Begin typing your search above and press return to search.

బులుగు ఫ్రాక్‌లో టోన్డ్ లెగ్స్‌తో ఎవ‌రీ బ్యూటీ?

దివి త‌న టోన్డ్ లెగ్స్ సౌంద‌ర్యాన్ని ఆవిష్క‌రిస్తున్న ఈ నీలిరంగు ఫ్రాక్ కుర్ర‌కారు గుండెల్లో గుబులు రేపుతోంది. దివి ఒక అంద‌మైన విల్లా ప‌రిస‌రాల్లో ప‌చ్చందాల న‌డుమ అలా హొయ‌లు పోయిన ఫోటోలు షేక్ చేస్తున్నాయి.

By:  Tupaki Desk   |   13 Dec 2023 3:30 PM GMT
బులుగు ఫ్రాక్‌లో టోన్డ్ లెగ్స్‌తో ఎవ‌రీ బ్యూటీ?
X

బులుగు జిలుగు దుస్తుల్లో క్వీన్‌ని త‌ల‌పిస్తోంది.. ఇంత‌కీ ఎవ‌రీ బ్యూటీ? అంటే .. ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. పేరు దివి వ‌ద్య‌త‌. నాగార్జున హోస్ట్ చేసిన‌ బిగ్ బాస్ ఇంటి స‌భ్యురాలిగా అల‌రించిన దివి, అటుపై సినీరంగంలో అడుగులు వేసింది. ఇక్క‌డ వ‌రుస‌గా క్రేజీ అవ‌కాశాలు అందుకుంటోంది. ఓవైపు వెబ్ సిరీస్ లు మ‌రోవైపు సినిమాలు రెండిటితో బ్యాలెన్స్ డ్ గా కెరీర్ బండిని న‌డిపించేస్తోంది.


నేటిత‌రంలో అందానికి అందం.. ప్ర‌తిభ‌, అంత‌కుమించి సోష‌ల్ మీడియాల్లో ఫాలోయింగ్ తో దివి వ‌ద్య‌త దూసుకెళుతోంది. ముఖ్యంగా దివి సోష‌ల్ మీడియా ఫోటోషూట్ల‌కు భారీ ఫాలోయింగ్ ఏర్ప‌డింది. తాజాగా దివి షేర్ చేసిన ఓ ఫోటోషూట్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారుతోంది.


దివి త‌న టోన్డ్ లెగ్స్ సౌంద‌ర్యాన్ని ఆవిష్క‌రిస్తున్న ఈ నీలిరంగు ఫ్రాక్ కుర్ర‌కారు గుండెల్లో గుబులు రేపుతోంది. దివి ఒక అంద‌మైన విల్లా ప‌రిస‌రాల్లో ప‌చ్చందాల న‌డుమ అలా హొయ‌లు పోయిన ఫోటోలు షేక్ చేస్తున్నాయి. ర‌క‌ర‌కాల భంగిమ‌ల్లో ఈ బ్యూటీ కెమెరాకు ఫోజులిచ్చింది.


స్వ‌గ‌తం విష‌యానికి వ‌స్తే.. వ‌య‌సు 26. హైదరాబాద్ స్వ‌స్థ‌లం. జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ లో పాఠశాల విద్యను అభ్యసించింది. MBA స్ట‌డీస్ కోసం G. నారాయణమ్మ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్స్ (మహిళా కాలేజ్‌)లో చేరారు. శశికాంత్ వద్య‌త‌ .. దేవకి వద్య‌త దంప‌తుల‌ కుమార్తె. ఆమెకు కిషోర్ వడ్త్యా అనే అన్నయ్య ఉన్నాడు. 2017లో స్థానిక బ్రాండ్‌ల కోసం ప్రింట్ షూట్‌లు చేయడం ద్వారా దివి వద్య‌త‌ మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది. ఆ త‌ర్వాత ప‌లు ఫ్యాషన్ షోల కోసం ర్యాంప్‌పై నడిచింది. 24 జనవరి 2018న దివి తన యూట్యూబ్ ఛానెల్ "టింగరబుచ్చి"ని ప్రారంభించింది.


దివి 2018లో "లెట్స్ గో" అనే తెలుగు చిత్రంతో తన నటనను ప్రారంభించింది. ఆ తర్వాత తెలుగులో మ‌హేష్ సినిమా "మహర్షి" సినిమాలో కనిపించింది. సీన్ నంబర్ 72 చిత్రం స‌హా ప‌లు తెలుగు చిత్రాల్లో కనిపించింది. 2020లో బిగ్ బాస్ తెలుగు 4 ఇంట్లోకి పోటీదారుగా ఆద‌ర‌ణ ద‌క్కించుకుంది. పాడటం, నృత్యం, పెయింటింగ్, ప్రయాణాలు దివి హాబీస్. హిందీ, ఇంగ్లీష్, తెలుగు భాషలపై దివికి మంచి పట్టు ఉంది.