పిక్‌టాక్ : రెడ్ డ్రెస్‌లో చూపు తిప్పనివ్వని దిశా
ఇక సోషల్ మీడియా ద్వారా రెగ్యులర్‌గా అందమైన ఫోటోలను షేర్ చేయడం ద్వారా దిశా పటానీ అత్యధిక ఫాలోవర్స్‌ను సొంతం చేసుకుంది.
By: Tupaki Desk | 7 May 2025 2:00 AM ISTపదేళ్ల క్రితం టాలీవుడ్‌లో లోఫర్ సినిమాతో హీరోయిన్‌గా కెరీర్‌ను ప్రారంభించిన ముద్దుగుమ్మ దిశా పటానీ. మొదటి సినిమానే నిరాశ పరచినా టాలీవుడ్ నుంచి తిరస్కరణ గురి అయినా కూడా ఏమాత్రం నిరుత్సాహం చెందకుండా బాలీవుడ్‌లో ప్రయత్నాలు చేసి, అక్కడ కష్టపడి ఫలితం దక్కించుకుంది. ఇండస్ట్రీలో ఉన్న పరిచయాలతో ఆఫర్లు దక్కుతాయి, కానీ హిట్స్ దక్కవని, గుర్తింపు రాదనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దిశా పటానీకి ఇండస్ట్రీలో మంచి గుర్తింపు దక్కడంకు కారణం ఆమె కష్టపడే తత్వం అంటారు. తనకు వచ్చిన పాత్రకు న్యాయం చేయడం కోసం దిశా పటానీ చాలా కష్టపడుతుందని ఆమెతో వర్క్ చేసిన ఫిల్మ్ మేకర్స్ అంటూ ఉంటారు.
హీరోయిన్‌గా ప్రస్తుతం దిశా పటానీ బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా వరుస సినిమాలు చేస్తున్న విషయం తెల్సిందే. నటిగా తనను తాను నిరూపించుకోవడం కోసం లేడీ ఓరియంటెడ్ పాత్రలకు సైతం దిశా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక సోషల్ మీడియా ద్వారా రెగ్యులర్‌గా అందమైన ఫోటోలను షేర్ చేయడం ద్వారా దిశా పటానీ అత్యధిక ఫాలోవర్స్‌ను సొంతం చేసుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఏకంగా 61.4 మిలియన్‌ల ఫాలోవర్స్‌ను ఈ అమ్మడు సొంతం చేసుకుంది. బాలీవుడ్‌లో ఈ స్థాయిలో ఫాలోవర్స్‌ను కలిగి ఉన్న హీరోయిన్స్ అతి కొద్ది మంది మాత్రమే ఉన్నారు. తన ఫాలోవర్స్‌కి రెగ్యులర్‌గా వినోదాన్ని పంచడం కోసం ఈమె ఇలాంటి ఫోటో షూట్స్‌ను షేర్ చేస్తూ ఉంటుంది.
దిశా పటానీ హీరోయిన్‌గా ఎన్నో సినిమాల్లో నటించింది. సినిమాల్లో అందాల ఆరబోతతో పాటు నటనకు ప్రాముఖ్యత ఇస్తూ ఉంటుంది. ఇక ఇన్‌స్టాగ్రామ్‌లోనూ అన్ని రకాల ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా రెడ్ డ్రెస్‌లో అందాల ఆరబోత ఫోటోలను షేర్ చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ స్థాయిలో అందాల ఆరబోత కేవలం దిశా పటానీకే సాధ్యం అంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. అందమైన దిశా పటానీ అంతకు మించి అందమైన ఫోటో షూట్స్‌తో అదరగొట్టింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కవ్వించే చూపులతో అదరగొడుతున్న దిశా పటానీ ఈ ఫోటో షూట్‌తో ఫాలోవర్స్ సంఖ్య మరింతగా పెంచుకోవడం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
తెలుగులో ఈ అమ్మడు ప్రభాస్‌కి జోడీగా కల్కి 2898 ఏడీ సినిమాలో నటించి మెప్పించింది. ఆ సినిమాలో దిశా పటానీ లుక్‌తో పాటు బాడీ లాంగ్వేజ్‌తోనూ ఆకట్టుకుంది. ఇక బాలీవుడ్‌లోనూ ఈమెకు మరిన్ని సినిమాల్లో నటించే అవకాశాలు వస్తున్నాయి. ఈమె గత ఏడాది తమిళ్ మూవీ కంగువాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశ పరచడంతో మరోసారి కోలీవుడ్ మూవీలో ఈమె నటించేందుకు ఆసక్తి చూపించక పోవచ్చు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. టాలీవుడ్‌లో మాత్రం ఈమె ముందు ముందు మరిన్ని సినిమాలు చేస్తుందేమో చూడాలి. ప్రస్తుతానికి హిందీలో ఈమె రెండు మూడు సినిమాలు చేస్తోంది.
