లవ్ బర్డ్స్.. బర్త్‌డే ఫోటోలతో పుకార్లకు చెక్
సినీ కెరీర్ పరంగా ఆటు పోట్లు ఎదుర్కొంటున్న ఈమె వ్యక్తిగత జీవితంలో మాత్రం చాలా సంతోషంగా ఉన్నట్లు తెలుస్తోంది. గత కొన్నాళ్లుగా ఈమె అలెగ్జాండర్ అలెక్స్ ఇలిక్ తో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
By: Tupaki Desk | 14 Jun 2025 3:11 PM ISTహీరోయిన్ దిశా పటానీ కెరీర్ పరంగా ఒడిదొడుకులు ఎదుర్కొంటోంది. చాలా ఆశలు పెట్టుకొని చేసిన 'యోదా', 'కంగువా' సినిమాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. ముఖ్యంగా కంగువా సినిమా దిశాను తీవ్రంగా నిరాశ పరచింది. కల్కి సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నప్పటికీ ఆ సినిమాలో ఈమె పాత్ర ఎంత ఉందో.. ఆ పాత్ర ప్రాముఖ్యత ఏంటో అందరికీ తెలుసు. కల్కి సినిమా ప్రభావం ఈ అమ్మడి కెరీర్‌పై ప్రభావం చూపించే పరిస్థితి కనిపించడం లేదు. హీరోయిన్‌గా దిశా పటానీ ప్రస్తుతం రెండు హిందీ సినిమాలు చేస్తుంది. అందులో ఒకటి త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ రెండు సినిమాల ఫలితంపై ఈ అమ్మడు ఆశలు పెట్టుకుంది.
సినీ కెరీర్ పరంగా ఆటు పోట్లు ఎదుర్కొంటున్న ఈమె వ్యక్తిగత జీవితంలో మాత్రం చాలా సంతోషంగా ఉన్నట్లు తెలుస్తోంది. గత కొన్నాళ్లుగా ఈమె అలెగ్జాండర్ అలెక్స్ ఇలిక్ తో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ మధ్య ఒక బర్త్‌డే వేడుకలో వీరిద్దరు కలిసి కనిపించడంతో పాటు, సెల్ఫీలకు ఫోజ్ ఇవ్వడంతో పుకార్లకు బలం చేకూరింది. ఆ తర్వాత కూడా వీరిద్దరు చాలా సార్లు కలిసి కనిపించారు. రెగ్యులర్‌గా వారిద్దరు కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొన్ని సార్లు ఇద్దరు అనుకున్నట్లుగా సేమ్ కలర్ ఔట్ ఫిట్ ధరించడంతో వీరిద్దరు ప్రేమలో ఉన్నారని, ఆ ప్రేమను వీరిద్దరు ఎప్పుడు బయట పెడుతారా అనే చర్చ జరుగుతూ ఉండేది.
ఎట్టకేలకు వీరిద్దరి ప్రేమ కథ మరింత ముందుకు వెళ్లింది. తాజాగా దిశా పటానీ పుట్టిన రోజు జరుపుకుంది. ఆ పుట్టిన రోజు వేడుకకి బాలీవుడ్‌కి చెందిన ఎంతో మంది ప్రముఖులు హాజరు అయ్యారు. వారితో పాటు అలెగ్జాండర్ సైతం హాజరు అయ్యాడు. అతడు దిశాతో ఉన్న ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశాడు. చాలా మంది దిశా పుట్టిన రోజులో పాల్గొన్న ఫోటోలు షేర్ చేశారు. కానీ అతడు చేసిన ఫోటోలు చాలా స్పెషల్‌గా ఉన్నాయని, అతడి కామెంట్ కూడా ఇద్దరి మధ్య ప్రేమ ఉంది అన్నట్లుగా ఉందనే అభిప్రాయం అందరూ వ్యక్తం చేసే విధంగా ఉంది. దిశాతో ఉన్న ఫోటోను షేర్ చేయడంతో పాటు ఇన్‌స్టాలో అలెక్స్ హ్యాపీ బర్త్‌డే మై చికిర్కి అంటూ లవ్ ఈమోజీలను షేర్ చేయడంతో అంతా కూడా అవాక్కయ్యారు.
అలెక్స్ ఆ పోస్ట్ పెట్టిన కొన్ని నిమిషాలకే దిశా పటానీ స్పందించింది. థాంక్స్ నా అలెక్సీ అంటూ అంటూ స్మైల్ ఈమోజీని షేర్ చేసింది. దిశా లవ్ ఈమోజీలు షేర్ చేయలేదని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కానీ కచ్చితంగా వీరిద్దరు ప్రేమలో ఉన్నారని, అందుకు అలెక్స్ యొక్క పోస్ట్ సాక్ష్యం అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఇప్పటికే చాలా మందికి వీరి ప్రేమ విషయంలో క్లారిటీ ఉంది.. ఇంకా ఈ ప్రేమ వార్తలు పుకార్లే అనుకున్న వారికి బర్త్‌డే ఫోటోలు, వాటి కామెంట్స్ తో క్లారిటీ వచ్చి ఉంటుంది. ఇండస్ట్రీలో ప్రేమ కథలు అనేవి చాలా సహజం. అయినా కూడా హీరోయిన్ ప్రేమ విషయం అనగానే ప్రతి ఒక్కరిలోనూ ఆసక్తి ఉంటుంది. అందుకే దిశా పటాని, అలెక్స్‌ల ప్రేమ వ్యవహారం గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు.
