Begin typing your search above and press return to search.

తెలుగు కమెడియన్ తో సుధ కొంగర మూవీ.. సూపర్ ట్విస్ట్..!

2008 లో వచ్చిన ఈ సినిమా టైటిల్ ఆంధ్రా అందగాడు. ఆ సినిమాతోనే సుధా కొంగర దర్శకురాలిగా తన కెరీర్ మొదలు పెట్టారు

By:  Tupaki Desk   |   15 Nov 2023 10:55 AM GMT
తెలుగు కమెడియన్ తో సుధ కొంగర మూవీ.. సూపర్ ట్విస్ట్..!
X

గురు, ఆకాశం నీ హద్దురా సినిమాలు చేసి లేడీ డైరెక్టర్ గా తన సత్తా చాటిన సుధ కొంగర. ప్రస్తుతం తను తీసిన సూరారై పోట్రు సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నారు. అక్షయ్ కుమార్ నటిస్తున్న ఈ సినిమాను కోలీవుడ్ హీరో సూర్య నిర్మిస్తున్నారని తెలిసిందే. కోలీవుడ్ లో డైరెక్టర్ గా మంచి క్రేజ్ తెచ్చుకున్న సుధ కొంగర తన మొదటి సినిమా టాలీవుడ్ కమెడియన్ తో చేసింది అంటే షాక్ అవొచ్చు. అది నిజమే సుధ కొంగర డైరెక్ట్ చేసిన తొలి సినిమా కమెడియన్ కృష్ణభగవాన్ హీరోగా చేశారు.

2008 లో వచ్చిన ఈ సినిమా టైటిల్ ఆంధ్రా అందగాడు. ఆ సినిమాతోనే సుధా కొంగర దర్శకురాలిగా తన కెరీర్ మొదలు పెట్టారు. కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా గురించి అస్సలు చాలామందికి తెలియదు. ఆంధ్ర అందగాడు సినిమాలో కృష్ణ భగవాన్, అభినయ శ్రీ, చిత్రం శ్రీను, శ్రీనివాస్ రెడ్డి నటించారు.

తొలి ప్రయత్నంగా చేసిన సినిమా నిరాశపరచడంతో డైరెక్టర్ గా అవకాశాలు రాలేదు. అయితే ఆ తర్వాత మణిరత్నం దగ్గర అసిస్టెంట్ గా జాయిన్ అయ్యి ఆ తర్వాత మాధవన్ హీరోగా ఇరుది సుట్రు తో సక్సెస్ అందుకున్నారు. ఆ సినిమా హిట్ కాగా అదే ఫాం కొనసాగిస్తూ ఆకాశం నీ హద్దురా సినిమాతో కూడా సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు.

కృష్ణ భగవాన్ తో సినిమా తీసి ఆ తర్వాత గ్యాప్ తీసుకుని ఇప్పుడు కోలీవుడ్ లో డైరెక్టర్ గా తన సూపర్ ఫాం కొనసాగిస్తున్నారు సుధా కొంగర. సూరారై పోట్రు సినిమా హిందీ రీమేక్ తర్వాత మళ్లీ సూర్యతోనే సినిమా ఫిక్స్ చేసుకున్నారు సుధా కొంగర. తెలుగు స్టార్ హీరోలతో కూడా ఆమె సినిమాలు చేయాలని ప్రయత్నిస్తున్నారని తెలుస్తుంది. సినీ పరిశ్రమలో లేడీ డైరెక్టర్స్ చాలా తక్కువ. వారిలో సుధా కొంగర ముందంజలో ఉన్నారని చెప్పొచ్చు. ముఖ్యంగా ఆమె చేస్తున్న స్ఫూర్తిదాయకమైన కథలు ప్రేక్షకులకు మంచి అనుభూతిని అందిస్తున్నాయి. సూర్యతో తను చేయబోయే నెక్స్ట్ సినిమా కూడా మరో డిఫరెంట్ కథతో వస్తున్నట్టు తెలుస్తుంది. తెలుగులో సుధా కొంగర మొదటి సినిమా తర్వాత మళ్లీ వరుస హిట్లు కొడుతున్నా ఆమెకు ఇక్కడ అవకాశాలు రావట్లేదు.