Begin typing your search above and press return to search.

దిశాప‌టానీ విర‌హ‌జ్వాల‌.. FB షేక్ అయిందిగా

వ‌రుస‌ ఫోటోషూట్ల‌తో అగ్గి రాజేసే ఈ బ్యూటీకి సోష‌ల్ మీడియాల్లో ఉన్న ఫాలోయింగ్ అసాధార‌ణం

By:  Tupaki Desk   |   14 Aug 2023 4:26 AM GMT
దిశాప‌టానీ విర‌హ‌జ్వాల‌.. FB షేక్ అయిందిగా
X

అందం వేడి ఒకే ఒర‌లో ఇమిడితే అది- దిశాప‌టానీ. వ‌రుస‌ ఫోటోషూట్ల‌తో అగ్గి రాజేసే ఈ బ్యూటీకి సోష‌ల్ మీడియాల్లో ఉన్న ఫాలోయింగ్ అసాధార‌ణం. నిరంత‌రం దిశా నుంచి కొత్త అప్ డేట్ కోసం కోట్లాదిగా నెటిజ‌నులు వేచి చూస్తారంటే ఈ బ్యూటీపై ఉన్న క్ర‌ష్ ఎలాంటిదో అర్థం చేసుకోవాలి. అయితే దిశా ల‌వ్ లైఫ్ ఇటీవ‌ల కొత్త ట‌ర్న్ తీసుకోవ‌డం వెబ్ లో ప్ర‌ధానంగా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. త‌న రియ‌ల్ లైఫ్ క్ర‌ష్ టైగ‌ర్ ష్రాఫ్ కాద‌ని అత‌డి స్నేహితుడు జిమ్ కోచ్ అలెక్స్ ఇలిక్ అని ఇటీవ‌లే దిశాప‌టానీ హింట్ ఇవ్వ‌డం డిబేట‌బుల్ గా మారింది.


బోయ్ ఫ్రెండ్ టైగ‌ర్ ష్రాఫ్ నుంచి విడిపోయిన దిశా గ‌త కొంత‌కాలంగా జిమ్ కోచ్ అలెక్స్ తో డేటింగ్ చేస్తోందంటూ స‌న్నిహితంగా ఉన్న ఫోటోల‌ను నెటిజ‌నులు వైర‌ల్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం దిశా కొత్త ప్రియుడిపై వెబ్ లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. మ‌రోవైపు దిశా ప‌టానీ నిరంత‌ర ఫోటోషూట్లు వెబ్ ని హీటెక్కిస్తున్నాయి. ఇటీవ‌లే ఎఫ్.బి ప్రొఫైల్ లో ఓ కొత్త ఫోటోని అప్ లోడ్ చేసిన దిశా ల‌క్ష‌లాదిగా ఉన్న ఎఫ్.బి అభిమానుల్లో హాట్ డిబేట్ కి తెర‌తీసింది.

ఇది దిశా నుంచి నెవ్వ‌ర్ బిఫోర్ హాట్ లుక్ ఇది! అంటూ అభిమానులు దీనిపై కామెంట్లు చేస్తున్నారు. పాపుల‌ర్ బ్రాండ్ కెల్విన్ క్లెయిన్ ఇన్న‌ర్స్ ధ‌రించిన దిశా భంగిమ‌లు మైండ్ బ్లాక్ చేస్తున్నాయి. ప‌టానీ ఈ ఫోటోలో విర‌హాగ్నిని జ్వ‌లిస్తున్న తీరుకు యూత్ మ‌రిగిపోతోంది. బ్లూ ఇన్న‌ర్ టాప్ .. కాంబినేష‌న్ బ్లూ క‌ల‌ర్ లోవ‌ర్ తో హాటెస్ట్ దిశా మ‌తులు చెడ‌గొడుతోంది. ఈ ఫోటోని వీక్షించాక‌.. దిశా ఊంప్ ఫ్యాక్ట‌ర్ టూమ‌చ్ గా అగ్గి రాజేస్తోంది అంటూ ఫ్యాన్స్ ఘాటైన కామెంట్ల‌తో విరుచుకుప‌డుతున్నారు. ప్ర‌స్తుతం ఈ ఫోటోగ్రాఫ్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారుతోంది.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే... దిశా ప‌టానీ తదుపరి భారీ పాన్ ఇండియా చిత్రం ప్రాజెక్ట్ కేలో న‌టిస్తోంది. ప్రాజెక్ట్ K అకా కల్కి 2898 ADలో దీపిక ప్ర‌ధాన క‌థానాయిక కాగా దిశా కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నుంది. భార‌త‌దేశంలోనే తొలి పూర్తి స్థాయి సైన్స్ ఫిక్ష‌న్ సినిమాగా 'క‌ల్కి 2898 ఎడి' సంచ‌ల‌నాలు సృష్టించ‌డం ఖాయ‌మ‌న్న టాక్ వినిపిస్తోంది.