Begin typing your search above and press return to search.

వింటేజ్ లుక్‌లో దివి అందాల మాయ

ఇక లేటెస్ట్ గా షేర్ చేసిన వింటేజ్ స్టైల్ ఫోటోషూట్ ఫ్యాన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

By:  Tupaki Desk   |   8 May 2025 12:12 PM IST
Divi’s Vintage Look Stuns Fans with Class and Confidence
X

టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దివి సోషల్ మీడియాలో తరచూ డిఫరెంట్ ఫొటోలతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఆమె ట్రెడిషనల్ లుక్స్ లో చాలా అందంగా ఉంటుందని ఫ్యాన్స్ పాజిటివ్ కామెంట్స్ చేస్తూ ఉంటారు. ఇక లేటెస్ట్ గా షేర్ చేసిన వింటేజ్ స్టైల్ ఫోటోషూట్ ఫ్యాన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటోంది. తెల్లని షర్ట్, బ్లాక్ ప్యాంట్ లో వింతగా సస్పెండర్స్ ధరించిన లుక్ లో డివి ఎంతో ఎలిగెంట్ గా, స్టైలిష్ గా కనిపిస్తోంది.

వింటేజ్ లుక్ కి తగ్గట్టుగా ఆమె ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ అందరినీ ఆకర్షిస్తున్నాయి. ఈ ఫోటోలు కాస్త సీరియస్ గానూ, కాస్త స్టైలిష్ గానూ, దివి విభిన్న మూడ్ లను చూపిస్తున్నట్లు ఉన్నాయి. దివి మొదట మోడలింగ్ రంగంలో ప్రవేశించి అక్కడ నుంచి టెలివిజన్, వెబ్ సిరీస్ ద్వారా గుర్తింపు పొందింది. 'బిగ్ బాస్' రియాలిటీ షో ద్వారా ఆమెకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది. ఆ తర్వాత సినిమాల్లో కూడా చిన్న చిన్న అవకాశాలు అందుకుని తనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది.

దివి ప్రత్యేకత ఏమిటంటే, ఆమె ఎప్పుడూ గ్లామర్ మాత్రమే కాదు, తన నటనతో కూడా ఆకట్టుకోవాలని కష్టపడుతుండటం. ఈ ఫోటోషూట్ లో దివి మరింత రిఫ్రెష్ గా, కొత్తగా కనిపిస్తోంది. సింపుల్ మేకప్, నేచురల్ హెయిర్‌స్టైల్ తో ఆమె అందం మరింత నిండుగా కనిపిస్తోంది. అభిమానులు ఈ ఫోటోలు చూసి "సూపర్ లుక్", గ్లామర్ క్వీన్.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దివి తరచూ సోషల్ మీడియాలో ఇలా కొత్త కొత్త లుక్స్ తో అభిమానులకు కనువిందు చేస్తూ ఉంటుంది.

ప్రస్తుతం దివి పలు ఓటీటీ ప్రాజెక్టులు, ఈవెంట్ హోస్టింగ్, వెబ్ కంటెంట్ తో బిజీగా ఉంది. త్వరలోనే ఆమె ఓ కొత్త సినిమా ప్రకటన ఇవ్వనున్నట్టు టాక్. దివి గ్లామర్ ఫోటోషూట్స్ లోనే కాదు, తన వర్క్ కి డెడికేషన్ చూపిస్తూ క్రమంగా ఎదుగుతూ వస్తోంది. ఈ ఫోటోలు చూస్తే మాత్రం మరోసారి ఆమె ఎంతగా ట్రెండీగా ఆత్మవిశ్వాసంగా ఉంటుందో తెలుస్తుంది. మొత్తం గా ఈ వింటేజ్ లుక్ లో డివి ఫ్యాషన్ మరియు క్యూట్ ఎటిట్యూడ్ రెండింటినీ చూపిస్తూ ఫాలోవర్ల గుండెల్లో దూసుకెళ్లింది. ఇక ఆమె తదుపరి ప్రాజెక్ట్స్ ఏ విధంగా ఉంటాయో చూడాలి.