Begin typing your search above and press return to search.

అది నెపొటిజం ఎలా అవుతుంది..?

తాజాగా ఒక కార్యక్రమంలో దిశా పటానీ మాట్లాడుతూ... నేను మోడలింగ్‌ చేస్తున్న సమయంలో నాలోని నటిని గుర్తించిన వ్యక్తి కరణ్ జోహార్‌.

By:  Tupaki Desk   |   2 March 2024 5:46 AM GMT
అది నెపొటిజం ఎలా అవుతుంది..?
X

సినిమా ఇండస్ట్రీలో మెగా హీరో వరుణ్ తేజ్ 'లోఫర్‌' తో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ దిశ పటానీ. టాలీవుడ్ లో కెరీర్‌ ఆరంభించినప్పటికీ మొదటి సినిమా నిరాశ పరచడంతో బాలీవుడ్‌ లో బిజీగా ఉంది. అక్కడ చేసిన సినిమాలు మరియు పాత్రలు మంచి గుర్తింపు తెచ్చి పెట్టడంతో ప్రస్తుతం మోస్ట్‌ పాపులర్‌ హీరోయిన్స్ జాబితాలో చోటు దక్కించుకుంది.

హీరోయిన్‌ గా దిశ పటానీ ప్రస్తుతం చేస్తున్న సినిమాలు చాలానే ఉన్నాయి. చాలా కాలం తర్వాత సౌత్‌ లో కూడా ఈ అమ్మడు ప్రభాస్ కు జోడీగా నటిస్తున్న విషయం తెల్సిందే. హీరోయిన్ గా ఈ అమ్మడు ఇంత బిజీ గా ఉండటానికి కారణం ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహార్‌ అంటూ తాజా చిట్‌ చాట్‌ లో పేర్కొంది.

తాజాగా ఒక కార్యక్రమంలో దిశా పటానీ మాట్లాడుతూ... నేను మోడలింగ్‌ చేస్తున్న సమయంలో నాలోని నటిని గుర్తించిన వ్యక్తి కరణ్ జోహార్‌. నాలో ఉన్న ప్రతిభను చూసి ఆయన అవకాశం ఇచ్చారు. అంతే తప్ప నేను స్టార్‌ కిడ్ అని కాదు, మరేదో కారణం వల్లో కాదు.

నా ప్రతిభకు కరణ్‌ జోహార్‌ ఇచ్చిన ఆఫర్స్‌ ను కొందరు నెపొటిజం అంటూ విమర్శలు చేస్తున్నారు. నేను ఇండస్ట్రీలో అడుగు పెట్టిన తర్వాత హిట్స్ అంత సులభంగా రాలేదు. చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చాను. నెపోటిజం తో వచ్చిన వారు కష్టపడకుండా స్టార్స్ అవ్వగలరా అంటూ ఆమె ప్రశ్నించింది.

ఇండస్ట్రీలో నెపోటిజం అంటూ గతంలో తీవ్రమైన చర్చ జరిగేది. కానీ ఇప్పుడు కాస్త సైలెంట్‌ గానే పరిస్థితి ఉందని చెప్పాలి. ఇలాంటి సమయంలో దిశా పటానీ నెపోటిజం గురించి మాట్లాడటం, వారసత్వం ఉన్నంత మాత్రాన ఇండస్ట్రీలో అడుగు పెడితే నెపోటిజం అవ్వదు అన్నట్లుగా చెప్పుకొచ్చింది. దీని పై నెటిజన్స్‌ ఎలా రియాక్ట్‌ అవుతారు అనేది చూడాలి.