ఈసారి స్టైలిష్ లుక్కులో దివి గ్లామర్ డోస్
టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫేమ్ తెచ్చుకున్న నటి దివి వధ్యకు సోషల్ మీడియా ద్వారా మంచి ఫ్యాన్ బేస్ ఏర్పడింది.
By: Tupaki Desk | 22 April 2025 10:25 AM ISTటాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫేమ్ తెచ్చుకున్న నటి దివి వధ్యకు సోషల్ మీడియా ద్వారా మంచి ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ‘బిగ్‌బాస్’ షో ద్వారా దగ్గరైన దివి, ఆ తర్వాత లంబసింగి లాంటి సినిమాల్లో చిన్నచిన్న పాత్రల్లో మెరిసింది. కానీ తను ఎంచుకునే ఫొటోషూట్స్ ద్వారా మాత్రం ఎప్పటికప్పుడు నెట్టింట్లో ట్రెండింగ్‌లో ఉండగలుగుతుంది.
ఇటీవల దివి షేర్ చేసిన కొత్త ఫొటోషూట్ మాత్రం వేరే లెవెల్‌లో ఉండిపోయింది. లైట్ పింక్ శాటిన్ గౌన్‌లో ఆమె పోజులు అందరినీ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా హై స్లిట్ గౌన్‌లో ఆమె స్టెప్పులు, పోజులు ఆమెలోని ఫ్యాషన్ సెన్స్‌ను మరింత హైలైట్ చేశాయి. మ్యాచింగ్ ఈయరింగ్స్, కర్లీ హెయిర్ స్టైల్‌తో గ్లామర్‌కు మరో అర్థం చెప్పింది దివి.
కెమెరా ముందుకొచ్చిన ప్రతి ఫ్రేమ్‌లో ఆమె నమ్మకంగా కనిపించడం, నటిగా ఆమె ఎదుగుతున్న పరిణతి స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ఫోటోలు తీసిన ఫోటోగ్రాఫర్ కూడా చాలా క్రాఫ్ట్‌ఫుల్‌గా ప్రతి షాట్‌ను డిజైన్ చేశాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ ఫోటోలు ఇప్పటికే 25 వేలకి పైగా లైక్స్‌ను అందుకున్నాయి. అభిమానుల నుంచి బ్యూటిఫుల్, గోర్జియస్ అంటూ కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి.
దివి తన క్యాప్షన్ “ఆంఖోం సే లీజియే” అనే లైన్‌తో అభిమానులను ఫోజ్‌ఫుల్ మూడ్‌లోకి తీసుకెళ్లింది. ప్రస్తుతం దివి ఒక థ్రిల్లర్ సినిమాతో పాటు కొన్ని కొత్త వెబ్ ప్రాజెక్ట్స్‌లో భాగమవుతోంది. తన ఫ్యాషన్, గ్లామర్, నటన అన్నింటినీ సమపాళ్లలో మిక్స్ చేస్తూ... తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంటోంది దివి వధ్య. మరి ఈ తరహా స్టైల్ లో అమ్మడు ఎలాంటి అవకాశాలు అందుకుంటుందో చూడాలి.
