Begin typing your search above and press return to search.

వీడియో: భ‌గ‌భ‌గ మ‌రిగించిన CK బ్యూటీ దిశా ప‌టానీ

ఈ ఫోటోలు, వీడియోలో దిశా టూ హాట్ గా క‌నిపిస్తోంది. దిశా గ్రే స్పోర్ట్స్ బ్రాలో సంథింగ్ స్పెష‌ల్ గా క‌నిపిస్తోంది.

By:  Tupaki Desk   |   1 Sep 2023 5:24 PM GMT
వీడియో: భ‌గ‌భ‌గ మ‌రిగించిన CK బ్యూటీ దిశా ప‌టానీ
X

బాలీవుడ్ అందాల‌ నటి దిశా పటానీ ప్ర‌ఖ్యాత సీకే బ్రాండ్ లోదుస్తుల‌కు ప్ర‌మోట‌ర్ గా కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. గ‌త మూడేళ్లుగా దివా ప‌టానీ సీకే లోదుస్తుల‌తో వ‌రుస ఫోటోషూట్ల‌ను షేర్ చేస్తోంది. అవ‌న్నీ అంత‌ర్జాలంలో అగ్గి రాజేస్తున్నాయి. స‌ద‌రు బ్రాండ్ కి గొప్ప ఇమేజ్ ని తేవ‌డంలో దిశా ప‌నిత‌నాన్ని ప్ర‌శంసించ‌ని వారు లేరు. తాజాగా CK ఫోటోషూట్‌ల నుండి దిశా పటాని మరో కొత్త ఫోటోని వీడియోని షేర్ చేసింది.


ఈ ఫోటోలు, వీడియోలో దిశా టూ హాట్ గా క‌నిపిస్తోంది. దిశా గ్రే స్పోర్ట్స్ బ్రాలో సంథింగ్ స్పెష‌ల్ గా క‌నిపిస్తోంది. ప్యాంట్‌ని అలా క్రిందికి లాగుతూ పోజులిచ్చిన తీరు యువ‌త‌రాన్ని క‌వ్విస్తోంది. తీర్చిదిద్దిన దిశా రూపం స‌మ్మోహ‌నంలో ముంచెత్తింది. మునుపెన్న‌డూ లేనంత హాట్ గా క‌నిపిస్తోంది. ఈ ఫోటోషూట్ విడుద‌లైన క్ష‌ణాల్లో అంత‌ర్జాలంలో వైర‌ల్ అయింది. ల‌క్ష‌లాదిగా క్లిక్ లు లైక్ ల‌తో వెబ్ హోరెత్తుతోంది.

దిశా వ్య‌క్తిగ‌తంగా బోయ్ ఫ్రెండ్ టైగర్ ష్రాఫ్ నుంచి విడిపోయిన తర్వాత కొత్త బాయ్‌ఫ్రెండ్ అలెగ్జాండర్ అలెక్స్‌తో సంబంధం ఉన్నట్లు ధృవీకరించింది. అలెక్స్‌ దిశా ముఖం కూడా టాటూ వేయించుకున్నాడు. ప్ర‌స్తుతం ఈ కొత్త జంట బాలీవుడ్ లో వేడి పెంచుతోంది. కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. దిశా ప‌టానీ న‌టించిన ఇటీవ‌లి సినిమాలు డిజాస్ట‌ర్ అయ్యాయి. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం కల్కి 2898ADలో న‌టిస్తోంది. మ‌రోవైపు సూర్య న‌టిస్తున్న పాన్ ఇండియా మూవీ కంగువలోను క‌థానాయిక‌గా ఆడిపాడుతోంది. యోధ వంటి భారీ హిందీ చిత్రంలోను న‌టిస్తోంది.