Begin typing your search above and press return to search.

శంకర్ ఏడాదిలోనే మూడు.. సాధ్యమేనా?

సౌత్ ఇండియా స్టార్ డైరెక్టర్ శంకర్ ఇండియన్ 2, 3 ప్రాజెక్ట్స్ తో పాటు గేమ్ చేంజర్ మూవీని కూడా లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే

By:  Tupaki Desk   |   22 Jan 2024 4:37 AM GMT
శంకర్ ఏడాదిలోనే మూడు.. సాధ్యమేనా?
X

సౌత్ ఇండియా స్టార్ డైరెక్టర్ శంకర్ ఇండియన్ 2, 3 ప్రాజెక్ట్స్ తో పాటు గేమ్ చేంజర్ మూవీని కూడా లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే. ఇవన్నీ పాన్ ఇండియా లెవల్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న సినిమాలే కావడం విశేషం. ఇండియన్ కి సీక్వెల్ గా ఇండియన్ 2 మూవీని శంకర్ సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించాడు . దీని తర్వాత ఇండియన్ 3 మూవీ కూడా చేయబోతున్నాడు.

మూడు పెద్ద సినిమాలు కాల్ షీట్స్, షెడ్యూల్ ఎలా హ్యాండిల్ చేస్తున్నాడు అనే డౌట్ ఇక్కడ చాలామందికి ఉంది. అయితే పక్కా ప్లాన్ తో ఈ మూవీస్ శంకర్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇప్పటికే ఇండియన్ 2 మూవీ షూటింగ్ కంప్లీట్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ కి ఇచ్చేశారు. అక్కడ ఫైనల్ వెర్షన్ ని సిద్ధం చేసే పనిలో ఉన్నారు. ఓ వైపు అది జరుగుతూ ఉండగానే

మరో వైపు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో చేస్తోన్న గేమ్ చేంజర్ మూవీ మార్చి ఆఖరుకి షూటింగ్ కంప్లీట్ అయిపోతుందంట. దీనిని పోస్ట్ ప్రొడక్షన్ లోకి తీసుకొచ్చి ఇండియన్ 2 మూవీ రిలీజ్ పైన దృష్టి పెట్టనున్నారు. ఈ మూవీని ఏప్రిల్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. తరువాత రామ్ చరణ్ గేమ్ చేంజర్ సెప్టెంబర్ లో రిలీజ్ చేయడానికి దిల్ రాజు మంచి డేట్ కోసం చూస్తున్నారు.

ఇండియన్ 3 మూవీ నెల రోజుల షూటింగ్ మాత్రమే ఇంకా పెండింగ్ ఉందంట. అంటే గేమ్ చేంజర్ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉండగానే ఇండియన్ 3 మూవీ షూటింగ్ కూడా కంప్లీట్ అయిపోయే ఛాన్స్ ఉంది. అదే జరిగితే ఈ ఏడాది ఆఖరులో ఇండియన్ 3ని ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చే అవకాశం ఉంది. ఒక వేళ ఈ శంకర్ ఈ ప్లానింగ్ లో మూడు సినిమాలు రిలీజ్ చేస్తే మాత్రం కచ్చితంగా అది రికార్డ్ అవుతుంది.

ఈ మధ్యకాలంలో ఒక దర్శకుడు ఏడాదికి ఒక సినిమా చేయడమే గగనం అయిపోతుంది. అలాంటిది ఒకే ఏడాది మూడు పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ చేసిన ఘనత శంకర్ కి దక్కుతుంది. ఇండియన్ 2,3 సిరీస్ ల మీద తమిళనాట భారీ అంచనాలు ఉన్నాయి. ఇక రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ కోసం తెలుగుతో పాటు నార్త్ ఇండియాలో ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.