Begin typing your search above and press return to search.

దసరా డైరెక్టర్ సైలెంట్ అయ్యాడేంటి..?

ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల అనే ప్రతిభ గల దర్శకుడు పరిశ్రమకు పరిచయమయ్యాడు. సుకుమార్ దగ్గర అసిస్టెంట్ గా చేసిన శ్రీకాంత్ ఓదెల తొలి సినిమాతోనే సెన్సేషనల్ హిట్ అందుకున్నాడు

By:  Tupaki Desk   |   6 Sep 2023 6:26 AM GMT
దసరా డైరెక్టర్ సైలెంట్ అయ్యాడేంటి..?
X

నాని హీరోగా కెరీర్ లో ఫస్ట్ టైం ఫుల్ లెంగ్త్ మాస్ రోల్ లో నటించిన సినిమా దసరా. ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల అనే ప్రతిభ గల దర్శకుడు పరిశ్రమకు పరిచయమయ్యాడు. సుకుమార్ దగ్గర అసిస్టెంట్ గా చేసిన శ్రీకాంత్ ఓదెల తొలి సినిమాతోనే సెన్సేషనల్ హిట్ అందుకున్నాడు. నానిని ఊర మాస్ పాత్రలో చూపించి శభాష్ అనిపించుకున్నాడు శ్రీకాంత్. డైరెక్టర్ గా తొలి హిట్ పడగానే వెంటనే అవకాశాలు వస్తాయి. అలా వచ్చిన వాటిలో తమకు నచ్చిన ఆఫర్ ని ఎంచుకోవాల్సి ఉంటుంది.

దసరా తర్వాత శ్రీకాంత్ ఇప్పటివరకు తన నెక్స్ట్ సినిమా అనౌన్స్ చేయలేదు. శ్రీకాంత్ తో సినిమా చేసేందుకు యువ హీరోలు ఆసక్తి చూపిస్తున్నారు కానీ ఆల్రెడీ హీరోలంతా కూడా సినిమాలతో బిజీగా ఉండటం వల్ల శ్రీకాంత్ ఖాళీగా ఉండాల్సి వస్తుంది. దసరా తో సూపర్ హిట్ అందుకున్న శ్రీకాంత్ తన సెకండ్ సినిమా కూడా దసరా టైపులోనే చేస్తాడని చెబుతున్నారు. ఇప్పటికే కథ రెడీ చేసుకున్న శ్రీకాంత్ హీరోని ఫైనలైజ్ చేయాల్సి ఉందట.

దసరాతో తన డైరెక్షన్ టాలెంట్ చూపించిన శ్రీకాంత్ తో చేసేందుకు హీరోలు ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా శ్రీకాంత్ నెక్స్ట్ సినిమాలో మెగా హీరో నటిస్తాడని టాక్. అఫీషియల్ గా ఈ సినిమా అనౌన్స్ మెంట్ త్వరలో రానుంది. హిట్ పడిన తర్వాత కూడా వెయిట్ చేస్తున్న డైరెక్టర్ శ్రీకాంత్ టైం తీసుకున్నా సరే మరో మంచి ప్రాజెక్ట్ తో రావాలని చూస్తున్నాడు.

ఇంతకీ శ్రీకాంత్ సినిమాలో హీరో ఎవరు.. ఈసారి దసరా డైరెక్టర్ ఎలాంటి కథతో రాబోతున్నాడు అన్నది త్వరలో తెలుస్తుంది. నాని లాంటి క్లాస్ హీరోతో మాస్ సినిమా చేసిన శ్రీకాంత్ ఓదెల కొద్దిపాటి మాస్ ఇమేజ్ ఉన్న హీరోతో సినిమా పడితే మాత్రం నెక్స్ట్ లెవెల్ రిజల్ట్ అందుకునే ఛాన్స్ ఉంది. ఇదే కాదు శ్రీకాంత్ టాలెంట్ మెచ్చిన నాని అతనితో మరో సినిమా చేయాలని చూస్తున్నాడట. దసరాను మించి ఈసారి మరింత గ్రాండ్ గా ఆ సినిమా ఉంటుందని ఫిల్మ్ నగర్ టాక్. టాలీవుడ్ లో ఫ్యూచర్ స్టార్ డైరెక్టర్ అయ్యే క్వాలిటీస్ అన్నీ ఉన్న శ్రీకాంత్ ప్రతి సినిమా చాలా స్పెషల్ గా ఉండేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. శ్రీకాంత్ నెక్స్ట్ సినిమా అప్డేట్ కోసం దసరా సినిమా లవర్స్ అంతా కూడా ఎదురుచూస్తున్నారు.