500 రూపాయలతో ముంబైలో దిగిన దిశాపటానీ!
'లోఫర్' తో టాలీవుడ్ కి పరిచయమైన దిశాపటానీ జర్నీ తెలిసిందే. నటిగానూ ఇదే తొలి చిత్రం కావడంతో? చాలా ఆశలతో లాంచ్ అయింది గానీ...
By: Tupaki Desk | 16 Jun 2025 11:34 AM IST'లోఫర్' తో టాలీవుడ్ కి పరిచయమైన దిశాపటానీ జర్నీ తెలిసిందే. నటిగానూ ఇదే తొలి చిత్రం కావడంతో? చాలా ఆశలతో లాంచ్ అయింది గానీ...అటుపై తెలుగులో ఛాన్సులందుకోలేకపోయింది. కానీ బాలీవుడ్ లో మాత్రం బిజీ అయింది. అందం..అభినయానికి హిందీ పరిశ్రమ ప్రోత్సహించడంతో అవకాశాలు అందుకుంటుంది. 'కల్కి 2898' లో నూ అమ్మడు నటించిన సంగతి తెలిసిందే. సినిమాలో దిశా పటానీ కీలక పాత్రలో అలరించింది.
తమిళ్ లోనూ కొన్ని సినిమాలు చేసింది. కానీ అక్కడా కలిసి రాలేదు. 'కంగువ'లో ఈ భామనే నటించింది. కానీ ఫలితం నిరాశపరిచిన సంగతి తెలిసిందే. తాజాగా దిశా పటానీ ముంబైకి ఎలా ల్యాండ్ అయిందన్న విషయాన్ని రివీల్ చేసింది. 'చేతిలో 500 రూపాయలతో ముంబైలో దిగాను. అలాగే ఆడిషన్లకు వెళ్లేదాన్ని. ఎక్కువగా టీవీ వాణిజ్య ప్రకటనల కోసం వెళ్లాను. ఈ క్రమంలోనే ఓ సినిమాలో నటించే ఛాన్స్ వచ్చింది.
అదే నా మొదటి చిత్రం. కానీ ఆ సినిమా ప్రారంభం కావడానికి ముందే నన్ను తొలగించారు. నా స్థానంలో మరో నటిని తీసుకున్నారు. ఈ విషయంలో నేనేం బాధపడలేదు. కానీ ప్రతీది జరగడానికి ఓ కారణం ఉంటుంది. తిరస్కరణలు నన్ను మరింత రాటు దేలేలా చేసాయి. ఈ దశలో ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. అయినా ఏ నాడు వెనక్కి తగ్గలేదు. పని చేసుకుంటూ వెళ్లడమే నేర్చుకున్నాను.
అదే నాకు గొప్ప కెరీర్ ను అందించింది. ఈ క్రమంలో అవమానాలు..హేళనలు సహజం. వాటిని పట్టిం చుకుంటే జీవితంలో ముందుకెళ్లలేం ' అని తెలిపింది. దిశా పటానీ కుంగ్ పూ యోగా అనే చైనా చిత్రం లోనూ నటించింది. ఇందులో జాకీ చాన్ నటించారు. ఇదే సినిమాతో మరికొంత మంది బాలీవుడ్ భామలు నటించారు.
