దిశా సెల్ఫీ దెబ్బకు మైండ్ బ్లాక్
ప్రస్తుతం ఈ స్పెషల్ ఫోటోగ్రాఫ్ ఇంటర్నెట్ లో దుమారం రేపుతోంది.
By: Tupaki Desk | 15 May 2025 10:03 PM ISTసెల్ఫీ క్వీన్ దిశా పటానీ మరోసారి సెల్ఫీతో చెలరేగింది. ఆదమరిచి సెల్ఫీ తీసుకుంటున్న దిశా పటానీని సీసీ కెమెరా ఎలా క్లిక్ చేసిందో చూసారు కదా! అలా గదిలో బికినీ అందాలను తనివి తీరా చూసుకుంటూ పనిలో పనిగా సెల్ఫీ కోసం ట్రై చేస్తూ ఇలా దొరికిపోయింది. ప్రస్తుతం ఈ స్పెషల్ ఫోటోగ్రాఫ్ ఇంటర్నెట్ లో దుమారం రేపుతోంది.
దిశా పటానీ ఇటీవల తన చేతిపై PD అనే పచ్చబొట్టుతో కనిపించి రకరకాల సందేహాలకు తెర తీసింది. పి - అంటే ప్రభాస్. డి అంటే దిశా.. ఆ ఇద్దరి మధ్యా ఏదో నడుస్తోంది అంటూ ఒకటే ప్రచారం సాగింది. కల్కి 2898 ఏడి లో నటించాక ఆ ఇద్దరి మధ్యా స్నేహం పెరిగిందన్న గుసగుస వినిపించింది. అయితే పిడి అంటూ టీజ్ చేసిన దిశా పాపులర్ కమర్షియల్ బ్రాండ్ కి ప్రచారం చేసుకుంది.
ఇదిలా ఉంటే ఇటీవల కొందరు కుర్రాళ్లు తమ గదుల్లో దిశా పోస్టర్‌ను ఉంచి, ఆన్‌లైన్‌లో తమ ప్రేమను ప్రకటించిన చిలిపి పని సంచలనం సృష్టించింది. ముఖ్యంగా కాలేజీ అబ్బాయిల బృందం దాని కంటే వింతైన పనితో చర్చగా మారారు. వ్యాలెంటైన్స్ డే పేరుతో యూత్ బోలెడంత రచ్చ చేసారు. బోయ్స్ అంతా ఏదో ఒక రోజు తమ కన్యత్వాన్ని కోల్పోవడానికి ఒక పూజలు పునస్కారాలు చేయడం షాక్ కి గురి చేసింది. దిశా అందచందాల ప్రదర్శన, నటనకు వీరంతా వీరాభిమానులు. ప్రస్తుతం ఈ స్పెషల్ ఫోటోగ్రాఫ్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతోంది.
