Begin typing your search above and press return to search.

బాల‌య్య కోసం స్టోరీ రాస్తోన్న హాస్టల్ బోయ్!

న‌ట‌సింహ బాల‌కృష్ణ తో సినిమా చేయాల‌ని ఏ ద‌ర్శ‌కుడికి ఉండ‌దు. బాల‌య్య‌తో సినిమా అంటే ఎలా ఉంటుందో

By:  Tupaki Desk   |   22 Aug 2023 6:11 AM GMT
బాల‌య్య కోసం స్టోరీ రాస్తోన్న హాస్టల్ బోయ్!
X

న‌ట‌సింహ బాల‌కృష్ణ తో సినిమా చేయాల‌ని ఏ ద‌ర్శ‌కుడికి ఉండ‌దు. బాల‌య్య‌తో సినిమా అంటే ఎలా ఉంటుందో? ఆయ‌న‌తో ప‌నిచేసిన వారికి తెలుస్తుంది. మ‌ళ్లీ మ‌ళ్లీ ప‌నిచేయాల‌నిపించే హీరో అత‌ను. ఆయ‌న పూర్తిగా ద‌ర్శ‌కుల హీరో. బాల‌య్య ఎన‌ర్జీ..సెట్ లో చూపించే ఉత్సాహం మామూలుగా ఉండ‌దు. ఒక‌సారి బాల‌య్య‌తో సినిమా చేస్తే? ఆయ‌న‌లా ఉండాల‌ని ద‌ర్శ‌కులంతా ఫీల‌వుతుంటారు. హీరోల్లో ఈ ర‌క‌మైన ఇమేజ్ కేవ‌లం బాల‌య్య‌కి మాత్ర‌మే సొంతం.

తాజాగా ఓ యువ ద‌ర్శ‌కుడు బాల‌య్య‌తో సినిమా చేయ‌డానికి ఇండ‌స్ట్రీకి వ‌చ్చాను అన్న రేంజ్ లో మాట్లాడాడు. ఆ వివ‌రాల్లోకి వెళ్తే... ఓ క‌న్న‌డ చిత్రం 'బోయ్స్ హాస్టల్' టైటిల్ తో తెలుగులో రిలీజ్ అవుతుంది. నితిన్ కృష్ణ‌మూర్తి ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. క‌న్న‌డ‌లో సినిమా మంచి విజ‌యం సాధించింది. బోయ్స్ హాస్టల్స్ నేప‌థ్యాన్ని ఆధారంగా చేసుకుని తెర‌కెక్కించారు. తెలుగు రిలీజ్ పైనా కాన్పిడెంట్ గా ఉన్నారు. ఈ సినిమా ప్ర‌చారంలో భాగం ద‌ర్శ‌కుడు త‌న కెరీర్ ప్లానింగ్ రివీల్ చేసారు.

అవ‌కాశం వ‌స్తే తెలుగు సినిమాలు చేస్తాన‌న్నాడు. అందులోనూ న‌ట‌సింహ బాల‌కృష్ణ‌ని డైరెక్ట్ చేయ‌డం అన్న‌ది త‌న డ్రీమ్ గా చెప్పుకొచ్చారు. ఆయ‌న కోసం కొన్ని క‌థ‌లు సిద్దం చేసి పెట్టుకున్న‌ట్లు తెలిపాడు. ఇలా బాల‌య్య కోసం ఓ వ‌ర్ధ‌మాన ద‌ర్శ‌కుడు స్టోరీలు రెడీ చేయ‌డం అన్న‌ది ఇంట్రెస్టింగ్. అందులోనూ క‌న్న‌డ డైరెక్ట‌ర్. ఇటీవ‌ల క‌న్న‌డ డైరెక్ట‌ర్లు బాగా ఫేమ‌స్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే.

కంటెంట్ బేస్డ్ చిత్రాలు..యూత్ ఫుల్ ఎంట‌ర్ టైన‌ర్ల‌తో తెలుగులో ఫేమ‌స్ అవుతున్నారు. 'ల‌వ్ టుడే' సినిమాతో ప్ర‌దీప్ రంగ‌నాధ్ ఇక్క‌డా విజ‌యాన్ని ద‌క్కించుకున్న సంగ‌తి తెలిసిందే. సెల్ ఫోన్ ఆధారంగా తెర‌కెక్కిన సినిమా యూత్ కి పిచ్చి పిచ్చిగా న‌చ్చింది. అత‌నితో తెలుగు నిర్మాత‌లు సినిమాలు చేయ‌డానికి సిద్దంగా ఉన్న‌ట్లు ప్ర‌చారం సాగుతోంది. అలాగే కొంత మంది స్టార్ హీరోలు క‌న్న‌డ ద‌ర్శ‌కుల‌తో ప‌నిచేయ‌డానికి ఆస‌క్తి చూపిస్తున్నారు. ఆ లిస్ట్ లో ఇప్ప‌టికే చ‌ర‌ణ్..ప్ర‌భాస్ ..ఎన్టీఆర్ పేర్లు వినిపించిన సంగ‌తి తెలిసిందే.