Begin typing your search above and press return to search.

శ్రీనువైట్లకు కాస్త బలమొచ్చింది

కింగ్ ఫ్లాప్ అయిన కూడా ఆ సినిమాలో కామెడీని ఆడియన్స్ ఇప్పటికి ఎంజాయ్ చేస్తూ ఉంటారు

By:  Tupaki Desk   |   3 Jan 2024 3:40 AM GMT
శ్రీనువైట్లకు కాస్త బలమొచ్చింది
X

టాలీవుడ్ లో వరుస సక్సెస్ లతో స్టార్ డైరెక్టర్ రేంజ్ కి వెళ్లి తరువాత బ్యాక్ టూ బ్యాక్ నాలుగు డిజాస్టర్ సినిమాలతో క్రిందపడిపోయిన దర్శకుడు శ్రీనువైట్ల. కమర్షియల్ యాక్షన్ కామెడీ జోనర్ లో సినిమాలు చేసి సూపర్ హిట్స్ అందుకున్నారు. వెంకీ నుంచి మొదలుకొని దూకుడు వరకు శ్రీనువైట్ల టైం నడిచింది. చేసిన ప్రతి సినిమా హిట్ అయ్యింది. అందరివారు ఎవరేజ్ టాక్ వచ్చిన కమర్షియల్ సక్సెస్ అందుకుంది.

కింగ్ ఫ్లాప్ అయిన కూడా ఆ సినిమాలో కామెడీని ఆడియన్స్ ఇప్పటికి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఆగడుతో శ్రీనువైట్లకి ఫ్లాప్ లు రావడం మొదలయ్యాయి. ఆ సినిమా కెరియర్ లో అతి పెద్ద ఫ్లాప్ అయ్యింది. తరువాత రామ్ చరణ్ తో చేసిన బ్రూస్ లీ, వరుణ్ తేజ్ మిస్టర్, రవితేజ తో చేసిన అమర్ అక్బర్ అంటోనీ డిజాస్టర్ అయ్యాయి. వీటి తర్వాత హీరోలు ఎవరూ కూడా శ్రీను వైట్లతో మూవీ చేయడానికి ఆసక్తి చూపించలేదు.

దీంతో సుదీర్ఘ గ్యాప్ వచ్చేసింది. అయితే రెండేళ్ళ క్రితం విష్ణుతో ఢీ సీక్వెల్ ఎనౌన్స్ చేశాడు. అయితే ఎందుకనో కార్యరూపం దాల్చలేదు. గత ఏడాది శ్రీనువైట్లకి కథ చెప్పి ఒప్పించుకున్నాడు. ఈ మూవీ షూటింగ్ కూడా ఇప్పటికే ఫారిన్ లో స్టార్ట్ చేశాడు. రెగ్యులర్ షూటింగ్ నడుస్తోంది. కచ్చితంగా ఈ సినిమాతో మళ్ళీ ఫామ్ లోకి రావాలని శ్రీను వైట్ల అనుకుంటున్నాడు.

అయితే శ్రీనువైట్ల మీద ఆడియన్స్ కి పెద్దగా హోప్స్ లేవు. గోపీచంద్ కూడా గత కొంతకాలంగా వరుస డిజాస్టర్ లతో ఉన్నాడు. వీరి కాంబో కావడంతో పెద్దగా ఎక్స్ పెక్టేషన్స్ అయితే లేవు. ఇలాంటి సమయంలో రవితేజతో శ్రీనువైట్ల చేసిన వెంకీ మూవీ రీరిలీజ్ అయ్యింది. ఈ మూవీ థియేటర్స్ లో మూడు రోజుల్లో రెండు కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. దీనిని బట్టి సినిమాకి మంచి ఆదరణ వస్తోందని చెప్పొచ్చు.

ఈ సినిమా రీరిలీజ్ అయ్యి ప్రేక్షకాదరణ సొంతం చేసుకోవడంతో శ్రీనువైట్ల ట్విటర్ లో తన ఆనందాన్ని పంచుకుంటున్నాడు. వెంకీ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తూ పోస్ట్ లు పెడుతున్నారు. ఈ వెంకీ సినిమా రీరిలీజ్ ద్వారా శ్రీనువైట్ల పేరు మరోసారి ఇప్పుడు వినిపిస్తోంది. ఏదేమైనా అతనికి ఎక్స్ట్రా బూస్ట్ ఇచ్చి గోపీచంద్ తో చేయబోయే సినిమాకి ప్లస్ అవుతుందేమో చూడాలి.