దిశా పటానీ కొత్త లుక్‌పై నెటిజన్ల ట్రోలింగ్...హాట్ టాపిక్!
ఇక ఒకవైపు దిశా డ్రెస్సింగ్ స్టైల్‌ను కొందరు తప్పుబడుతుంటే, మరొకవైపు ఆమె అభిమానులు సపోర్ట్‌గా నిలుస్తున్నారు.
By: Tupaki Desk | 15 Sept 2026 7:55 PM ISTబాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటానీ ఎక్కడ కనిపించినా తన గ్లామరస్ డ్రెస్సింగ్‌తో వార్తల్లో నిలవడం అలవాటే! అయితే ఈసారి ఆమె హాజరైన వేడుక, వేసుకున్న దుస్తుల కారణంగా సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ఇటీవల ముంబైలో జరిగిన గణపతి వేడుకలకు దిశా పటానీ ధరించిన 'డీప్-కట్' బ్లౌజ్ మరియు రివీలింగ్ లెహంగా నెటిజన్లకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ఆధ్యాత్మిక పండుగలోనూ ఇంత గ్లామర్ షో అవసరమా అంటూ ప్రస్తుతం ఆమెను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.
ఎరుపు రంగు లెహంగాలో గ్లామరస్ ఎంట్రీ!:
వినాయక చతుర్థి పూజల కోసం దిశా పటానీ ఎరుపు రంగు ఎంబ్రాయిడరీ లెహంగా లో ఫోజులిచ్చింది. అయితే దానికి జతగా వేసుకున్న తీవ్రమైన లోతైన మెడ భాగం కలిగిన బ్లౌజ్ అందరి దృష్టినీ ఆకర్షించింది. ఇక చెవిపోగులు, గాజులు, వదులుగా వదిలేసిన హెయిర్‌తో ఆమె మెరిసినప్పటికీ, పండుగ వాతావరణానికి ఆమె ఎంచుకున్న అవుట్‌ఫిట్ మ్యాచ్ అవ్వలేదని నెటిజన్లు ఆరోపిస్తున్నారు.
సోషల్ మీడియాలో ఘాటు ట్రోలింగ్! :
ఈ ఫోటోలు, వీడియోలు ఆన్‌లైన్‌లో వైరల్ కాగానే నెటిజన్ల నుంచి విమర్శల వర్షం కురిసింది. "సినిమా ఈవెంట్లలో ఇలాంటి దుస్తులు సహజమే కానీ, పవిత్రమైన గణపతి పూజలో కూడా ఇలా కనిపించడం ఏంటి ? పూజల సమయంలో తగిన డ్రెస్ కోడ్ ఉండాలి కదా!అంటూ కామెంట్ల రూపంలో దిశాని నెటిజన్లు కడిగిపారేస్తున్నారు. గతంలో కృతి సనన్ రాఖీ యాడ్‌పై వచ్చిన విమర్శలనే ఇప్పుడు దిశా కూడా ఎదుర్కొంటోంది.
నెటిజన్ల వార్ – సపోర్ట్ చేస్తున్న మరో వర్గం!:
ఇక ఒకవైపు దిశా డ్రెస్సింగ్ స్టైల్‌ను కొందరు తప్పుబడుతుంటే, మరొకవైపు ఆమె అభిమానులు సపోర్ట్‌గా నిలుస్తున్నారు. నచ్చిన దుస్తులు వేసుకునే స్వేచ్ఛ ఆమెకు ఉందని, సంప్రదాయ దుస్తుల్లోనే మోడర్న్ టచ్ ఎంచుకుందని కొందరు సమర్థిస్తున్నారు. దీంతో సోషల్ మీడియా టైమ్‌లైన్లలో ఇరు వర్గాల మధ్య తీవ్రస్థాయిలో కామెంట్స్ వార్ నడుస్తోంది.
ఇక ఇప్పుడు సెలబ్రిటీలు బహిరంగ ప్రదేశాల్లో, ముఖ్యంగా ఆధ్యాత్మిక వేడుకల్లో ఎలాంటి దుస్తులు ధరిస్తున్నారనే దానిపై రోజురోజుకూ సోషల్ మీడియా లో చూసే వాళ్ళ నిఘా, విమర్శలు పెరుగుతున్నాయి. దిశా పటానీ కాస్ట్యూమ్‌పై జరుగుతున్న ఈ రచ్చ ప్రస్తుతం బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
