Begin typing your search above and press return to search.

ప్లాప్ ఇచ్చిన డైరెక్ట‌ర్ ని చూసి గ‌ర్వ‌ప‌డిన హీరో!

స్టార్ హీరోలంతా డైరెక్ట‌ర్ల పై న‌మ్మ‌కంతో అవ‌కాశం ఇస్తారు. గ‌త విజ‌యాలు చూసి ఛాన్సులు క‌ల్పిస్తుంటారు.

By:  Tupaki Desk   |   13 Aug 2023 12:30 PM GMT
ప్లాప్ ఇచ్చిన డైరెక్ట‌ర్ ని చూసి గ‌ర్వ‌ప‌డిన హీరో!
X

స్టార్ హీరోలంతా డైరెక్ట‌ర్ల పై న‌మ్మ‌కంతో అవ‌కాశం ఇస్తారు. గ‌త విజ‌యాలు చూసి ఛాన్సులు క‌ల్పిస్తుంటారు. ఏరికోరి మ‌రీ ప్లాప్ డైరెక్ట‌ర్ ని ఎవ‌రూ తెచ్చి పెట్టుకోరు. ఇలా కొన్ని విజ‌యాలు చూసే త‌ల‌ప‌తి విజ‌య్ --నెల్స‌న్ దిలీప్ కుమార్ తో `బీస్ట్` సినిమా చేసాడు. భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అయిన సినిమా ఎలాంటి ఫ‌లితాలు సాధించిందో తెలిసిందే. విజ‌య్ కెరీర్ లో మ‌రో భారీ డిజాస్ట‌ర్ గా ఫ‌లితాన్నిచ్చింది.

సాధార‌ణంగా ఇలాంటి స‌న్నివేశం ఎదురైన‌ప్పుడు కొంద‌రిలో డైరెక్ట‌ర్-హీరో మ‌ధ్య చిన్న పాటి మ‌న‌స్పర్ద‌లొస్తుంటాయి. కొన్నాళ్ల పాటు అవి కొన‌సాగ‌తాయి. ఆ త‌ర్వాత అదే డైరెక్ట‌ర్ మరో హీరోకి భారీ హిట్ ఇచ్చిన త‌ర్వాత అవి తొల‌గిపోతుంటాయి. ఇది ఎక్క‌డైనా ఉండే స‌న్నివేశ‌మే. అయితే దిలీప్ కుమార్ కూడా త‌న గురించి విజ‌య్ ఇలాగే అనుకున్నాడ‌ని ఓ సందేహం చాలా కాలం వెంటాడింది.

చివ‌రికి మ‌న‌సులో ఉండ‌బెట్టుకోలేక నేరుగా అడిగేసాడు. నా మీద కోపంగా ఉందా? అని అడ‌గా ఎందుకు కోపం..అలా ఏం లేదు అన్నారుట విజ‌య్. అదే రోజు విజ‌య్ ఫోన్ చేసి `సినిమాపై మ‌న స్నేహం ఆధార‌ప‌డి ఉందా? సినిమా ఫ‌లితం వ‌ల్ల నాకు కోపం వ‌చ్చిందా? అని అడ‌గ‌డం నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. బ‌య‌ట వారు ఎన్నో అంటారు. వాటిని ప‌ట్టించుకోకు. మ‌నం నిజాయితీగా సినిమా చేసాం.

అది కొంత మందికి న‌చ్చింది. మ‌రికొంత మందికి నచ్చ‌లేదు. భ‌విష్య‌త్ లో మ‌రో సినిమా చేస్తే మ‌రింత అద్భుతంగా చేద్దాం` అన్నారు. `జైల‌ర్` చూసి సినిమా ..రిజ‌ల్ట్ గురించి విజ‌య్ నాతో మాట్లాడ‌టం చాలా సంతోషంగా అనిపించింది. ఆయ‌నే నాకు మెసెజ్ లు పెడుతున్నారు. తాను ఎంతో గ‌ర్వంగా ఉన్న‌ట్లు చెప్పారు. ఇది నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ఆయ‌న కామెంట్ నాలో ఆత్మ విశ్వాసాన్ని మ‌రింత బ‌లంగా మార్చింది. ఆయ‌నకు నేను విజ‌యాన్ని ఇవ్వ‌లేక‌పోయినా..ఆయ‌న నాకు తోడుగా నిల‌బ‌డ్డారు. విజ‌య్ కి ఎప్ప‌టికీ కృత‌జ్ఞుడినే` అని దిలీప్ అన్నారు.