Begin typing your search above and press return to search.

మళ్లీ హీటెక్కించిన దివి.. అలా చాటున ఘాటుగా..

బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా పాపులర్ అయిన ముద్దుగుమ్మల్లో సొట్ట బుగ్గల సుందరి దివి కూడా ఒకరు.

By:  Tupaki Desk   |   3 Jan 2024 12:25 PM IST
మళ్లీ హీటెక్కించిన దివి.. అలా చాటున ఘాటుగా..
X

బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా పాపులర్ అయిన ముద్దుగుమ్మల్లో సొట్ట బుగ్గల సుందరి దివి కూడా ఒకరు. బిగ్ బాస్ కంటే ముందు పలు సినిమాలు చేసినా రాని గుర్తింపు బిగ్ బాస్ తో సొంతం చేసుకుంది ఈ పొడుగు కాళ్ల సుందరి. సీజన్ 4లో కంటెస్టెంట్ గా పాల్గొన్న దివి తన ఆట తీరుతోపాటు అందం, అభినయంతో యూత్ ను బాగా ఆకట్టుకుంది.


ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికొచ్చాక.. అందరిలానే ఆమె కూడా ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. వరుస ఆఫర్లు అందుకుంది. వెబ్ సిరీస్ లతోపాటు సినిమాలూ చేస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. దాంతోపాటే సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో అందాలను ఆరబోస్తోంది. నెటిజన్ల ను తన చూపులతో ఆకట్టుకుంటోంది. ఎప్పటికప్పుడు కొత్త ఫొటోలను షేర్ చేస్తూ సందడి చేస్తోంది.


తాజాగా ఇన్ స్టాగ్రామ్లో కొత్త చిత్రాలను షేర్ చేసింది ఈ అమ్మడు. టైట్ ఫిట్ పొట్టి బ్లాక్ డ్రెస్ లో కొంటెగా పోజులిచ్చింది. నడుము అందాలతో పాటు, క్లీవేజ్ షో తో మెస్మరైజ్ చేసింది. కుర్రకారు మతులను పోగొట్టింది. "I don’t need a shining star And I don’t want to be rescued No neither frog nor charming prince!" అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం దివి పిక్స్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. దివి నడుము చూసిన నెటిజెన్స్ ఈమె నిజంగానే హీరోయిన్ మెటీరియల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.


2017లో మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసింది దివి. పలు ఫ్యాషన్ షోల కోసం ర్యాంప్ వాక్ చేసింది. ఆ తర్వాత 2018 లో లెట్స్ గో అనే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. మహేశ్ బాబు మహర్షి మూవీలో కనిపించింది. బిగ్ బాస్ సీజన్ 4తో మరింత క్రేజ్ తెచ్చుకుని మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ మూవీలో ఓ కీలక పాత్ర పోషించింది. ఆ సినిమాలో సునీల్ భార్యగా మంచి నటనను కనబరిచింది.


ఈ సినిమాతో పాటు లంబసింగి, ఏటీఎం అనే సినిమాల్లో నటించింది. త్వరలోనే రిలీజ్ కానున్న అల్లుఅర్జున్ పుష్ప-2లో రిపోర్టర్ గా కనిపించనుంది. ఆ మధ్య రిలీజ్ చేసిన టీజర్ లో అలా తళుక్కున మెరిసింది. ఇలా పలు సినిమాల్లో ఛాన్స్ లు దక్కించుకుంటూ క్రేజ్ పెంచుకుంటోంది. మరి దివికి టాలీవుడ్ లో మంచి అవకాశాలు దక్కుతాయో లేదో చూడాలి.