Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: దివి వ‌ద్య‌త మైండ్ బ్లాక్ ట్రీట్

తాజాగా బ్లాక్ ఇన్న‌ర్ ధ‌రించి, దానిపై డార్క్ క‌ల‌ర్ డెనిమ్ ష‌ర్ట్ తో క‌వ‌ర‌ప్ చేసిన ఈ బ్యూటీ డెనిమ్ బాట‌మ్ వేర్ ని ఎంపిక చేసుకుంది.

By:  Tupaki Desk   |   28 Sep 2023 4:17 AM GMT
ఫోటో స్టోరి: దివి వ‌ద్య‌త మైండ్ బ్లాక్ ట్రీట్
X

'బిగ్ బాస్ 4' ఫేం దివి వ‌ద్య‌త ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. ఓటీటీ తెర‌ - వెండితెరపైనా వెలుగులు విర‌జిమ్ముతోంది ఈ బ్యూటీ. దివి అందం హాట్ కంటెంట్ త‌న‌లో ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌. ఓవైపు వెబ్ సిరీస్‌లు, మ‌రోవైపు సినిమాలతో దివి త‌న స్థాయిని అంత‌కంత‌కు పెంచుకుంటోంది. చాలామంది బిగ్ బాస్ అంద‌గ‌త్తెల‌తో పోలిస్తే దివి కెరీర్ ప‌రంగా ఒక మెట్టు పైనే ఉంద‌ని చెప్పాలి. ఇటీవ‌ల తెలుగ‌మ్మాయిల్లో వేగంగా షైన్ అవుతున్న బ్యూటీగాను దివి పేరు వినిపిస్తోంది.


ఇక ఈ బ్యూటీ లేటెస్ట్ ఫోటోషూట్లు అంత‌ర్జాలంలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. దివి వ‌ద్య‌త‌కు సోష‌ల్ మీడియాలోనూ అసాధార‌ణ‌ ఫాలోయింగ్ ఉంది. ఇన్ స్టా మాధ్య‌మంగా వేడెక్కించే ఫోటోషూట్ల‌ను షేర్ చేస్తోంది. తాజాగా బ్లాక్ ఇన్న‌ర్ ధ‌రించి, దానిపై డార్క్ క‌ల‌ర్ డెనిమ్ ష‌ర్ట్ తో క‌వ‌ర‌ప్ చేసిన ఈ బ్యూటీ డెనిమ్ బాట‌మ్ వేర్ ని ఎంపిక చేసుకుంది.

ఈ డ్రెస్ కి త‌గ్గ‌ట్టే డిజైన‌ర్ స‌న్ గ్లాసెస్ తో మ‌తులు చెడ‌గొడుతోంది. ట్రైయాంగిల్ క‌ళ్ల‌ద్దం దివిలో హాట్ కంటెంట్ ని మ‌రింతగా పెంచింద‌ని చెప్పాలి. ఈ లుక్ సంథింగ్ స్పెష‌ల్ .. టూ హాట్ అంటూ అభిమానులు కితాబిచ్చేస్తున్నారు. దివి నేచుర‌ల్ అందం స్టైల్ కంటెంట్ కుర్ర‌కారులో చ‌ర్చ‌కు వ‌చ్చింది.

ముఖ్యంగా దివి టోన్డ్ సొగసుకు యూత్ ఫిదా అయిపోతున్నారు. అభిమానులు ప్ర‌స్తుతం ఈ ఫోటోగ్రాఫ్స్ ని వైర‌ల్ గా షేర్ చేస్తున్నారు. దివి వద్య‌త హైద‌రాబాద్ షేక్ పేట‌లోని నారాయ‌ణ‌మ్మ కాలేజ్ లో ఎంబీఏ పూర్తి చేసారు. అటుపై మోడ‌లింగ్ చేసి, న‌ట‌నారంగంలో స్థిర‌ప‌డింది.

దివి బ‌యోడేటా: దివి వద్య‌త వ‌య‌సు 26. హైదరాబాద్‌లో జన్మించారు. హైదరాబాదులోని జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ లో పాఠశాల విద్యను అభ్యసించింది మరియు MBA అభ్యసించడానికి G. నారాయణమ్మ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్స్ (మహిళా కాలేజ్‌)లో చేరారు. తల్లిదండ్రులు & తోబుట్టువుల వివ‌రాల్లోకి వెళితే..శశికాంత్ వద్య‌త‌ .. దేవకి వద్య‌త దంప‌తుల‌ కుమార్తె. ఆమెకు కిషోర్ వడ్త్యా అనే అన్నయ్య ఉన్నాడు. 2017లో స్థానిక బ్రాండ్‌ల కోసం ప్రింట్ షూట్‌లు చేయడం ద్వారా దివి వద్య‌త‌ మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది.

ఆ త‌ర్వాత ప‌లు ఫ్యాషన్ షోల కోసం ర్యాంప్‌పై నడిచింది. 24 జనవరి 2018న దివి తన యూట్యూబ్ ఛానెల్ 'టింగరబుచ్చి'ని ప్రారంభించింది. దివి 2018లో 'లెట్స్ గో' అనే తెలుగు చిత్రంతో తన నటనను ప్రారంభించింది. ఆ తర్వాత తెలుగులో మ‌హేష్ సినిమా 'మహర్షి' సినిమాలో కనిపించింది. సీన్ నంబర్ 72 చిత్రంలో కూడా కనిపించింది. 2020లో బిగ్ బాస్ తెలుగు 4 ఇంట్లోకి పోటీదారుగా ప్రవేశించింది. హాబీలు పాడటం, నృత్యం, పెయింటింగ్, ప్రయాణాలు ఇష్టం. హిందీ, ఇంగ్లీష్, తెలుగు భాషలపై దివికి మంచి పట్టు ఉంది. దివి భుజం కింద ఇంక్‌ టాటూ సంథింగ్ హాట్‌.