Begin typing your search above and press return to search.

మెహెర్ రమేష్.. ఆ 3 సినిమాల నష్టమెంత?

ఓవరాల్ గా హ్యాట్రిక్ డిజాస్టర్స్ తో మెహర్ రమేష్ నిర్మాతలకి వంద కోట్లు నష్టాన్ని మిగిల్చారనే మాట ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్ లో వినిపిస్తోంది.

By:  Tupaki Desk   |   18 Aug 2023 1:30 PM GMT
మెహెర్ రమేష్.. ఆ 3 సినిమాల నష్టమెంత?
X

టాలీవుడ్ లో మోస్ట్ డిజాస్టర్ డైరెక్టర్ గా ఇప్పుడు మెహర్ రమేష్ పేరు ఒక బ్రాండ్ గా మారిపోయేలా కనిపిస్తోంది. అతను దెబ్బలు పదేళ్ల క్రితమే ఇద్దరు పెద్ద నిర్మాతలకి తగిలింది. అసలైతే మొదట మెహర్ రమేష్ కన్నడలో ఆంధ్రావాలా, ఒక్కడు రీమేక్స్ చేసి హిట్ కొట్టాడు. అనంతరం తెలుగులో కంత్రి మూవీతో సరికొత్తగా ఎంట్రీ ఇచ్చాడు. మెహర్ రమేష్ కి ఆ సినిమా మేకింగ్ పరంగా బాగానే కలిసొచ్చేసింది. జూనియర్ ఎన్టీఆర్ మొదటిసారి కంప్లీట్ గా స్లిమ్ అయ్యి ఆ చిత్రంలో కనిపించాడు.

తరువాత బిల్లా రీమేక్ ప్రభాస్ తో చేశాడు. ఈ మూవీ ఏవరేజ్ టాక్ తెచ్చుకుంది. నెక్స్ట్ మెహర్ రమేష్ శక్తి మూవీ జూనియర్ ఎన్టీఆర్ తో చేశారు. ఈ సినిమా కోసం అశ్వనీదత్ ఏకంగా 50 కోట్ల బడ్జెట్ ఆ రోజుల్లోనే పెట్టారు. తారక్ డ్యూయల్ రోల్ లో ఈ మూవీలో కనిపించారు. అయితే ఈ చిత్రం ఊహించని స్థాయిలో డిజాస్టర్ అయ్యింది. తారక్ కెరియర్ లోనే భారీ నష్టాలు తీసుకొచ్చిన చిత్రంగా మిగిలిపోయింది.

అశ్వనీదత్ కి ఏకంగా 30 కోట్లు ఈ సినిమాతో నష్టం వచ్చింది. ఈ విషయాన్ని నిర్మాత స్వయంగా చెప్పడం విశేషం. తరువాత అదృష్టం కొద్ది వెంకటేష్ తో షాడో మూవీ చేసే అవకాశం దక్కించుకున్నారు. ఈ సినిమాని 30 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. వెంకటేష్ కి అప్పుడు అంత మార్కెట్ కూడా లేదు. పురుచూరి కిరీటి నిర్మాతగా ఈ సినిమాని చేశారు. దీని తర్వాత ఏకంగా 20 కోట్లు నిర్మాత నష్టపోయాడు.

ఈ రెండు సినిమాల దెబ్బకి హీరోలు, నిర్మాతలు ఎవరూ కూడా మెహర్ రమేష్ తో సినిమా చేయాలనే ఆలోచన చేయలేదు. అయితే పదేళ్ల తర్వాత బంధువు కావడంతో మెగాస్టార్ చిరంజీవి మళ్ళీ అవకాశం ఇచ్చి నిలబెట్టాలని ప్రయత్నం చేశారు. రీమేక్ కథకి అప్పగించి భోళా శంకర్ తో దర్శకుడిగా మార్చారు. అనిల్ సుంకరతో ఉన్న కమిట్మెంట్ కారణంగా ప్రొడ్యూసర్ గా అప్పగించారు.

అయితే భోళా శంకర్ సినిమా ఇప్పుడు చిరంజీవి ఇమేజ్ ని డ్యామేజ్ చేయడమే కాకుండా నిర్మాతని మరింత దెబ్బ కొట్టింది. ఈ చిత్రం కోసం 90 కోట్ల వరకు అనిల్ సుంకర ఖర్చు చేశారు. అందుకే థియేటర్ తో పాటు డిజిటల్ రైట్స్ రూపం లో కొంత వరకు రికవరీ అయిన 50 కోట్లు నష్టం వచ్చిందని టాక్. ఓవరాల్ గా హ్యాట్రిక్ డిజాస్టర్స్ తో మెహర్ రమేష్ నిర్మాతలకి 100 కోట్లు నష్టాన్ని మిగిల్చారనే మాట ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్ లో వినిపిస్తోంది.