విడాకుల తర్వాత ఐటమ్ నంబర్లతో దులిపేసారు
గ్లామర్ ఇండస్ట్రీలో కథానాయికలు హద్దులు చెరిపేసి బోల్డ్ పెర్ఫామెన్సెస్ తో చెలరేగాలి. మడికట్టుకుని కూచుంటే ఇక్కడ పనవ్వదు.
By: Tupaki Desk | 8 May 2025 4:58 PMగ్లామర్ ఇండస్ట్రీలో కథానాయికలు హద్దులు చెరిపేసి బోల్డ్ పెర్ఫామెన్సెస్ తో చెలరేగాలి. మడికట్టుకుని కూచుంటే ఇక్కడ పనవ్వదు. లీగ్ లో దూసుకెళ్లడం కుదరదు. ఇది చాలామంది కథానాయికల ప్రత్యక్ష అనుభవం. ఇటీవల యానిమల్, గుడ్ న్యూజ్ లాంటి చిత్రాల్లో తనదైన గ్లామర్ డోస్ తో గుబులు పుట్టించిన ట్రిప్తి దిమ్రీ ప్రియుడితో బ్రేకప్ తర్వాతే బెటర్ కెరీర్ ని ఆస్వాధిస్తోంది. ఇటీవల వరుస అవకాశాలతో కెరీర్ పరంగా ఎంత బిజీగా మారిందో తెలిసిందే.
ట్రిప్తి మాత్రమే కాదు.. సినీరంగంలో ఎదగాలనుకునే యంగ్ గాళ్స్ చాలామంది ఆరబోతతో ప్రయోజనాలను స్వయంగా సంగ్రహించారు. అయితే పెళ్లయిన కథానాయికలకు ఈ విషయంలో అంతగా వెసులుబాటు ఉండదు. భర్త, అత్తమామల నుంచి కొన్ని కట్టుబాట్లు అడ్డంకిగా మారతాయి. సనాతన భారతదేశంలో కోడలుపై అధికారం కొన్నిట్లో ఇబ్బందికరమైనది. కానీ విడాకులయ్యాక మాత్రం సదరు కథానాయికలకు ఫ్యామిలీ ఒత్తిళ్లు పని చేయవు. స్వయం కట్టుబాట్లు మినహా ఎదుటివారి అజమాయిషీలో ఎలాంటి కట్టుబాట్లు అడ్డంకిగా ఉండవు. బోల్డ్ కంటెంట్ ని ఎంచుకోవడానికి, అందాల ప్రదర్శనకు చిక్కులేవీ ఉండదు గనుక, ఇటీవలి కాలంలో విడాకుల తర్వాత ఐటమ్ నంబర్లతో చెలరేగిన కథానాయికల జాబితాను పరిశీలిస్తే.. అమలాపాల్, సమంత, ధనశ్రీ వర్మ లాంటి కథానాయికల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
తమిళ దర్శకుడు, భర్త విజయ్ నుంచి విడిపోయిన తర్వాత అమలాపాల్ బోల్డ్ పాత్రలతో తమిళ ఇండస్ట్రీని షేక్ చేసింది. అమలా నటించిన చాలా తమిళ చిత్రాలు తెలుగులోను అనువాదమై ఆకట్టుకున్నాయి. అమలాపాల్ బ్రేకప్ తర్వాత గ్లామర్ ఎలివేషన్ లో మరింతగా చెలరేగిపోయింది. ప్రయోగాత్మక పాత్రలతోను టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది. ఆ తర్వాత నాగచైతన్య నుంచి విడిపోయిన స్టార్ హీరోయిన్ సమంత `ఊ అంటావా..` లాంటి స్పెషల్ సాంగ్ తో ఉర్రూతలూగించింది. ఈ పాటలో సమంత పొట్టి దుస్తులు, థై స్లిట్ ఎలివేషన్, గుబులు రేపే అందాల ప్రదర్శన ప్రధానంగా చర్చకు వచ్చాయి. పుష్ప చిత్రం బాక్సాఫీస్ కలెక్షన్లకు ఈ పాట కూడా అదనంగా కలిసొచ్చింది. ఫ్యామిలీమ్యాన్ 2, సిటాడెల్ -హనీబన్నిలో సమంత గ్లామరస్ లుక్స్, పెర్ఫామెన్స్ కి యూత్ ఫిదా అయిపోయింది. మునుపటితో పోలిస్తే ఫ్లెక్సిబుల్ గా కనిపించింది సామ్.
ఇప్పుడు లేడీ కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ క్రికెటర్ చాహల్ నుంచి విడిపోయాక చెలరేగి ప్రత్యేక గీతాల్లో నర్తిస్తోంది. దిల్ రాజు బ్యానర్‌లో ఆకాశం దాటి వస్తావా? అనే డ్యాన్స్ బేస్డ్ సినిమాకి సంతకం చేసిన ధనశ్రీ, బాలీవుడ్ లో రాజ్ కుమార్ రావు చిత్రంలో ఐటమ్ నంబర్ లో నర్తిస్తోంది. భర్త నుంచి విడాకులు తీసుకున్న తర్వాత ధనశ్రీ సినిమాల్లో బిజీ అయిపోయింది. తెలుగు, తమిళం, హిందీ చిత్రాలకు చకచకా సంతకాలు చేస్తోంది. ఐటమ్ నంబర్‌లో అవకాశం వచ్చినా వదిలిపెట్టడం లేదు. రాజ్ కుమార్ రావు- వామిక గబ్బి నటిస్తున్న ` భూల్ చుక్ మాఫ్` చిత్రంలో ధనశ్రీ వర్మ స్పెషల్ సాంగ్‌లో అదరగొట్టనుంది. ఈ పాట చిత్రీకరణకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పటికే ఇంటర్నెట్ లో వైరల్ అయ్యాయి. ధనశ్రీ చెలరేగి అందాల్ని ప్రదర్శించిన ఫోటోలు జోరుగా వైరల్ అవుతున్నాయి.