పొట్టి ఫ్రాకులో దిశా పటానీ కిల్లింగ్
సీకే బ్యూటీ దిశా పటానీ బోల్డ్ ఫోటోషూట్లు, బికినీ విన్యాసాల గురించి చెప్పాల్సిన పని లేదు.
By: Tupaki Desk | 22 April 2025 9:38 PM ISTసీకే బ్యూటీ దిశా పటానీ బోల్డ్ ఫోటోషూట్లు, బికినీ విన్యాసాల గురించి చెప్పాల్సిన పని లేదు. నటిగా కెరీర్ లో ఆశించిన విజయాలేవీ లేకపోయినా, గూగుల్ లో ట్రెండింగ్ బ్యూటీగా నిరంతరం యువతరం హృదయాల్లో గిలిగింతలు పెడుతూనే ఉంది. పాపులర్ లోదుస్తుల బ్రాండ్ కెల్విన్ క్లెయిన్ బ్రాండ్ అంబాసిడర్ గా దిశా పేరు మార్మోగింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో దిశా పటానీ ఫాలోయింగ్ అమాంతం పెరగడానికి సీకే లోదుస్తుల ప్రచారం ఒక ఎత్తుగడ.
స్విమ్ సూట్లు, బికినీలు, యోగా భంగిమలు.. వరుస ఫోటోషూట్లతో సోషల్ మీడియాల్లో దిశా కంటికి కునుకుపట్టనివ్వని ట్రీటిస్తోంది. తాజాగా ఈ బ్యూటీ పొట్టి ఫ్రాకులో థై సొగసులను ప్రదర్శిస్తున్న ఫోటోషూట్ ఇంటర్నెట్ ని షేక్ చేస్తోంది. దిశా సిల్వర్ కలర్ మిరుమిట్లు గొలిపే ఫ్రాక్ లో అందాలను ఆరబోసింది. బాడీ హగ్గింగ్ క్రిస్టలైన్ ఫ్రాక్ మెరుపులు మిరుమిట్లతో కళ్లు చెదిరే ట్రీటిస్తోంది.
ఎప్పటిలాగే దిశా లేటెస్ట్ ఫోటోషూట్ ని యూత్ వైరల్ గా షేర్ చేస్తోంది. దిశా ఈ కొత్త లుక్ లో కిల్లింగ్ అంటూ అభిమానులు కితాబిచ్చేస్తున్నారు. కెరీర్ మ్యాటర్ కి వస్తే... దిశా పటానీ ఇటీవలే కల్కి 2898 ఏడి లో నటించింది. అటు తమిళంలో సూర్య కంగువలోను దిశా నటించిన సంగతి తెలిసిందే. తదుపరి బిగ్ సినిమా గురించి ఇంకా ప్రకటించాల్సి ఉంది.
