పిక్‌టాక్ : దిశా పటానీ బికినీలో అరాచకం
తాజాగా ఈమె తన బికినీ ఫోటోలను షేర్ చేసింది. బికినీ ధరించి మిర్రర్ సెల్ఫీ తీసుకున్న ఈ అమ్మడి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
By: Tupaki Desk | 23 May 2025 2:17 PM ISTమెగా హీరో వరుణ్ తేజ్‌తో కలిసి పదేళ్ల క్రితం 'లోఫర్' సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయిన ముద్దుగుమ్మ దిశా పటానీ. తెలుగులో ఈమె చేసిన మొదటి సినిమాకు నిరాశ మిగిలింది. టాలీవుడ్‌లో దిశా పటానీ ఆఫర్లు దక్కించుకోలేక పోవడంతో బాలీవుడ్‌లో ప్రయత్నాలు చేసింది. బాలీవుడ్‌లో లక్కీగా ఈ అమ్మడికి ఎంఎస్ ధోనీ సినిమాలో నటించే అవకాశం దక్కింది. ధోనీ సినిమా సూపర్ హిట్ కావడంతో లోఫర్ బ్యూటీ దిశా పటానీకి మంచి విజయం దక్కించుకుంది. ధోనీ సినిమా తర్వాత దిశా పటానీ కెరీర్‌లో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. 2018లో ఈమె చేసిన బాఘి 2 సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో బాలీవుడ్‌లో టాప్ స్టార్‌గా నిలిచింది.
తెలుగులో లోఫర్ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని 'కల్కి 2898 ఏడీ' సినిమాలో నటించింది. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన కల్కి సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్నప్పటికీ దిశా పటానీ స్క్రీన్ స్పేస్ తక్కువ ఉంది. ప్రస్తుతం బాలీవుడ్‌లో వెల్‌కమ్ టు జంగిల్ సినిమాను చేస్తుంది. మరో వైపు తెలుగులోనూ ఈమె ఒక సినిమాకు ఓకే చెప్పే అవకాశాలు ఉన్నాయి. కల్కి 2898 ఏడీ పార్ట్ 2 లో కూడా ఈమె నటించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ ఏడాది చివరి వరకు కల్కి 2898 ఏడీ 2 సినిమా షూటింగ్ ప్రారంభిస్తామని దర్శకుడు నాగ్ అశ్విన్, నిర్మాతలు చెప్పిన విషయం తెల్సిందే.
కల్కి 2 సినిమాలో దిశా పటానీ ఎక్కువ స్క్రీన్ ప్రజెన్స్ ఉంటుందేమో చూడాలి. సినిమాలతో కాస్త తక్కువే కానీ సోషల్ మీడియాలో ఈమె చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. రెగ్యులర్‌గా అందమైన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఈమె తన బికినీ ఫోటోలను షేర్ చేసింది. బికినీ ధరించి మిర్రర్ సెల్ఫీ తీసుకున్న ఈ అమ్మడి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ స్థాయిలో అందాల ఆరబోత ఫోటోలు గతంలో కూడా చాలా సార్లు షేర్ చేసింది. కానీ ఈమె ఈసారి బికినీ ధరించి మిర్రర్ సెల్ఫీ తీసుకోవడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది. బాలీవుడ్ ముద్దుగుమ్మలు హద్దులు చెరిపేసి మరీ బికినీ ట్రీట్ చేస్తున్నారని ఈ ఫోటోలను చూస్తే అనిపిస్తుంది.
ఉత్తర ప్రదేశ్‌లోని బరేలీలో 1992లో జన్మించిన ఈ అమ్మడు హిందూ కుమావోనీ రాజ్‌పూత్ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చింది. తండ్రి జగదీష్ సింగ్ పటానీ పోలీస్ ఆఫీసర్ కాగా, తల్లి హెల్త్ డిపార్ట్‌మెంట్‌లో జాబ్ చేసేది. దిశా పటానీ సోదరి ఖుష్బూ పటానీ ఇండియన్ ఆర్మీలో లెఫ్టినెంట్ హోదాలో విధులు నిర్వహిస్తుంది. దిశా కి తమ్ముడు కూడా ఉన్నాడు. లక్నోలోని యూనివర్శిటీలో ఇంజనీరింగ్ జాయిన్ అయింది. ఇంజనీరింగ్ పూర్తి చేయకుండానే మోడలింగ్‌పై ఆసక్తితో ఫెమినా మిస్ ఇండియా ఇండోర్ 2013లో పాల్గొంది. ఆ కాంపిటీషన్‌లో మొదటి రన్నరప్‌గా నిలిచింది. బాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్స్ జాబితాలో నిలిచింది.
