Begin typing your search above and press return to search.

బికినీ కంటే ఘాటుగా దివి స్టన్నింగ్ లుక్!

దివి కెరీర్ విషయానికి వస్తే, మోడలింగ్ ద్వారా తన ప్రయాణాన్ని ప్రారంభించిన ఈ బ్యూటీ, బిగ్‌బాస్ షో ద్వారా మాస్ ఆడియెన్స్‌కి పరిచయమైంది.

By:  Tupaki Desk   |   26 July 2025 11:09 PM IST
బికినీ కంటే ఘాటుగా దివి స్టన్నింగ్ లుక్!
X

టాలీవుడ్‌లో గ్లామర్‌తో పాటు అటిట్యూడ్‌కి కూడా ఓ రేంజ్ క్రేజ్ తెచ్చుకున్న యంగ్ బ్యూటీ దివి వాద్య. బిగ్‌బాస్ షోతో పాపులర్ అయిన ఈ గ్లామరస్ బ్యూటీ ఆ తర్వాత సినిమాలు, ఫ్యాషన్ షోస్, వెబ్ కంటెంట్‌తో మంచి హైప్ తెచ్చుకుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో దివి చేసే ఫోటోషూట్లు తరచూ వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా బాలి ట్రిప్‌లో ఆమె వేసుకున్న గ్రీన్ డ్రెస్‌లో ఆమె పెట్టిన ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్‌లో హీటెక్కిస్తున్నాయి.

గ్రీన్ మల్టీషేడెడ్ డిజైనర్ అవుట్‌ఫిట్‌లో దివి చేసిన ఈ ఫోటోషూట్ గ్లామర్, నేచురల్ వాతావరణం కలబోతగా ఆకట్టుకుంటోంది. ఫీల్డ్ బ్యాక్‌డ్రాప్ మధ్యలో ఆ డ్రెస్‌లో ఆమె చలాకీగా ఇచ్చిన పోజులు అందాన్ని ఓ కొత్త కోణంలో చూపిస్తున్నాయి. తళతళలాడే స్కిన్‌ టోన్‌, లాంగ్ హెయిర్‌, సింపుల్ మేకప్‌తో దివి ఇచ్చిన అటిట్యూడ్ కూడా ఈ లుక్స్‌కు హైలైట్ అయ్యింది. ఈ గ్లామరస్ లుక్ బికినీకి ఏమాత్రం తీసిపోనిది అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

దివి కెరీర్ విషయానికి వస్తే, మోడలింగ్ ద్వారా తన ప్రయాణాన్ని ప్రారంభించిన ఈ బ్యూటీ, బిగ్‌బాస్ షో ద్వారా మాస్ ఆడియెన్స్‌కి పరిచయమైంది. ఆ తర్వాత ‘ఎటిఎం’, ‘రుద్రంగి’ వంటి సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్‌ చేసింది. అయితే ఆమె అందానికి టాలీవుడ్‌లో ఇంకా అంతగా క్లిక్కయ్యే రోల్స్ రాలేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఆమె క్రేజ్ రెట్టింపైపోతోంది.

ఈ మధ్యకాలంలో దివి ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లపై కూడ కొన్ని వెబ్ షోస్‌, షార్ట్ ఫిలిమ్స్‌లో నటిస్తోంది. ట్రెడిషనల్ నుండి ట్రెండీ ఫ్యాషన్ వరకూ ఆమె ఫోటోషూట్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. గ్లామర్‌తో పాటు క్యారెక్టర్ నెరేటివ్ ఉన్న పాత్రలపై దివి ఆసక్తిగా ఉంది. తనను నటిగా నిరూపించుకోవాలన్న ఆతృత ఆమె పనితనంలో స్పష్టంగా కనిపిస్తోంది.