Begin typing your search above and press return to search.

దిశా ప‌టానీ అన్‌లిమిటెడ్ ట్రీట్

తాజాగా దిశా ప‌టానీ స‌మ్మ‌ర్ లుక్ వైర‌ల్ గా మారింది. ఇది బీచ్ వెకేష‌న్.. బోట్ షికార్‌ల‌తో ఫుల్ గా చిల్ అవుతోంది ప‌టానీ. ఈ సంద‌ర్భంగా స్పెష‌ల్ ఫోటోషూట్ తో అల‌రించింది.

By:  Tupaki Desk   |   8 Jun 2024 4:17 AM GMT
దిశా ప‌టానీ అన్‌లిమిటెడ్ ట్రీట్
X

లోఫ‌ర్ బ్యూటీ దిశా ప‌టానీ చాలా కాలం త‌ర్వాత టాలీవుడ్ లో తిరిగి అడుగుపెడుతోంది. ప్ర‌భాస్ క‌ల్కి 2898 AD చిత్రంలో దిశా ప‌టానీ ఛ‌మ‌క్కుల‌ను వీక్షించేందుకు అభిమానులు చాలా ఆత్రుత‌గా వేచి చూస్తున్నారు. ఇంత‌కుముందే ఆన్ లొకేష‌న్ ప్ర‌భాస్ తో దిశా ఎంతో స‌న్నిహితంగా ఉన్న ఫోటోలు, వీడియోలు వైర‌ల్ అయ్యాయి. ఇక టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లోను దిశా ఎంట్రీ ఇస్తోంది. అక్క‌డ సూర్య పాన్ ఇండియ‌న్ సినిమా 'కంగువ‌'లో దిశా స్పెష‌ల్ అప్పియ‌రెన్స్ అంతే ఛ‌మ‌క్కులా మైమ‌రిపిస్తుంద‌ని భావిస్తున్నారు.

ఇదిలా ఉంటే సోష‌ల్ మీడియాల్లో సీకే బ్యూటీ దిశా నిరంత‌ర ట్రీట్ గురించి అభిమానులు అంతే ఆస‌క్తిగా ముచ్చ‌టించుకుంటున్నారు. తాజాగా దిశా ప‌టానీ స‌మ్మ‌ర్ లుక్ వైర‌ల్ గా మారింది. ఇది బీచ్ వెకేష‌న్.. బోట్ షికార్‌ల‌తో ఫుల్ గా చిల్ అవుతోంది ప‌టానీ. ఈ సంద‌ర్భంగా స్పెష‌ల్ ఫోటోషూట్ తో అల‌రించింది.

ఒక ఫోటోగ్రాఫ్ లో అంత‌గా బ‌రువు లేని సింపుల్ ఫ్రాకులో దిశా అందంగా క‌నిపించింది. దిశా త‌న త‌ల‌ను ప‌క్క‌కు తిప్పి మిర్ర‌ర్ లో వీక్షిస్తూ అందంగా న‌వ్వుకుంటోంది. మ‌రో ఫోటోలో దిశా చిట్టి పొట్టి నిక్క‌రులో ప్ర‌త్య‌క్ష‌మైంది. బ్లూడెనిమ్స్ షార్ట్, పైన రెడ్ టాప్ తో ఎంతో హా*గా క‌నిపిస్తోంది. ఇదే ఫోటోషూట్ లో స్నేహితురాలితో క‌లిసి బోట్ షికార్ చేస్తూ సంద‌డిగాను క‌నిపిస్తున్న వీడియోని దిశా ప‌టానీ షేర్ చేసింది. ప్ర‌స్తుతం ఈ ఇన్ స్టా షూట్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారుతోంది.

అందంగా న‌వ్వావు కానీ ఎందుక‌లా అటువైపు తిప్పేసుకున్నావు! అంటూ దిశా మిర్ర‌ర్ ఫోటోని వీక్షించిన అభిమానులు స‌ర‌దాగా కామెంట్ చేస్తున్నారు. దిశా స్మైల్ మాత్ర‌మే కాదు.. త‌న ప‌ర్ఫెక్ట్ ఫిట్ బాడీకి ప్ర‌త్యేకించి ఫ్యాన్సున్నారు. దిశా న‌టించిన యోధ ఇటీవ‌లే విడుద‌లై ఆక‌ట్టుకుంది. త‌దుపరి పెద్ద సినిమాల రిలీజ్ ల కోసం ఎంతో ఆస‌క్తిగా వేచి చూస్తోంది.