Begin typing your search above and press return to search.

ద‌ర్శ‌కుడు సూర్య‌కిర‌ణ్ అనారోగ్యంతో మృతి

ప్రముఖ దర్శకుడు, బిగ్ బాస్ 4 కంటెస్టెంట్ సూర్య కిరణ్ అనారోగ్యంతో కన్నుమూశారు. అతనికి 46 సంవత్సరాలు.

By:  Tupaki Desk   |   11 March 2024 9:54 AM GMT
ద‌ర్శ‌కుడు సూర్య‌కిర‌ణ్ అనారోగ్యంతో మృతి
X

ప్రముఖ దర్శకుడు, బిగ్ బాస్ 4 కంటెస్టెంట్ సూర్య కిరణ్ అనారోగ్యంతో కన్నుమూశారు. అతనికి 46 సంవత్సరాలు. సూర్యకిరణ్‌కు కామెర్లు వచ్చి మరణించినట్లు సమాచారం. చెన్నైలో ఆయ‌న‌ తుది శ్వాస విడిచారు. జీవితంలో ఒడిదుడుకుల‌ను చ‌వి చూసిన సూర్య కిర‌ణ్ ని అనారోగ్యం ఇబ్బంది పెట్టింద‌ని స‌మాచారం.

సుమంత్ క‌థానాయ‌కుడిగా సత్యం, ధన 51 వంటి చిత్రాలతో విజ‌యాలు అందుకున్న సూర్య కిర‌ణ్ తొలుత న‌టుడు. సూర్య కిరణ్ తన కెరీర్‌ను మాస్టర్ సురేష్ అనే స్క్రీన్ నేమ్‌తో బాల నటుడిగా ప్రారంభించాడు. ఆ తర్వాత సినిమాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాలనే కలను సాకారం చేసుకున్నాడు. ఆయన దర్శకత్వం వహించిన తొలి చిత్రం `సత్యం` బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.

అప్ప‌టి మేటి క‌థానాయిక‌ కళ్యాణిని సూర్య కిరణ్ వివాహం చేసుకున్నారు. అయితే విభేదాల కారణంగా వీరిద్దరూ విడిపోయారు. కళ్యాణి మళ్లీ పెళ్లి చేసుకుంటాన‌ని సూర్య కిరణ్ తన ప్రేమను బహిరంగంగా చాటుకున్నాడు. సూర్య కిరణ్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 4లో పాల్గొన్నాడు.అయితే అతడు విజయం సాధించలేదు. మధ్యలోనే తొలగించబడ్డాడు. సూర్యకిరణ్ అకాల మరణం పట్ల పలువురు టాలీవుడ్ ప్రముఖులు తోటి దర్శకనిర్మాతలు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.