Begin typing your search above and press return to search.

మ‌గాళ్లు అలా చూడ‌టం ఆస్వాదిస్తానంటోంది!

వివాహం పై ఎవ‌రి అభిప్రాయం వారిది. ఇండ‌స్ట్రీలో పెళ్లి చేసుకోని సెల‌బ్రిటీలు చాలా మంది ఉన్నారు.

By:  Tupaki Desk   |   13 Jun 2025 5:00 AM IST
మ‌గాళ్లు అలా చూడ‌టం ఆస్వాదిస్తానంటోంది!
X

వివాహం పై ఎవ‌రి అభిప్రాయం వారిది. ఇండ‌స్ట్రీలో పెళ్లి చేసుకోని సెల‌బ్రిటీలు చాలా మంది ఉన్నారు. పెళ్లికి చేసుకుని విడిపోయిన రాంగోపాల్ వ‌ర్మ‌, పెళ్లి చేసుకుని పెళ్లి చేసుకోవ‌ద్ద‌ని యువ‌త‌కు స‌ల‌హాలిచ్చే పూరి జ‌గ‌న్నాధ్ బ్యాచిలర్ లైఫ్ గురించి ఎంతో గొప్ప‌గా చెబుతుంటారు. కొన్నాళ్లు ఉండిపోయే జీవితానికి పెళ్లి అవ‌స‌రం లేద‌ని ఎంతో ఓపెన్ గా చెబుతుంటారు. ఇదే త‌ర‌హాలో హ‌రీష్ శంక‌ర్ కూడా ఓ సంద‌ర్భంలో మాట్లాడారు.

వీళ్ల వ్యాఖ్య‌ల్ని స‌మ‌ర్ధించిన వారు చాలా మంది ఉన్నారు. వీళ్ల‌లో మ‌హిళా సెల‌బ్రిటీలు మిన‌హాయింపు కాదు. పెళ్లి లేకుండా ఉన్న న‌టీమ‌ణులు చాలా మంది ఉన్నారు. అందులో బాలీవుడ్ న‌టి దివ్యా ద‌త్ ఒక‌రు. ఇటీవ‌లే ఆమె 40 ఏళ్లు వ‌చ్చినా ఇంకా పెళ్లి ఎందుకు చేసుకోలేదు? అనే ప్ర‌శ్న ముందుకెళ్లింది. అందుకు ఆమె ఇలా స్పందించింది. మంచి వ్య‌క్తిదొరికితే వివాహం చేసుకోవడం మంచిదే.

అదే పెళ్లి లేక‌పోతే జీవితం ఇంకా అందంగా ఉంటుంద‌ని న‌మ్ముతాను. అందుకే పెళ్లికంటే మిమ్మ‌ల్ని మీరు ప్రేమించుకోవ‌డం మంచిద‌ని చెబుతాను. నాపై చాలా మంది పురుషులు శ్ర‌ద్ద పెడుతుంటారు. న‌న్ను తదేకంగా చూస్తుంటారు. నేను వాటిని ఆస్వాదిస్తాను. కానీ అక్క‌డ క‌రెక్ట్ అయితేనే రిలేష‌న్ ఉండాలి. ఒక వ్య‌క్తి మీ చేయి ప‌ట్టుకుని ఉంటాడ‌ని భావించాలి. న‌మ్మాలి.

ఒక‌వేళ అలా జ‌ర‌గ‌లేదంటే ప‌రిస్థితి ఏంటి? అందుకే నా కోసం నేను ఉన్నా. నాతో ప్ర‌యాణం చేసే స‌హ‌చ‌రుడిగా ఉండ‌టానికే ఇష్ట‌ప‌డ‌తా. అలా లేక‌పోయినా నేన సంతోషంగా ఉండ‌గ‌ల‌ను. నా ప్రాణ స్నేహితుడు అందంగా ఉండి ఎందుకు పెళ్లి చేసుకోలేదు? అంటే ఆ స్టేజ్ ఎప్పుడో దాటిపోయాన‌ని చెప్పా` అంది.