Begin typing your search above and press return to search.

సీతమ్మ వాకిట్లో కాదు.. అంతకుమించిన మల్టీస్టారర్

దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల మొదట చేసిన సినిమాలకు అలాగే ఇటీవల కాలంలో అతను ఎంచుకున్న కథలకు ఏమాత్రం సంబంధం లేకుండా ఉంది.

By:  Tupaki Desk   |   24 Sep 2023 12:22 PM GMT
సీతమ్మ వాకిట్లో కాదు.. అంతకుమించిన మల్టీస్టారర్
X

దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల మొదట చేసిన సినిమాలకు అలాగే ఇటీవల కాలంలో అతను ఎంచుకున్న కథలకు ఏమాత్రం సంబంధం లేకుండా ఉంది. అందుకే ఇప్పుడు అతను ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతున్నాడు. రెగ్యులర్ కాన్సెప్ట్స్ కాకుండా ఆడియన్స్ ను కూడా విభిన్నమైన తరహాలో ఆకట్టుకునేలా ఆలోచిస్తున్నాడు. వెంకటేష్ తో నారప్ప సినిమాను ఏ విధంగా ప్రజెంట్ చేశాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

అప్పుడే శ్రీకాంత్ అడ్డాల అందరిని ఆశ్చర్యపరిచాడు. కొత్త బంగారులోకం, ముకుంద, బ్రహ్మోత్సవం, సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు.. వంటి సినిమాలను డైరెక్ట్ చేసిన శ్రీకాంత్ ఇలా కూడా కూడా హీరోలను చూపించగలడా అనేలా అందరూ షాక్ అయ్యారు. అయితే ఇప్పుడు అతని నుంచి రాబోతున్న మరో భిన్నమైన సినిమా పెదకాపు 1. ఈ సినిమా కూడా చాలా విభిన్నమైన ఒక సెన్సిటివ్ అంశంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఈ సినిమాను అఖండ ఫేమ్ మిరియాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇక రాబోయే రోజుల్లో శ్రీకాంత్ అడ్డాల మరొక విభిన్నమైన మల్టీస్టారర్ సినిమాను తెరపైకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా ఫ్యామిలీ మల్టీ స్టారర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అందులో వెంకటేష్ మహేష్ బాబు పాత్రలు ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి.

అంతలా ఇంపాక్ట్ చూపించిన శ్రీకాంత్ అడ్డాల కంప్లీట్ సీరియస్ మల్టీ స్టారర్ సినిమా చేస్తే ఎలా ఉంటుందనేది ఊహించడానికి కూడా అంతుచిక్కడం లేదు. అయితే అతని నుంచి అలాంటి సినిమా వస్తుంది అని ఇటీవల మిరియాల రవీందర్ రెడ్డి అయితే ఒక హింట్ అయితే ఇచ్చారు. గతంలో శ్రీకాంత్ అడ్డాల తన సన్నిహితుడు నుంచి ఒక కథను వినిపించాడు అని, అన్నాయ్.. అనే ఆ స్క్రిప్ట్ లో రెండు బలమైన పాత్రలు ఉన్నాయి.

ఒక వంగవీటి రాధా ఒక వంగవీటి రంగా పాత్రలుగా చేస్తే ఎలా ఉంటుందో అంత బలంగా ఉంటుంది అని అన్నారు. ఇక ఆ కాన్సెప్ట్ అయితే మరో లెవెల్ లో ఉంటుంది అని తప్పకుండా సినిమాను శ్రీకాంత్ ద్వారానే బిగ్ స్క్రీన్ పైకి తీసుకువచ్చే అవకాశం ఉంటుంది అని ఆయన అన్నారు. మరి శ్రీకాంత్ అడ్డాల కథను ఎవరితో ఎప్పుడు మొదలుపెడతాడో కాలమే సమాధానం చెప్పాలి.