గుట్టు లీక్: PD అంటే `ప్రభాస్- దిశా`?
ప్రభాస్ - దిశా పటానీ జంట రహస్యంగా ఔటింగులకు వెళుతోంది! అంటూ హిందీ మీడియాలో కథనాలొచ్చాయి. కానీ దానికి సరైన ప్రూఫ్ ఏదీ దొరకలేదు.
By: Tupaki Desk | 8 May 2025 4:00 AM ISTసెలబ్రిటీ ప్రపంచంలో గాసిప్స్ చాలా సహజం. ముఖ్యంగా హీరో- హీరోయిన్ జంట కెమిస్ట్రీ వర్కవుటైతే దానికి కారణం ఆ ఇద్దరి మధ్యా తెరవెనక ఏదో జరుగుతోందని అభిమానులు భావించే అవకాశం ఉంది. అయితే కల్కి 2898 ఏడి లో ప్రభాస్ - దిశా మధ్య కెమిస్ట్రీ వర్కవుట్ అయ్యే సీన్లు ఏవీ లేవు కానీ, ఈ జంట ఆఫ్ ద స్క్రీన్ కెమిస్ట్రీ, షికార్ల గురించి చాలా గుసగుసలు వినిపించాయి. ప్రభాస్ - దిశా పటానీ జంట రహస్యంగా ఔటింగులకు వెళుతోంది! అంటూ హిందీ మీడియాలో కథనాలొచ్చాయి. కానీ దానికి సరైన ప్రూఫ్ ఏదీ దొరకలేదు.
ఇప్పుడు అనుకోకుండానే దిశా పటానీ ఒక హింట్ ఇచ్చింది. దిశా ఎడమ చేతిపై రెండక్షరాల టాట్టూ వెయ్యి జవాబు లేని ప్రశ్నల్ని అభిమానుల ముందు ఉంచింది. చాలా సింపుల్ గా PD అనే రెండక్షరాలను టాటూ పొడిపించుకుంది దిశా. ఇప్పుడు అభిమానులు ఈ రెండక్షరాల అర్థం ఏమిటా? అంటూ ఆరాలు తీయడం ప్రారంభించారు. PD అంటే ప్రభాస్- దిశా పటానీ అని అర్థం. మోచేతిపై టాటూ వేయించుకునేంత వరకూ సీన్ క్రియేటైంది! అంటూ అభిమానులు ఊహిస్తున్నారు.
కల్కి 2898 ఏడి సహనటుడు ప్రభాస్ తో దిశా నిండా ప్రేమలో ఉంది! అంటూ ముంబై ఫోటోగ్రాఫర్లు ఇప్పుడు ఠాంఠాం మోగిస్తున్నారు. ఈ స్పెషల్ ఫోటోగ్రాఫ్ ని జోరుగా వైరల్ చేస్తున్నారు. ఇది లవ్ టాటూనా లేదా బ్రాండ్ బ్లిట్జ్ కోసం లాంచ్‌ప్యాడ్ అనుకోవాలా? మోచేతి ఎచింగ్ అత్యంత ప్రభావవంతమైన ప్రచార మాధ్యమంగా మారాక దీనిని ఏ కోణంలో చూడాలి? ఇది కూడా పబ్లిసిటీ స్టంట్ అని అనుకోవాలా? ఇలాంటి వంద ప్రశ్నలకు సమాధానం లేనే లేదు. దిశా చేతిపై చెక్కిన టాటూ సింపుల్ గా ఉంది. కానీ సందేహాలు మాత్రం కాంప్లికేటెడ్ గా ఉన్నాయి. ఈ రెండక్షరాలతో దిశా సింపుల్ గా టీజ్ చేస్తోంది. ఎవరి ఊహాగానాలను వారికి వదిలేసింది.
అయితే ఈ టాటూకి వచ్చిన రెస్పాన్స్ కి దిశా కూడా చాలా ఆనందంలో ఉంది. ``నా టాటూ చుట్టూ చాలా ఉత్సుకత చూసి ఆనందించాను! ఆనందం దేని గురించో తెలుసుకోండి`` అంటూ మళ్లీ దిశా తన ఫ్యాన్స్ ని టీజ్ చేసింది. అయితే చావు కబురు చల్లగా చెప్పినట్టు పీడీ అంటే ప్రభాస్- దిశా కాదు! అమెజాన్ `ప్రైమ్ డే` అట. అందరిలో ఊహాగానాలు చెలరేగడం కోసం దిశా ఈ ట్రిక్కు ఉపయోగించింది. అయితే దిశాతో కలిసి అమెజాన్ ఇలాంటి చీటింగ్ గేమ్ ఆడటాన్ని నెటిజనులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇలాంటి చెత్త పబ్లిసిటీ ఐడియాలు అవసరం లేదని వార్నింగులు ఇస్తున్నారు. ఎలాంటి ప్రకటనల ఖర్చు లేకుండా ఇలాంటి ట్రిక్కులతో తమ బ్రాండ్ కి పబ్లిసిటీ చేసుకోవడం కోసం ఇలా దిగజారుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
