Begin typing your search above and press return to search.

ఖుషి డైరెక్టర్ తెలివైన వాడే..!

ఖుషి సినిమాతో మరోసారి తన మ్యాజిక్ చూపించాలని చూస్తున్నాడు శివ నిర్వాణ

By:  Tupaki Desk   |   14 Aug 2023 4:30 PM GMT
ఖుషి డైరెక్టర్ తెలివైన వాడే..!
X

నేచురల్ స్టార్ నానితో నిన్ను కోరి సినిమాతో దర్శకుడిగా తొలి సినిమానే సక్సెస్ అందుకున్న డైరెక్టర్ శివ నిర్వాణ ఆ నెక్స్ట్ నాగ చైతన్య, సమంతలతో కలిసి మజిలీ తీసి మరో హిట్ అందుకున్నాడు. నిన్ను కోరి, మజిలీ రెండు బ్యాక్ టు బ్యాక్ హిట్లతో డైరెక్టర్ గా తన మార్క్ సెట్ చేసుకున్న శివ నిర్వాణ నానితో టక్ జగదీష్ తీశాడు. అయితే ఆ సినిమా డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ కాగా అది కాస్త నిరాశపరచింది. అయితే ఆ సినిమా ఫెయిల్యూర్ ని అంతగా పట్టించుకోని శివ నిర్వాణ తన నెక్స్ట్ సినిమాను విజయ్ దేవరకొండతో ఫిక్స్ చేసుకున్నాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ మూవీ టైటిల్ ఖుషి టైటిల్ తో ఓ సినిమా తెరకెక్కించాడు.

విజయ్ దేవరకొండ సరసన సమంత ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. సెప్టెంబర్ 1న రిలీజ్ అవుతున్న ఈ సినిమా నుంచి రీసెంట్ గా ట్రైలర్ రిలీజైంది. అయితే ఈ ట్రైలర్ చూసిన ఆడియన్స్ అంతా ప్రేమ, పెళ్లి ఆ తర్వాత విప్లవ్ ఆరాధ్యల మధ్య లొల్లి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే సినిమా థీమ్ ఇదే అని శివ నిర్వాణ ట్రైలర్ తో క్లూ ఇచ్చినా అసలు మ్యాటర్ సినిమాలో దాచినట్టు చెప్పుకుంటున్నారు. సినిమా మెయిన్ ప్లాట్ ట్రైలర్ లో చూపించిన శివ నిర్వాణ ఎలాగు సినిమా కథ తెలుసు కాబట్టి ఆ మైండ్ సెట్ తో తను రాసిన స్క్రీన్ ప్లే కి ఆడియన్స్ ఎంగేజ్ అయ్యేలా ప్లాన్ చేశాడట.

ఖుషి సినిమాతో మరోసారి తన మ్యాజిక్ చూపించాలని చూస్తున్నాడు శివ నిర్వాణ. విజయ్ దేవరకొండ కూడా ఈ సినిమాపై సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. అందుకే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ టైం లో కూడా తను కాదు ఈ సినిమా మాట్లాడుతుందంటూ సినిమాపై తనకున్న నమ్మకాన్ని తెలియచేశాడు. డియర్ కామ్రేడ్ నుంచి తను చేస్తున్న ప్రతి సినిమా ఫ్లాప్ అవడంతో విజయ్ దేవరకొండ కూడా కాస్త డిస్ట్రబ్ అయ్యాడు. ఖుషి సినిమాతో అతను కూడా హిట్ ట్రాక్ ఎక్కాలని చూస్తునాడు.

ఓ పక్క సమంత కూడా యశోద సో సో గా ఆడినా శాకుంతలం డిజాస్టర్ గా మిగిలింది. అందుకే ఆమె కూడా ఖుషి మీదే చాలా హోప్స్ పెట్టుకుంది. శివ నిర్వాణ ఈ సినిమాతో కచ్చితంగా సక్సెస్ కొడుతున్నామన్న కాన్ఫిడెంట్ తో ఉన్నాడు. ఈ సినిమాకు మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ వాహబ్ మ్యూజిక్ అందిస్తున్నారు. సినిమా నుంచి ఇప్పటికే రిలీజైన సాంగ్స్ ఆడియన్స్ ని అలరిస్తున్నాయి. ఈ సినిమాలో పాటలన్నీ కూడా డైరెక్టర్ శివ నిర్వాణ రాయడం మరో స్పెషల్ థింగ్ అని చెప్పొచ్చు. ఓ విధంగా డైరెక్టర్, హీరో, హీరోయిన్ ఇలా ఈ ముగ్గురికి ఖుషి సినిమా సక్సెస్ చాలా అవసరం. అందుకే సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని కసితో పనిచేస్తున్నారు చిత్ర యూనిట్.