వరుస ఫ్లాప్స్.. పీకల్లోతు కష్టాల్లో ముద్దుగుమ్మ
గత ఏడాదిలో దిశా పటానీ నటించిన 'యోధ', 'కల్కి 2898 ఏడీ', 'కంగువా' సినిమాలు వచ్చాయి. యోధ, కంగువా సినిమాలు తీవ్రంగా నిరాశ పరిచాయి.
By: Tupaki Desk | 4 April 2025 5:00 AM ISTతెలుగు సినిమా 'లోఫర్'తో సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ దిశా పటానీ. మొదటి సినిమా ఫ్లాప్ అయినా లక్కీగా హిందీలో ధోనీ సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది. బాలీవుడ్‌లో ఈమె నటించిన మొదటి సినిమా ఎంఎస్ ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ సూపర్ హిట్ కావడంతో పాటు, ఈమె పాత్రకు మంచి పేరు వచ్చింది. దాంతో ఒక్కసారిగా బాలీవుడ్‌లో అందరి దృష్టిని ఆకర్షించింది. ధోనీ సినిమా తర్వాత బాలీవుడ్‌లో వరుసగా సినిమా ఆఫర్లు దక్కించుకుంది. కొన్ని సూపర్ హిట్ కాగా, కొన్ని సినిమాలు నిరాశ పరిచాయి. అయినా కూడా వరుస సినిమా ఆఫర్లను మాత్రం మొన్నటి వరకు దక్కించుకుంటూ వచ్చింది.
గత ఏడాదిలో దిశా పటానీ నటించిన 'యోధ', 'కల్కి 2898 ఏడీ', 'కంగువా' సినిమాలు వచ్చాయి. యోధ, కంగువా సినిమాలు తీవ్రంగా నిరాశ పరిచాయి. ప్రభాస్‌తో కలిసి నటించిన కల్కి సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్నప్పటికీ ఆ సినిమాలో ఈమె పాత్రకు పెద్దగా ప్రాముఖ్యత లేదు అనే విమర్శలు వచ్చాయి. కేవలం ఒక పాటకు, రెండు సన్నివేశాలకు మాత్రమే ఈమె పరిమితం అయింది. అందుకే బాలీవుడ్‌తో పాటు, సౌత్‌లోనూ ఈమెకు పెద్దగా ఆఫర్లు దక్కడం లేదు. కంగువా సినిమాపై ఈమె చాలా ఆశలు పెట్టుకుని నటించింది. ఆ సినిమా అతి పెద్ద డిజాస్టర్‌గా నిలవడంతో సౌత్‌లో ఈమెకు రావాల్సిన ఆఫర్లను సైతం కిల్ చేసినట్లు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం ఈమె ఒక బాలీవుడ్ మూవీలో నటిస్తోంది. ఆ సినిమాలోనూ ఈమె పాత్రకు పెద్దగా ప్రాముఖ్య ఉండక పోవచ్చు అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆ సినిమా భారీ స్టార్ కాస్టింగ్‌తో రూపొందుతోంది. కనుక దిశా పటానీకి ఆ సినిమా ఏ మేరకు ఆఫర్స్ తెచ్చి పెడుతుంది అంటే కష్టమే అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈమె కెరీర్‌లో నిలిచి పోయే సక్సెస్‌లు లేకపోవడంతో ప్రతి ఏడాది ఆఫర్ల కోసం వెయిట్ చేయాల్సిన పరిస్థితి. ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఈమె నుంచి ఒక్క సినిమా కూడా రాలేదు. ప్రస్తుతం నటిస్తున్న ఆ హిందీ సినిమా వచ్చే అవకాశాలు ఉన్నాయా అంటే అనుమానమే అన్నట్లుగా సమాధానం వస్తుంది.
వరుసగా రెండు ఫ్లాప్స్ పడటంతో దిశా పటానీ కెరీర్ ప్రమాదంలో పడింది. కల్కి 2 లో ఈమె పాత్ర ఉంటుందా అనేది చూడాలి. ఒక వేళ ఆ సినిమాలో ఈమె పాత్ర ఉండి, ఆ పాత్ర కాస్త ఎక్కువ సమయం ఉంటే అప్పుడు దిశా పటానీ బాలీవుడ్‌లో మళ్లీ పుంజుకునే అవకాశాలు ఉంటాయి అనేది కొందరి అభిప్రాయం. కానీ కల్కి మొదటి పార్ట్‌లోనే దిశా పటానీ పాత్ర కట్ అయినట్లుగా అనిపిస్తుంది. సీక్వెల్‌లో ఆమె పాత్రను కంటిన్యూ చేయడం అనేది అనుమానమే అంటున్నారు. మొత్తానికి ఆ మధ్య వరుస సినిమాలతో జోష్ మీద కనిపించిన దిశా పటానీ ఒక్కసారిగా డల్ కావడంతో పాటు ఆఫర్లు తగ్గు ముఖం పట్టడంతో ఈమె కెరీర్ ఖతం అయినట్లే అనే అభిప్రాయంను వ్యక్తం అవుతోంది. కానీ ఈమె సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్‌తో, తన అందమైన ఫోటో షూట్స్‌తో మళ్లీ బిజీ కావాలనే ప్రయత్నాలు చేస్తోంది. మరి అది ఎంత వరకు వర్కౌట్ అయ్యేను చూడాలి.
