Begin typing your search above and press return to search.

అందులోనూ ఆయ‌న వేలు పెట్టాడా?

ఆ యంగ్ డైరెక్ట‌ర్ తెర‌కెక్కిస్తోన్న సినిమా వెనుక కూడా ఆ స్టార్ డైరెక్ట‌ర్ ఉన్నాడా? అన్న డౌట్ రెయిజ్ అవుతుంది.

By:  Tupaki Desk   |   4 Aug 2023 4:30 PM GMT
అందులోనూ ఆయ‌న వేలు పెట్టాడా?
X

టాలీవుడ్ లో ఏ డైరెక్ట‌ర్-హీరో మ‌ధ్య లేనంత ర్యాపో వాళ్లిద్ద‌రి మ‌ధ్య ఉంది. ఆయ‌న తానా అంటే ఈయ‌న తందానా అంటాడు. ఇద్ద‌రి మ‌ధ్య స్నేహం పాలు-నీళ్ల లాంటింది. అందుకే ఆ హీరో ఏ ప‌ని చేసినా ఆ డైరెక్ట‌ర్ త‌ప్ప‌కుండా తెలుస్తుంది. కాదు కాదు..ఆ హీరో ఏ సినిమా చేసినా ప‌రోక్షంగా ఆయ‌న వెనుకుం టాడు. కొన్నాళ్ల పాటు ఆంత చ‌నువు లేదు గానీ..ఈ మ‌ధ్య ఆ చ‌నువు మ‌రీ పెరిగిపోయింది. చివ‌రికి ఏ నిర్ణ‌యం తీసుకున్న ఆ హీరో ..ఆ డైరెక్ట‌ర్ ని సంప్ర‌దించందే చేయ‌డం లేదు. రీమేక్ సినిమా చేయాల‌న్నా? నేరుగా తెలుగు సినిమా చేయాల‌న్నా? వెనుక ఆ డైరెక్ట‌ర్ త‌ప్ప‌నిస‌రి.

అక్క‌డ నుంచి గ్రీన్ సిగ్నెల్ రాక‌పోతే హీరో గారు కూడా ముందుకు క‌ద‌ల‌రు. స్నేహం అలా న‌డిపిస్తుందా? హీరో కి టైమ్ లేక ఇవ‌న్నీ నువ్వు చూసుకో...నేను వ‌చ్చి న‌టించి వెళ్లిపోతాన‌ని మాట ఇవ్వ‌డంతో? అలా జ‌రుగుతుందా? అన్న‌ది తెలియ‌దు గానీ మార్కెట్ లో మాత్రం ఇది కాస్త నెగిటివ్ గానే వెళ్తోంది. ఈ మ‌ధ్య ఆ హీరో చేసిన రెండు సినిమాల రీమేక్ వెనుక ఆ డైరెక్ట‌ర్ ఉన్నాడు? అన్న‌ది తెలిసిందే. ద‌ర్శ‌కులు వేర్వేరు అయినా ఆ ప్రాజెక్ట్ ల‌కు క‌ర్త‌..క‌ర్మ‌..క్రియ అన్నీ ఆయ‌నే.

ఈ విష‌యాన్ని ఆ న‌టుడు కం డైరెక్ట‌ర్ ఓపెన్ గానే చెప్పారు. ముందు నేను..వెనుక ఆయ‌న అన్న చందంగా నే మాట్లాడారు. ఈ నేప‌థ్యంలో ఆ స్టార్ హీరో చేస్తోన్న మ‌రో సినిమా విష‌యంలో సందేహం మొద‌లైంది.

ఆ యంగ్ డైరెక్ట‌ర్ తెర‌కెక్కిస్తోన్న సినిమా వెనుక కూడా ఆ స్టార్ డైరెక్ట‌ర్ ఉన్నాడా? అన్న డౌట్ రెయిజ్ అవుతుంది. ఎందుకంటే ఓ యంగ్ మేక‌ర్ చేసిన సినిమా విష‌యంలో ఇలాగే జ‌రిగింది.

పేరుకు అత‌ను డైరెక్ట‌ర్. కానీ వెనుకుండి న‌డిపించింది అంతా ఆ స్టార్ మేక‌ర్ అన్న‌ది తెలిసిందే. తాజా ప్రాజెక్ట్ విష‌యంలోనూ వేళ్లు...కాళ్లు పెడుతున్న‌ట్లు గుస గుస వినిపిస్తుంది. స్టోరీ ప‌రంగా కొంత ఎలివేష‌న్ వెనుక ప‌రోక్ష కార‌కుడు ఆ డైరెక్ట‌ర్ అవ్వొచ్చ‌ని అంటున్నారు.

అలాగే మేకింగ్ లోనూ ఆయ‌న స‌ల‌హాలు ఇస్తున్న‌ట్లు వినిపిస్తుంది. ఇది ఆ యంగ్ మేక‌ర్ కి ఏమాత్రం న‌చ్చ‌డం లేదుట‌. సినిమా నాదైతే? ఆయ‌న వేలు పెట్ట‌డం ఏంట‌ని స్నేహితుల వ‌ద్ద అంటున్నాడుట‌. మ‌రి అస‌లు సంగ‌తేంటో? ఆ మాష్టారే చెప్పాలి.