Begin typing your search above and press return to search.

పుష్ప తర్వాత సుకుమార్ ప్లాన్ మార్చేశాడా..?

ఆర్య సినిమా నుంచి తన దర్శకత్వ ప్రతిభతో తెలుగు ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేస్తూ వస్తున్న సుకుమార్ పుష్పతో నేషనల్ లెవెల్ లో రచ్చ సృష్టించాడు

By:  Tupaki Desk   |   28 Aug 2023 9:55 AM GMT
పుష్ప తర్వాత సుకుమార్ ప్లాన్ మార్చేశాడా..?
X

ఆర్య సినిమా నుంచి తన దర్శకత్వ ప్రతిభతో తెలుగు ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేస్తూ వస్తున్న సుకుమార్ పుష్పతో నేషనల్ లెవెల్ లో రచ్చ సృష్టించాడు. ముఖ్యంగా రీసెంట్ గా జాతీయ అవార్డుల్లో పుష్ప రాజ్ కి బెస్ట్ యాక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ కి బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డ్ వచ్చింది. ఈ రెండు అవార్డులు రావడం సినిమాపై మరింత క్రేజ్ ఏర్పడేలా చేసింది. ఇక సెట్స్ మీద ఉన్న పుష్ప 2 కి ఈ అవార్డులు మంచి బూస్టింగ్ ఇచ్చాయి.

పుష్ప 2 ని కూడా సుకుమార్ ఓ రేంజ్ లో ప్లానింగ్ చేశాడని తెలుస్తుంది. ఈమధ్యనే రిలీజైన టీజర్ తో పుష్ప రూల్ ఎలా ఉంటుందో శాంపిల్ చూపించగా సినిమా మరోసారి బాక్సాఫీస్ దగ్గర అరుపులు పెట్టిస్తుందని అంటున్నారు. పుష్ప 2 తో సుకుమార్ మరోసారి తన స్టామినా ప్రూవ్ చేయాలని చూస్తున్నాడు.

పుష్ప 2 తర్వాత సుకుమార్ ఎవరితో సినిమా చేస్తాడు అన్నది కన్ ఫ్యూజన్ గా మారింది. అసలైతే విజయ్ దేవరకొండతో సినిమా చేయాల్సి ఉంది. అది ఉంటుందా లేదా అన్నది డౌటే అంటున్నారు. విజయ్ గౌతం తిన్ననూరి సినిమా పూర్తి చేశాక ఈ ప్రాజెక్ట్ పై ఒక క్లారిటీ వస్తుంది. మరోపక్క సుకుమార్ విజయ్ ని పక్కన పెట్టి చిట్టి బాబు తో మరో సినిమా ప్లానింగ్ లో ఉన్నాడని టాక్.

రంగస్థలం సినిమా నుంచే చరణ్ నటుడిగా తన నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అందిస్తూ ఫ్యాన్స్ ని ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేస్తున్నాడు. ఆర్.ఆర్.ఆర్ లో రామరాజు పాత్రలో అయితే చరణ్ బీభత్సం సృష్టించాడు. పుష్ప 2 కూడా అనుకున్న రేంజ్ లో ఉంటుందనే ఫిక్స్ అవ్వొచ్చు. అందుకే సుకుమార్ పుష్ప 2 తర్వాత చరణ్ తో సినిమా చేసే ఆలోచనలో ఉన్నారట.

చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమా చేస్తున్నాడు. అది పూర్తి కాగానే బుచ్చి బాబు డైరెక్షన్ లో సినిమా లైన్ లో ఉంది. ఆ తర్వాత సుకుమార్ సినిమా ఉంటుంది. సుక్కు చరణ్ ఈ కాంబో ఫిక్స్ అయితే మెగా ఫ్యాన్స్ పండుగ చేసుకుంటారు. రంగస్థలం తో ఆల్రెడీ బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ కాంబినేషన్ మరోసారి బాక్సాఫీస్ దగ్గర రచ్చకి రెడీ అవుతున్నారు. పుష్ప 2 తర్వాత సుకుమార్ ఏ సినిమా చేసిన దానికంటూ నేషనల్ లెవెల్ లో భారీ క్రేజ్ ఉంటుంది.