Begin typing your search above and press return to search.

దిశా-మౌని ఎమోష‌న‌ల్ బాండింగ్!

గుడ్ ఫ్రెండ్స్ చిట్టి పొట్టి దుస్తుల్లో ఎంతో జాలీగా టైమ్ స్పెండ్ చేస్తున్న ఈ ఫోటోగ్రాఫ్స్ ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ గా మారుతున్నాయి.

By:  Tupaki Desk   |   13 Jun 2025 10:27 PM IST
దిశా-మౌని ఎమోష‌న‌ల్ బాండింగ్!
X

దిశా పటానీ- మౌని రాయ్ స్నేహం అన్నివేళ‌లా స్ఫూర్తి నింపుతుంది. ఆ ఇద్ద‌రూ ఒక‌రికోసం ఒక‌రు. ఎప్పుడూ ఒక‌రికొక‌రు ప‌ట్టించుకునే మంచి మ‌న‌సు స్నేహితుల‌ ప్ర‌త్యేక‌త‌. అందుకే 33వ బ‌ర్త్ డే జ‌రుపుకున్న దిశా ప‌టానీ త‌న స్నేహితురాలు మౌని గురించి అంత‌గా ఎమోష‌న‌ల్ అవుతోంది.

ఈ భామ‌లు క‌లిసి షికార్లు చేయ‌డ‌మే కాదు.. క‌లిసి ఫోటోషూట్ల‌కు ఫోజులివ్వ‌డమే కాదు. లైఫ్ గోల్స్ విష‌యంలోను అంద‌రికీ స్ఫూర్తి. బికినీ బీచ్ వెకేష‌న్ అయినా ఏదైనా ప‌బ్లిక్ ఈవెంట్ అయినా, ర్యాంప్ వాక్ అయినా స్నేహితురాళ్ల సంద‌డి అంతా ఇంతా కాదు. ఇప్పుడు దిశా బ‌ర్త్ డే నుంచి కొన్ని స్నాప్స్ సోషల్ మీడియాల్లో షేర్ చేయ‌గా అవి గుబులు రేపుతున్నాయి.

గుడ్ ఫ్రెండ్స్ చిట్టి పొట్టి దుస్తుల్లో ఎంతో జాలీగా టైమ్ స్పెండ్ చేస్తున్న ఈ ఫోటోగ్రాఫ్స్ ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ గా మారుతున్నాయి. ఆ ఇద్ద‌రి బంధం అక్కా చెల్లెళ్ల బంధం. మౌనీ దిశాను `చెల్లి` అని పిలుస్తుంది. త‌న‌కోసం ఎప్పుడూ ఆలోచించే ఒక చెల్లి అని ఎమోష‌న‌ల్ అవుతుంది. అందుకే ఈ జోడీ ఎక్క‌డ క‌నిపించినా అది ఒక సెల‌బ్రేష‌న్ లా మారుతుంది. ``నా మనసును దోచే, ఉత్తేజపరిచే, అత్యంత అందమైన చెల్లి.

నా బెస్ట్ ఫ్రెండ్ & ప్రిన్సెస్‌పెస్సా. నిన్ను తయారు చేసే అన్ని లక్షణాలు అణువులను ప్రేమిస్తున్నాను. నా గురించి ఆలోచించే నీతో స్నేహం ఆనందాన్నిస్తుంది. నీ అతిగా ఆలోచించే మెదడు & గాఢంగా ప్రేమించే హృదయం .. దేవుడు నీకు అన్నీ ఇవ్వాలి. నీకు తెలిసిన దానికంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నాను`` అని ఎమోష‌న‌ల్ నోట్ రాసింది మౌని.

బ‌ర్త్ డే మూడ్ నుంచి బ‌య‌ట‌కు రాగానే, నెక్ట్స్ ప్రాజెక్ట్ గురించి ఈ భామ‌లు ఆలోచించాల్సి ఉంది. దిశా త‌దుప‌రి ప‌లు క్రేజీ ప్రాజెక్టుల్లో న‌టించ‌నుంది. మౌనిరాయ్ పెళ్లి త‌ర్వాతా కెరీర్ ప‌రంగా బిజీగా ఉంది.