అందాల దిశా అదిరే మిర్రర్ సెల్ఫీ
అందాల దిశా పటానీ సోషల్ మీడియాలో రెగ్యులర్‌గా తన అందమైన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.
By: Tupaki Desk | 20 May 2025 9:00 PM ISTబాలీవుడ్‌లో వరుస సినిమాలతో దూసుకు పోతున్న దిశా పటానీ గత ఏడాది తెలుగు సినిమా కల్కి 2898 ఏడీతో పాటు తమిళ్ మూవీ కంగువాలో నటించింది. కల్కి సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. కానీ ఆ సినిమాలో దిశా పటానీ స్క్రీన్ ప్రజెన్స్ తక్కువగా ఉంది. ప్రాముఖ్యత లేని పాత్ర అనే టాక్ వచ్చింది. ఇక కంగువా సినిమా విషయంలోనూ అదే జరిగింది. పైగా కంగువా సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. దాంతో సౌత్ సినిమాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తుంది. టాలీవుడ్‌లో ఈ అమ్మడు చేసిన మొదటి సినిమా లోఫర్ సైతం బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడింది. అయినా కూడా లక్ బాగుండి బాలీవుడ్‌లో ఈ అమ్మడు బిజీ అయింది.
అందాల దిశా పటానీ సోషల్ మీడియాలో రెగ్యులర్‌గా తన అందమైన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఈమె షేర్ చేసే ఫోటోలు నెట్టింట సెన్షేషన్‌గా మారడం మనం చూస్తూ ఉంటాం. ఇన్‌స్టాలో ఏకంగా 61 మిలియన్‌ల ఫాలోవర్స్‌ను కలిగి ఉన్న దిశా పటానీ చూపు తిప్పుకోలేనంత అందంగా ఎప్పుడూ తన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. విభిన్నమైన ఫోటోలను, వీడియోలను షేర్ చేయడం ద్వారా అందరి చూపును తనవైపుకు తిప్పుకునే ముద్దుగుమ్మ దిశా పటానీ ఈసారి మిర్రర్ సెల్ఫీతో ఆకట్టుకుంది. క్లీ వేజ్ అందాలను చూపిస్తూ దిశా పటానీ షేర్ చేసిన ఈ ఫోటోలకు తక్కువ సమయంలోనే లక్షల్లో లైక్స్ వచ్చాయి.
నడుము అందం చూపిస్తూ, క్లీ వేజ్‌షో చేస్తూ దిశా పటానీ గతంలో ఎన్నో ఫోటోలు షేర్ చేయడం మనం చూశాం. కానీ ఈ ఫోటోలు చాలా స్పెషల్‌గా ఉన్నాయి అంటూ నెటిజన్స్ నుంచి కామెంట్స్ దక్కించుకుంది. ఇలాంటి మిర్రర్ సెల్ఫీలకు ఈ మధ్య కాలంలో మంచి స్పందన లభిస్తుంది. సెల్ఫీల కంటే మిర్రర్ సెల్ఫీలతో ముద్దుగుమ్మలు తమ అందంను మరింతగా చూపించే అవకాశం ఉంటుంది. అందుకే దిశా ఎక్కువగా మిర్రర్ సెల్ఫీలతో మతి పోగొడుతోంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ముద్దుగుమ్మ దిశా పటానీ పదే పదే అందాల ఆరబోత ఫోటోలను షేర్ చేయడంతో పాటు, తన సినిమాల యొక్క అప్‌డేట్స్‌ను షేర్ చేయడం ద్వారా వైరల్ అవుతూ ఉంటుంది.
ఇక దిశా పటానీ సినిమాల విషయానికి వస్తే గత ఏడాది రెండు సౌత్ సినిమాలతో పాటు యోధ అనే హిందీ సినిమాలోనూ నటించింది. ఆ సినిమాకు మంచి స్పందన దక్కింది. బాలీవుడ్‌లో ఆ మధ్య వరుసగా రెండు మూడు సినిమా ఆఫర్లు వచ్చినా కథ విషయమై భిన్నభిప్రాయాలు వ్యక్తం కావడంతో ఆ ప్రాజెక్ట్‌లను వదులుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈమె బాలీవుడ్ మూవీ వెల్ కమ్ టు ది జంగిల్ సినిమాలో నటిస్తోంది. ఆ సినిమాను ఇదే ఏడాదిలో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. కంగువా ఫలితంతో ఈ అమ్మడు మరోసారి తమిళ్ సినిమాలో నటించేందుకు వెనకడుగు వేసే అవకాశం ఉంది. మరి తెలుగులో ఈమె నటిస్తుందా అనేది చూడాలి.
