Begin typing your search above and press return to search.

సుకుమార్ ని 2030 వ‌ర‌కూ వ‌ద‌ల‌రా?

ఇటు బ‌న్నీ లైన్ లో ఉండ‌గా..చ‌ర‌ణ్ ని మ‌ళ్లీ లైన్ లోకి తెచ్చేసారు. ఇదంతా చూస్తుంటే సుకుమార్ ని మెగా క్యాప్ ఇప్ప‌ట్లో వ‌దిలేలా క‌నిపించ‌డం లేదు

By:  Tupaki Desk   |   22 March 2024 7:08 AM GMT
సుకుమార్ ని 2030 వ‌ర‌కూ వ‌ద‌ల‌రా?
X

స్టైలిష్ డైరెక్ట‌ర్ సుకుమార్ ని మెగా క్యాంప్ రౌండ‌ప్ చేసిందా? 2030 వ‌ర‌కూ లెక్క‌లు మాష్టార్ని వ‌దిలే ప్ర‌శ‌క్తే లేదా? అత‌డి కోసం ఒక‌రి త‌ర్వాత మ‌రొక‌రు క్యూ క‌ట్టేస్తున్నారా? అంటే అవున‌నే తెలుస్తోంది. ఇటేవ‌లే మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ 17వ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్న‌ట్లు రివీల్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో 'పుష్ప‌-2' షూటింగ్ ఆన్ సెట్స్ లో ఉన్నా సుకుమార్ ఈ ప్రాజెక్ట్ ప్ర‌క‌టించారు.

ఇటు బ‌న్నీ లైన్ లో ఉండ‌గా..చ‌ర‌ణ్ ని మ‌ళ్లీ లైన్ లోకి తెచ్చేసారు. ఇదంతా చూస్తుంటే సుకుమార్ ని మెగా క్యాప్ ఇప్ప‌ట్లో వ‌దిలేలా క‌నిపించ‌డం లేదు. 2030 వ‌ర‌కూ అదే కాంపౌండ్ లో సినిమాలు చేసే అవ‌కాశం క‌నిపిస్తుంద‌ని తాజాగా లీకులందుతున్నాయి. 'పుష్ప‌-2' రిలీజ్ ఆగ‌స్టు త‌ర్వాత ఎప్పుడైనా జ‌రిగే అవ‌కాశం ఉంది. అనంత‌రం కొన్ని నెల‌లు పాటు సుకుమార్ విరామం తీసుకుంటారు.

కొంత‌కాలంగా పుష్ప ప‌నుల్లో నిమ‌గ్న‌మ‌వ్వ‌డంతో విరామం దొర‌క‌లేదు. దీంతో లాంగ్ లీవ్ ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది. ఈలోపు చ‌ర‌ణ్‌- బుచ్చిబాబు సినిమా సెట్స్ లో ఉంటుంది. ఇది ఎలాగూ వ‌చ్చే ఏడాదే రిలీజ్ అవుతుంది. ఈ గ్యాపులో సుకుమార్ ఆర్సీ 17కి మెరుగులు దిద్దుతారు. ఆర్ సీ 16 నుంచి చ‌ర‌ణ్ బ‌య‌ట‌కు రాగానే సుకుమార్ ప్రాజెక్ట్ ప‌ట్టాలెక్కిస్తారు. ఈ కాంబినేష‌న్ లో సినిమా రిలీజ్ అవ్వ‌డానికి ఎలా లేద‌న్నా ఏడాదిన్న‌ర అయిన స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశం ఉంది.

2026-27 లోనే ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చే అవ‌కాశం ఉంటుంది. ఇక పుష్ప -2 తర్వాత పుష్ప‌-3 కూడా ఉంటుంద‌ని ప్ర‌చారం సాగుతోంది. ఒక‌వేళ ఆ ప్రాజెక్ట్ ఉంటే గ‌నుక సుకుమార్ డిలే చేసే అవ‌కాశం ఉండ‌దు. చ‌ర‌ణ్ సినిమా పూర్తయిన వెంట‌నే మ‌ళ్లీ బ‌న్నీ వైపు ట‌ర్న్ తీసుకునే అవ‌కాశం లేక‌పోలేదు. ఎందుకంటే 'పుష్ప' మొద‌టి భాగానికి కంటున్యూటీ రెండ‌వ భాగాన్ని గ్యాప్ తీసుకోకుండానే రిలీజ్ చేస్తున్నారు.

అందుకోసం సుకుమార్ ఎక్కువ‌గానే స‌మ‌యం తీసుకేనే ఛాన్స్ ఉంటుంది. మ‌ధ్య‌లో మెగా క్యాప్ లో ఉన్న మిగ‌తా చిన్న హీరోల్ని పైకి లేపాల్సిన బాధ్య‌త ఆయ‌న తీసుకుంటాడు. వాళ్ల‌కు అవ‌స‌ర‌మైన క‌థ‌లు అందించ‌డం... క‌థ‌నాలు అందించ‌డం వంటి ప‌నులు చేస్తుంటారు. ఎలా చూసిన ఈ ఐదారేళ్లు కూడా సుకుమార్ మెగా కాంపౌండ్ లోనే ఎక్కువ‌గా తిరిగే అవ‌కాశం క‌నిపిస్తోంది.