Begin typing your search above and press return to search.

పిక్ టాక్‌ : ఆకాశంలో 'కల్కి' జోడీ క్లిక్స్‌

యంగ్‌ రెబల్ స్టార్‌ ప్రభాస్‌ హీరోగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి సినిమా తాజా షెడ్యూల్‌ ఇటలీలో జరిగింది

By:  Tupaki Desk   |   7 March 2024 8:06 AM GMT
పిక్ టాక్‌ : ఆకాశంలో కల్కి జోడీ క్లిక్స్‌
X

యంగ్‌ రెబల్ స్టార్‌ ప్రభాస్‌ హీరోగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి సినిమా తాజా షెడ్యూల్‌ ఇటలీలో జరిగింది. అక్కడి అందమైన బీచ్‌ ల్లో పాట చిత్రీకరణ జరుపుతున్నట్లుగా ఇటీవల యూనిట్‌ సభ్యులు సోషల్‌ మీడియా ద్వారా లీక్ లు ఇచ్చిన విషయం తెల్సిందే.

అక్కడ నుంచి కొన్ని ఫోటోలు మరియు వీడియోలు కూడా లీక్ అయ్యాయి. ఎట్టకేలకు ఇటలీ షెడ్యూల్‌ ను కల్కి టీమ్‌ పూర్తి చేసినట్లుగా సమాచారం అందుతోంది. తిరుగు ప్రయాణంలో కల్కి ఉన్నట్లు ఇటీవల సోషల్‌ మీడియాలో వారు షేర్‌ చేసిన ఫోటోలను చూస్తే అర్థం అవుతుంది.

విమాన ప్రయాణం సమయంలో దిశా పటానీ తన ఫోన్ లో డార్లింగ్ ప్రభాస్ ను ఫోటో తీస్తున్నట్లు ఉన్న ఈ ఫోటో ను యూనిట్‌ సభ్యులు షేర్‌ చేశారు. ప్రస్తుతం ఈ పిక్ వైరల్‌ అవుతోంది. ఆకాశ మార్గంలో కల్కి జోడీ క్లిక్స్ అంటూ నెటిజన్స్‌ ఈ ఫోటోను తెగ షేర్ చేస్తూ ఉన్నారు.

కల్కి సినిమాలో మెయిన్‌ హీరోయిన్‌ గా దీపికా పదుకునే నటిస్తున్న విషయం తెల్సిందే. ఆమె పాత్రకు ఏ మాత్రం తగ్గకుండా దిశా పటానీ పాత్ర కూడా ఉంటుందని సమాచారం అందుతోంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఇటలీ షెడ్యూల్‌ తో కల్కి షూటింగ్‌ పూర్తి అయ్యింది. త్వరలోనే వీఎఫ్‌ఎక్స్ వర్క్‌ ను కూడా ముగించి అనుకున్నట్లుగా మే 9న విడుదల చేయడం ఖాయంగా తెలుస్తోంది.