Begin typing your search above and press return to search.

ట్రెడిషనల్ టచ్ లో దిశా పటాని హై గ్లామర్ ట్రీట్

ఆమె నటనతో పాటు గ్లామర్ అందాల గురించి కూడా సోషల్ మీడియాలో నిత్యం చర్చ జరుగుతూనే ఉంటుంది.

By:  Tupaki Desk   |   17 April 2025 1:00 AM IST
ట్రెడిషనల్ టచ్ లో దిశా పటాని హై గ్లామర్ ట్రీట్
X

బాలీవుడ్ గ్లామర్ డాల్ దిశా పటానీ ఎంత స్టైలిష్‌గా ఉండాలో మరోసారి నిరూపించింది. తాజాగా ఆమె ఓ ఈవెంట్‌కు హాజరైన సమయంలో ధరించిన ఆరెంజ్ కలర్ ఔట్‌ఫిట్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అందమైన చీరకు మ్యాచింగ్ బ్లౌజ్, డీప్ నెక్ డిజైన్‌తో క్లాసీగా, మోడరన్‌గా కనిపించిన దిశా పటానీ లుక్కు నెటిజన్లను ముగ్ధులను చేస్తోంది.

ఈ ఫొటోల్లో దిశా కవర్ చేసిన ఎక్స్‌ప్రెషన్స్, ఆమె హుందా చిరునవ్వు చూసిన వారెవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. అందంతో పాటు స్టైల్‌కు ప్రాధాన్యత ఇచ్చే దిశా.. ఈసారి తన గ్లామర్ టచ్తో ఆకట్టుకుంది. కేప్ షైను వర్క్ ఉన్న ఈ దుస్తులు ఆమెపై ఎంతో గ్రేస్‌ని చూపించాయి. జ్యూవెలరీ, వేవీ హేర్ స్టైల్‌తో ఆమె లుక్ మరింత మెరిసిపోయింది. దిశా పటానీ కెరీర్ విషయానికొస్తే.. మోడలింగ్‌తో తన ప్రయాణం మొదలుపెట్టి, 'లోఫర్' సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది.

ఆ తర్వాత బాలీవుడ్‌కు వెళ్లిన దిశా, 'ఎమ్‌.ఎస్‌.ధోనీ: ది అన్‌టోల్డ్ స్టోరి', 'బాఘీ 2', 'మలంగ్', 'ఏక్ విలన్ రిటర్న్స్' వంటి సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఆమె స్టంట్స్, డ్యాన్స్‌లు కూడా యువతలో మంచి ఫాలోయింగ్ తెచ్చాయి. ప్రస్తుతం దిశా పటానీ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ మీద దృష్టి పెట్టింది. ప్రభాస్‌తో 'కల్కి 2898 ఏ.డి.'లో కూడా ఆమె కీలక పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే.

ఆమె నటనతో పాటు గ్లామర్ అందాల గురించి కూడా సోషల్ మీడియాలో నిత్యం చర్చ జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు వచ్చిన ఈ ఫొటో షూట్ కూడా దిశా హాట్ ఇమేజ్‌ను మరింత పెంచేసింది. ఇక ఈ లుక్స్ చూసిన నెటిజన్లు “ఫైర్!”, “అందానికి నిర్వచనం ఈమె”, “ఎక్స్‌ప్రెషన్‌లో క్లాస్”, అంటూ కామెంట్స్ పెట్టుతున్నారు. నిజంగానే దిశా ఈ ఫొటో లుక్‌తో మరోసారి హాట్ టాపిక్ అయ్యింది. తెరపైనే కాకుండా సోషల్ మీడియా లెవెల్లోనూ ఆమె జోరు అదే స్థాయిలో నడుస్తోంది.