏకంగా విజ‌య్ దేవ‌ర‌కొండ స‌ర‌స‌న

By:  Tupaki Desk   |   21 July 2023 11:05 AM GMT
మ‌జిలీ బ్యూటీని మ‌ళ్లీ తెస్తున్నారే!
X

'మ‌జిలీ'తో టాలీవుడ్ కి ప‌రిచ‌య‌మైన దివ్యాంశ కౌశిక్ సుప‌రిచిత‌మే. తొలి సినిమాతోనే అమ్మ‌డు మంచి గుర్తింపు తెచ్చుకుంది. అందం..అభిన‌యం సొగ‌స‌రిని టాలీవుడ్ లో బిజీ న‌టిగా మారుస్తాయాని భావించింది. కానీ ఆ ర‌కంగా కెరీర్ సాగ‌లేదు. 'రామారావు ఆన్ డ్యూటీ' లాంటి సినిమా అమ్మ‌డి కెరీర్ ని అంత‌కంత‌కు వెన‌క్కి నెట్టింది. ఆ సినిమా వైఫ‌ల్యం త‌ర్వాత రెండు..మూడు సినిమాలు చేసింది గానీ అవి స‌క్సెస్ అవ్వ‌లేదు.

ఈ మ‌ధ్య‌నే సిద్దార్ద్ స‌ర‌స‌న 'ట‌క్క‌రి' సినిమా చేసింది. ఆ సినిమా ఫ‌లితం నిరూత్సాహ ప‌రించింది. దీంతో దివ్యాంశ టాలీవుడ్ కెరీర్ ముగిసిన‌ట్లేన‌ని అంతా భావించారు. కానీ అమ్మ‌డికి అదృష్టం వెన్నెంటే ఉంద‌ని తెలుస్తోంది.

ఏకంగా విజ‌య్ దేవ‌ర‌కొండ స‌ర‌స‌న న‌టించే అవ‌కాశ‌మే అందుకుంది. విజ‌య్ హీరోగా ప‌ర‌శురాం ఓ చిత్రాన్ని తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో మెయిన్ లీడ్ కి మృణాల్ ఠాకూర్ ని ఎంపిక చేసిన సెకెండ్ లీడ్ కి దివ్యాంశ‌ని తీసుకున్నారు.

ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియా వేదిక‌గా షేర్ చేసి దివ్యాంశ సంతోషం వ్య‌క్తం చేసింది. ఇన్ని ప‌రాజ‌యాల త‌ర్వాత దివ్యాంశ‌కి ఇలాంటి అవ‌కాశం రావ‌డం షాకింగ్ అనే అనాలి. ఎంతో మంది భామ‌లున్నా వెతుక్కుంటూ మ‌రీ ఛాన్స్ అమ్మ‌డిని వ‌రించింది. ఇలా ఛాన్స్ రావ‌డం అన్న‌ది ట్యాలెంట్ తోనే సాధ్య‌మ‌నాలి. 'మ‌జిలీ'లో దివ్యాంశ న‌ట‌న‌కి మంచి మార్కులు ప‌డ్డాయి.

తొలి సినిమా అయినా అనుభ‌వం గ‌ల న‌టిలా ప‌నిచేసింది. నాగ‌చైత‌న్య‌తో రొమాంటిక్ స‌న్నివేశాల్లో త‌న‌దైన మార్క్ వేసింది. సినిమాలో ఆ పాత్ర చ‌నిపోయిన‌ప్ప‌టికీ కొన‌సాగిస్తే బాగుండు అనే ఫీల్ ని ప్రేక్ష‌కుల్లో తీసుకొచ్చింది.

ఇలాంటి స‌మీక‌ర‌ణాలే మ‌ళ్లీ దివ్యాంశ కి మ‌ళ్లీ అవ‌కాశాలు క‌ల్పిస్తున్నాయి. ప‌రుశురాం ఈ చిత్రాన్ని 'గీత‌గోవిందం' త‌రహాలో తెర‌కెక్కిస్తున్న‌ట్లు ప్ర‌చారం సాగుతోంది. 'ఫ్యామిలీ స్టార్' అనే టైటిల్ వినిపిస్తోంది.