Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : అందాల దివికి సముద్రం చిన్నబోదా..!

ఎప్పుడైతే బిగ్‌బాస్ లోమెరిసిందో అప్పటి నుంచి దివి సోషల్‌ మీడియాలో వెలిగి పోతూనే ఉంది

By:  Tupaki Desk   |   21 March 2024 7:03 AM GMT
పిక్ టాక్ : అందాల దివికి సముద్రం చిన్నబోదా..!
X

తెలుగు బిగ్ బాస్ తో ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ దివి. అంతకు ముందు పలు సినిమాల్లో నటించినా కూడా జనాలు వాటిని పెద్దగా పట్టించుకోలేదు, దివికి పెద్దగా గుర్తింపు రాలేదు. ఎప్పుడైతే బిగ్‌బాస్ లోమెరిసిందో అప్పటి నుంచి దివి సోషల్‌ మీడియాలో వెలిగి పోతూనే ఉంది.

సినిమాలు, సిరీస్‌ ల్లో నటిస్తూ ఈ మధ్య కాలంలో బిజీ బిజీగా ఉన్న అందాల దివి సోషల్‌ మీడియా ద్వారా తన అందాల ఆరబోత ఫోటోలను షేర్‌ చేయడం చాలా కామన్‌ విషయం. అయితే దివి ఎప్పుడు అందాల ఫోటోలు షేర్‌ చేసినా కూడా చూపరుల చూపు తిప్పుకోనివ్వవు అని మాట్లాడుకుంటూ ఉంటాం.

తాజాగా మరోసారి దివి చీర కట్టు ఫోటోలతో బాబోయ్‌ అనిపించేంత అందంగా కనిపిస్తుంది. ఈసారి సముద్రంలో అలలతో ఆడుకుంటూ చిరు మందహాసం తో దివి ఫోటోలకు ఫోజ్ ఇచ్చింది. దివి చీర కట్టు అందంకు, ఆ నడుము ఒంపు సొంపులకు సముద్రం కూడా చిన్నబోయి ఉగ్రరూపం కాకుండా శాంత రూపం లోకి మారింది అన్నట్లుగా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

లేత గోదుమ రంగు కేరళ చీర కట్టులో నడుము అందాలు చూపిస్తూ నాభి అందాలతో కవ్విస్తున్న దివి ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. ఈ రేంజ్ లో అందంగా ఉన్న దివికి టాలీవుడ్‌ లో అవకాశాలు అంతగా రాకపోవడం దురదృష్టకరం. కోలీవుడ్‌ లో అయినా ఈ అమ్మడికి ఛాన్స్ వస్తే బాగుండు అన్నట్లుగా కొందరు మాట్లాడుకుంటూ ఉన్నారు.