ఒకే సినిమాలో రెండు ఐటం పాటలా?
బాలీవుడ్ లో దిశాపటానీ కెరీర్ దేదీప్యమానంగా సాగిపోతున్న సంగతి తెలిసిందే. వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉంది. సౌత్ లోనూ మంచి అవకాశాలు వస్తున్నా? అమ్మడికి మాత్రం సరైన సక్సెస్ పడటం లేదు.
By: Tupaki Desk | 10 July 2025 12:00 AM ISTబాలీవుడ్ లో దిశాపటానీ కెరీర్ దేదీప్యమానంగా సాగిపోతున్న సంగతి తెలిసిందే. వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉంది. సౌత్ లోనూ మంచి అవకాశాలు వస్తున్నా? అమ్మడికి మాత్రం సరైన సక్సెస్ పడటం లేదు. దీంతో సౌత్ మార్కెట్ లో దిశా బాగా వెనుకబడింది. 'కంగువా'తో పాన్ ఇండియాని దున్నేస్తుందని అంచనాలు ఏర్పడ్డాయి. కానీ ఫలితం తీవ్ర నిరాశను మిగిల్చింది. ఆ తర్వాత మళ్లీ ఇంత వరకూ మరో సౌత్ సినిమాకు సైన్ చేయలేదు. అలాగని హీరోయిన్ అవకాశాలే కావాలని కూర్చోలేదు.
ఐటం భామగానూ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా షాహిద్ కపూర్-త్రిప్తీ డిమ్రీ జంటగా విశాల్ భరద్వాజ్ తెరకెక్కిస్తోన్న చిత్రంలో ఐటం భామగా అవకాశం అందుకుంది. అయితే దిశాను ఒక్క పాట కోసం రెండు పాటల కోసం ఎంపిక చేసారు. సినిమాలో రెండు ఐటం పాటలున్నాయట. రెండు పాటల్లోనూ దిశా పటానీనే నటిస్తుందట. అందుకుగాను అమ్మడికి భారీగానే పారితోషికం ఇస్తున్నారట. రెండు మంచి మాస్ మసాలా పాటలుగా తెలుస్తోంది.
అందాల ప్రదర్శనలో దిశ ఎలివేషన్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఆఫ్ ది స్క్రీన్ పై దిశా ఎలివేషన్ పీక్స్ లో ఉంటాయి. ఆన్ ది స్క్రీన్ లో ఇంకే రేంజ్ లో హైలైట్ అవుతుందో చెప్పాల్సిన పనిలేదు. ఈ రెండు పాటలకు సంబంధించి ప్రత్యేకంగా రెండు సెట్లు సిద్దం చేస్తున్నారట. ఇందులో షాహిద్ తో పాటు దిశా పటాని స్టెప్పులు వేయనుంది. సాధారణంగా ఏ సినిమాలోనైనా ఒకే ఐటం పాట ఉంటుంది.
రెండు ఐటం పాటలున్నవి ఇంత వరకూ ఏ సినిమాలోనూ హైలైట్ కాలేదు. బాలీవుడ్ కూడా ఆ ఛాన్స్ తీసుకోలేదు. కానీ విశాల్ భరద్వాజ్ మాత్రం రెండు ఐటం పాటలతో బాలీవుడ్ కి కొత్త ట్రెండ్ ని పరిచయం చేస్తున్నారు. మరి ఈ విధానం బాలీవుడ్ లో ఎంత వరకూ వర్కౌట్ అవుతుందో చూడాలి. ఈ చిత్రాన్ని సాజిద్ నడివాయాలా నిర్మిస్తున్నారు.
