Begin typing your search above and press return to search.

మజిలి భామ మరో అదిరిపోయే ఛాన్స్..!

By:  Tupaki Desk   |   20 July 2023 5:58 AM GMT
మజిలి భామ మరో అదిరిపోయే ఛాన్స్..!
X

మజిలీ సినిమాతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చిన భామ దివ్యాన్ష కౌశిక్. శివ నిర్వాణ డైరెక్షన్ లో నాగ చైతన్య, సమంత కలిసి నటించిన ఆ సినిమాలో దివ్యాన్ష ఉన్న కొంత టైం అయినా తన మార్క్ నటనతో ఆకట్టుకుంది. అయితే మజిలీ తర్వాత ఆమెకు వరుస అవకాశాలు వస్తాయని భావించగా ఎందుకో ఆశించిన స్థాయిలో రాలేదు. 3 ఏళ్ల తర్వాత రవితేజ హీరోగా వచ్చిన రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది దివ్యాన్ష. ఆ సినిమా ఫెయిల్ అవడంతో అమ్మడికి ఇక అవకాశాలు కష్టమే అనుకున్నారు. కానీ సందీప్ కిషన్ మైఖెల్ సినిమాలో ఆమె మళ్లీ లక్కీ ఛాన్స్ కొట్టేసింది.

పాన్ ఇండియా లెవెల్ లో రిలీజైన మైఖెల్ కూడా నిరాశ పరిచింది. అదే కాదు సిద్ధార్థ్ హీరోగా చేసిన టక్కర్ కూడా రీసెంట్ గా వచ్చి డిజాస్టర్ అయ్యింది. ఇన్ని ఫ్లాపులు పడ్డా అసలైతే ఏ హీరోయిన్ కి మరో ఛాన్స్ రావడం కష్టం. కానీ దివ్యాన్ష కౌశిక్ రిజల్ట్ తో సంబంధం లేకుండా సినిమా అవకాశాలు అందుకుంటుంది.

దివ్యాన్ష కౌశిక్ లేటెస్ట్ గ రౌడీ హీరో విజయ్ దేవరకొండ సినిమాలో లక్కీ ఆఫర్ కొట్టేసిందని తెలుస్తుంది. విజయ్ దేవరకొండ పరశురామ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో దివ్యాన్ష సెకండ్ హీరోయిన్ గా నటించబోతుందని తెలుస్తుంది.

ఆల్రెడీ ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఆమెతో పాటుగా దివ్యాన్ష కౌశిక్ కి ఈ సినిమాలో అవకాశం లభించినట్టు తెలుస్తుంది. రౌడీ హీరో సినిమాలో ఛాన్స్ అంటే దివ్యాన్ష కౌశిక్ గ్రాఫ్ పెరిగే అవకాశం ఉంది.

యాక్టింగ్ లో సోసోగానే అనిపించినా గ్లామర్ తో అయినా తెలుగు ఆడియన్స్ ని తన బుట్టలో వేసుకోవాలని చూస్తున్న దివ్యాన్ష వచ్చిన ఏ చిన్న అవకాశాన్ని వదిలి పెట్టట్లేదు. ఈ క్రమంలోనే అమ్మడికి వరుస అవకాశాలు కూడా తలుపు తడుతున్నాయి.

టక్కర్ సినిమా తర్వాత దివ్యాన్షని మర్చిపోవడమే అనుకున్నారు కానీ ఏకంగా విజయ్ దేవరకొండ ఆఫర్ తో సర్ ప్రైజ్ చేస్తుంది దివ్యాన్ష. గీత గోవిందం కాంబో సినిమా కాబట్టి ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. మరి ఈ సినిమా రిజల్ట్ ఏ రేంజ్ లో ఉండబోతుందో చూడాలి. దిల్ రాజు బ్యానర్ లో నిర్మిస్తున్న ఈ సినిమాను కూడా పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది.