Begin typing your search above and press return to search.

బ్రహ్మోత్సవం దెబ్బకు ఫ్రస్ట్రేషన్

దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరేమో. గతంలో ఫ్యామిలీ చిత్రాలతో ప్రేక్షకుల మనసు దోచేశారు

By:  Tupaki Desk   |   11 Sep 2023 10:05 AM GMT
బ్రహ్మోత్సవం దెబ్బకు ఫ్రస్ట్రేషన్
X

దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరేమో. గతంలో ఫ్యామిలీ చిత్రాలతో ప్రేక్షకుల మనసు దోచేశారు. ముఖ్యంగా కొత్త బంగారు లోకం, సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి బ్లాక్ బస్టర్ హిట్లు ఇచ్చారు. ఆ తర్వాత మహేష్ తో తీసిన బ్రహ్మోత్సవం బెడిసి కొట్టింది. వరుణ్ తేజ్ 'ముకుంద' పర్వాలేదనిపించింది. అయితే, ఎప్పుడూ ఫ్యామిలీ మూవీస్ మాత్రమే చేసే ఆయన, ఈసారి తన పంథా మార్చుకున్నారు.

వెంకటేష్ నారప్ప మూవీతో తన రూట్ మార్చుకున్నారనే విషయం అర్థమైంది. అయితే, అది రీమేక్ మూవీ. కానీ, ఈసారి డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్నారు. అదే పెద కాపు. విడుదలకు దగ్గరౌతుండటంతో ఈ మూవీ ట్రైలర్ ని తాజాగా విడుదల చేశారు. ట్రైలర్ విడుదల తర్వాత డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు.

ఇలాంటి జోనర్ లో సినిమా తీయడానికి కారణం ఏంటి అని ఓ మీడియా ప్రతినిధి డైరెక్టర్ ని ప్రశ్నించారు. అయితే, దానికి సమాధానం చెప్పడానికి ఆయన మహేష్ బ్రహ్మోత్సవం ప్రస్తావన తీసుకురావడం విశేషం. తాను ఈ మూవీ ప్రకటించినప్పుడు నటుడు సునీల్ తన దగ్గరకు వచ్చి మాట్లాడినట్లు చెప్పారు. బ్రహ్మోత్సవం లాంటి సినిమాలు చేస్తే, ప్రేక్షకులు మాట వినడం లేదు అనే కదా ఫ్రస్టేషన్ తో ఇలాంటి సినిమా చేసావు కదా అని అన్నారు. అని నవ్వేశారు.

ఇక, చేసే సినిమా హిట్ అవుతుందా, ప్లాప్ అవుతుందా అనే విషయం ఎవరికీ తెలియదని, హిట్టు కావాలనే తీస్తామని, కానీ ఒక్కోసారి ఫలితం అనుకున్నట్లు రాదు అని చెప్పారు. మహేష్, సమంత, కాజల్ లాంటి స్టార్స్ కలిసి తీసిన సినిమా బ్రహ్మోత్సవం. ఫ్యాన్స్ ఈ మూవీ పై చాలా ఆశలు పెట్టుకుంటే బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. ఇప్పుడు ఆ మూవీపై ఆయన స్పందించారు.

ఇక, పెద్ద కాపు సినిమాకి దర్శకత్వమే కాకుండా, తొలిసారి శ్రీకాంత్ అడ్డాల నటించారు. అది కూడా విలన్ పాత్ర కావడం విశేషం. మిర్యాల సత్యనారాయణ రెడ్డి సమర్పణలో మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇందులో విరాట్ కర్ణ, ప్రగతి శ్రీవాస్తవ జంటగా నటిస్తున్నారు. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.