Begin typing your search above and press return to search.

ద‌ర్శ‌క‌ధీరుడి నెక్ట్స్ టార్గెట్ 2000 కోట్ల క్ల‌బ్?

బాహుబ‌లి-బాహుబ‌లి 2- ఆర్.ఆర్.ఆర్ చిత్రాల‌తో ఆయ‌న పేరు నంబ‌ర్ -1 స్లాట్ లోకి వ‌చ్చింది. దేశ‌వ్యాప్తంగా దీనిపై గొప్ప చ‌ర్చ కూడా సాగింది. అప‌జ‌య‌మెరుగ‌ని ద‌ర్శ‌క‌ధీరుడిగా అత‌డి పేరు మార్మోగుతోంది.

By:  Tupaki Desk   |   10 Oct 2023 9:30 AM GMT
ద‌ర్శ‌క‌ధీరుడి నెక్ట్స్ టార్గెట్ 2000 కోట్ల క్ల‌బ్?
X

భార‌త‌దేశంలో ఎంద‌రో దిగ్గ‌జ ద‌ర్శ‌కులు ఉన్నారు. భార‌తీయ సినిమా వందేళ్ల చ‌రిత్ర‌లో క‌నీసం వంద‌మంది గొప్ప‌ ద‌ర్శ‌కుల పేర్లతో జాబితాను సిద్ధం చేస్తే అందులో టాప్ 10లో ఉండే పేరు ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్.ఎస్.రాజ‌మౌళి. బాహుబ‌లి-బాహుబ‌లి 2- ఆర్.ఆర్.ఆర్ చిత్రాల‌తో ఆయ‌న పేరు నంబ‌ర్ -1 స్లాట్ లోకి వ‌చ్చింది. దేశ‌వ్యాప్తంగా దీనిపై గొప్ప చ‌ర్చ కూడా సాగింది. అప‌జ‌య‌మెరుగ‌ని ద‌ర్శ‌క‌ధీరుడిగా అత‌డి పేరు మార్మోగుతోంది.

అంతేకాదు `బాహుబ‌లి`తో పాన్ ఇండియా పాఠం నేర్పిన ఘ‌నుడిగా రాజ‌మౌళి పేరు రికార్డుల‌కెక్కింది. ర‌జ‌నీకాంత్- షారూఖ్ ఖాన్.. అమీర్ ఖాన్ ల‌తో పాటు, అంత‌కుముందు వెట‌ర‌న్ స్టార్ల‌లో చాలా మంది పాన్ ఇండియా స్టార్లు ఉన్నా కానీ ఒక తెలుగు స్టార్ కి గుర్తింపు తెచ్చిన ఘ‌న‌త మాత్రం రాజ‌మౌళికే ద‌క్కుతుంది. ప్ర‌భాస్- రామ్ చ‌ర‌ణ్‌- ఎన్టీఆర్ అనే పేర్లు ఈరోజు ప్ర‌పంచ సినీయ‌వ‌నిక‌పై మార్మోగుతున్నాయి అంటే దానికి కార‌కుడు ఎస్.ఎస్.రాజ‌మౌళి. ఆ ముగ్గురు ఇప్పుడు పాన్ ఇండియా స్టార్లుగా గుర్తింపు తెచ్చుకున్నారు. నితీష్ తివారి, రాజ్ కుమార్ హిరాణీ, సంజ‌య్ లీలా భ‌న్సాలీ, మ‌ణిర‌త్నం, శంక‌ర్ ఇలా ఎంద‌రో గొప్ప గొప్ప ద‌ర్శ‌కులు ఉన్న ఈ కాలంలో రాజ‌మౌళి పేరు ప్ర‌త్యేకంగా హైలైట్ అవుతోందంటే అది ప్ర‌తిభ‌కు ప్ర‌జ‌లు ఇచ్చే గౌర‌వంగా భావించాలి.

జ‌క్క‌న్న ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన `బాహుబ‌లి` రిలీజ్ త‌ర్వాతే పాన్ ఇండియా మార్కెట్ కి సిస‌లైన గుర్తింపు ద‌క్కింది. ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్.ఎస్.రాజ‌మౌళి ఒక నూత‌న శ‌కానికి ఆద్యుడు అయ్యారు. 1000 కోట్ల క్లబ్ ఒక తెలుగు సినిమాకి సాధ్యం అని నిరూపించిన మేటి ద‌ర్శ‌కుడిగాను చ‌రిత్ర‌కెక్కాడు. అంతేకాదు.. భార‌త‌దేశానికి ఆస్కార్ ని తెచ్చిన ఘ‌నుడు.. గోల్డెన్ గ్లోబ్.. హాలీవుడ్ క్రిటిక్స్ పుర‌స్కారాల‌ను తెచ్చిన ఏకైక ద‌ర్శ‌క‌దిగ్గ‌జం మ‌న‌ రాజ‌మౌళి. ఆర్.ఆర్.ఆర్ `నాటు నాటు..`తో ప్ర‌తిష్ఠాత్మ‌క అకాడెమీ అవార్డు (ఆస్కార్)ను దేశానికి కానుక‌గా ఇచ్చిన ప్ర‌తిభావంతుడు జ‌క్క‌న్న‌.

ఇప్పుడు పాన్ ఇండియాని పాన్ వ‌ర‌ల్డ్ స్థాయికి చేర్చే బాధ్య‌త‌ను కూడా ఆయ‌నే చేప‌ట్టారు. పాన్ వ‌ర‌ల్డ్ మార్కెట్ లేదా హాలీవుడ్ కి ధీటైన సినిమాల‌తో భార‌తీయ సినిమాని మ‌రో స్థాయికి చేర్చుతార‌నే న‌మ్మ‌కం అంద‌రిలో ఉంది. భార‌త‌దేశంలోనే నంబ‌ర్- 1 ద‌ర్శ‌కుడిగా కితాబందుకుంటున్న రాజ‌మౌళి మ‌హేష్ సినిమాతో నెక్ట్స్ లెవల్ చూపిస్తార‌నే అంతా ఆశిస్తున్నారు. ఇప్ప‌టికే 1000 కోట్ల క్ల‌బ్ ని సాధించి చూపించిన రాజ‌మౌళి, ఈ క్రేజ్‌ను కొన‌సాగిస్తూ 2000 కోట్ల క్ల‌బ్‌ని సాధ్యం చేస్తార‌ని అంతా వేచి చూస్తున్నారు. 1000 కోట్ల నుంచి 2000 కోట్ల బ‌డ్జెట్ తో రూపొందిన చాలా హాలీవుడ్ సినిమాలు వేల కోట్ల వ‌సూళ్లు సాధిస్తున్నాయి. భార‌తీయ సినిమా స్థాయిని ఆ రేంజుకు తీసుకెళ్లే స‌త్తా రాజ‌మౌళికి ఉంది అన‌డంలో సందేహం లేదు. మారిన ఈ స‌న్నివేశంలో అత‌డు ఎలాంటి ఎత్తుగ‌డ‌ల‌తో ముందుకు సాగుతాడో వేచి చూడాలి. నేడు ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్.ఎస్.రాజ‌మౌళి పుట్టిన‌రోజు సంద‌ర్భంగా `తుపాకి` త‌ర‌పున‌ శుభాకాంక్ష‌లు.