చీకట్లో చిందులు.. దిశా పటానీకి ఏమైంది?
టాప్ మోడల్ కం నటి దిశా పటానీ పరిచయం అవసరం లేదు. ఈ భామ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సరసన లోఫర్ చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమైంది.
By: Tupaki Desk | 11 Jun 2025 9:35 AM ISTటాప్ మోడల్ కం నటి దిశా పటానీ పరిచయం అవసరం లేదు. ఈ భామ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సరసన లోఫర్ చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమైంది. ఇటీవలే పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ 'కల్కి 2898 ఏడి' చిత్రంలో ప్రభాస్ సరసన కనిపించింది. అటు బాలీవుడ్ లో భారీ చిత్రాల్లో నటించింది. దురదృష్టవశాత్తూ బాలీవుడ్ లో ఈ భామ ఆశించిన రేంజుకు ఎదగలేకపోయింది. అయినా నటిగా దిశా కెరీర్ కి వచ్చిన సమస్య లేదు. అలాగే దిశాకు సోషల్ మీడియా ఫాలోయింగ్ భారీ ఆదాయం తెచ్చిపెడుతోంది.
దిశా నిరంతర ఫోటోషూట్లు ఇంటర్నెట్ లో హాట్ టాపిక్. ఇప్పుడు అలాంటి ఒక ఫోటోషూట్ ని దిశా ఇన్ స్టాలో షేర్ చేసింది. డార్క్ బ్యాక్ డ్రాప్ లో యూనిక్ ఫోటోషూట్ ఇది. దిశా తన అందాలను రివీల్ చేసే బికినీ టాప్ ధరించింది. దానిని లూజ్ బ్లేజర్ తో కవర్ చేసింది. అయితే ఇదంతా చీకటిలో ఫోటోషూట్ కాబట్టి రొటీన్ కి భిన్నంగా కనిపిస్తోంది. బోల్డ్ అండ్ యూనిక్ ఫోటోషూట్లు దిశాకు కొత్తేమీ కాదు కానీ, ఈసారి డార్క్ షేడ్ ఫ్రెష్ ఫీల్ కలిగిస్తోందని నెటిజనులు వ్యాఖ్యానిస్తున్నారు. దిశా డార్క్ సీక్రెట్స్ బయటపడ్డాయంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోగ్రాఫ్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతోంది.
వృత్తిపరంగా చూస్తే, దిశా పటానీ తన నటనా జీవితాన్ని తెలుగు చిత్రం లోఫర్‌తో ప్రారంభించింది. బాలీవుడ్‌లో, ఎంఎస్ ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ప్రేయసిగా నటించింది. చైనీస్ చిత్రం కుంగ్ ఫూ యోగాలో జాకీ చాన్‌తో కలిసి నటించింది. 2024లో వరుసగా మూడు చిత్రాలలో నటించింది: సిద్ధార్థ్ మల్హోత్రాతో యోధ, ప్రభాస్‌తో కల్కి 2898 AD, సూర్యతో కంగువ. ఈ సంవత్సరం అనీస్ బాజ్మీ మల్టీ స్టారర్ 'వెల్‌కమ్ టు ది జంగిల్'లో కనిపిస్తుంది. వ్యక్తిగత జీవితానికి వస్తే, టైగర్ ష్రాఫ్ నుంచి విడిపోయాక ఫిట్నెస్ కోచ్ అలెక్స్ఇలిక్ తో డేటింగ్ లో ఉందని ప్రచారం సాగుతోంది.