Begin typing your search above and press return to search.

బన్నీపై ట్వీట్.. మారుతీని ఆటాడేసుకుంటున్న ప్రభాస్ ఫ్యాన్స్

By:  Tupaki Desk   |   22 July 2023 10:57 AM GMT
బన్నీపై ట్వీట్.. మారుతీని ఆటాడేసుకుంటున్న ప్రభాస్ ఫ్యాన్స్
X

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ ఫ్యాన్స్ మరోసారి దర్శకుడు మారుతిపై ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు కృతజ్ఞత భావం లేదని కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఫుల్ ట్రోల్స్ చేస్తూ ఓ ఆటాడేసుకుంటున్నారు. గ్యాప్ లేకుండా మారుతిపై విరుచుకుపడుతున్నారు.

అసలేం జరిగిందంటే.. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. 'రాజా డీలక్స్' అనే టైటిల్ పరిశీలనలో ఉంది. అయితే ఈ చిత్రం గురించి అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ.. సినిమా షూటింగ్ మాత్రం జరుగుతోంది. దాదాపు సగానికి పైగానే షూటింగ్ పూర్తైంది. అయితే ప్రభాస్ ఈ చిత్రాలతో పాటు పలు భారీ ప్రాజెక్ట్ లు కూడా చేస్తున్న సంగతి తెలిసిందే.

అందులో 'ప్రాజెక్ట్ కె' ఒకటి. తాజాగా ఈ చిత్ర టైటిల్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు మేకర్స్. అది కూడా ప్రఖ్యాత శాన్ డీగో కామిక్ కాన్ ఈవెంట్ వేదికగా ఆవిష్కరించారు. దీంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ప్రభాస్ లుక్ అదిరిపోయిందని, హాలీవుడ్ స్టైల్ లో గ్లింప్స్ ఉందని కొనియాడుతున్నారు. అయితే తనకు దాదాపు రూ. 200కోట్ల భారీ బడ్జెట్ సినిమా చేసే అవకాశం ఇచ్చిన దర్శకుడు మారుతి మాత్రం ఈ గ్లింప్స్ గురించి ఒక్క ట్వీట్ కూడా చేయలేదు.

పైగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను ప్రశంసిస్తూ ఓ ట్వీట్ చేశారు. రీసెంట్ గా విడుదలై 'బేబీ' మూవీ భారీ సక్సెస్ ను అందుకుంది. అయితే 'బేబీ' మూవీ సక్సెస్ మీట్ కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హాజరై సినిమాను బాగుందంటూ మూవీటీమ్ ను ప్రశంసించారు. దీనికి సంబంధించిన వీడియోను మారుతీ ట్వీట్ చేశారు. కానీ ప్రభాస్ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ పై మాత్రం స్పందించలేదు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ బాగా హర్ట్ అయ్యారు.

'అల్లు అర్జున్ అంత క్లోజ్ అయినప్పటికీ నీతో సినిమా చేసేందుకు అవకాశం ఇవ్వలేదు. కానీ ఎటువంటి సంబంధం లేకపోయినా రూ.200కోట్ల భారీ బడ్జెట్ ఆఫర్ ప్రభాస్ నీకు ఇచ్చారు. నీతో సినిమా చేస్తున్నారు. అయినా నువ్వు గ్లింప్స్ కు సంబంధించిన ఎటువంటి ట్వీట్ చేయలేదు. అంకిత భావం, కృతజ్ఞత భావం లేదం'టూ మారుతీని ట్రోల్స్ చేస్తున్నారు. మారుతి అలా చేయడం కరెక్ట్ కాదని అంటున్నారు. పైగా ఇన్ని ట్రోల్స్ చేస్తున్న కనీసం ఇప్పటికైనా రెస్పాన్స్ అవ్వడం లేదని అభిమానులు మరింత అసహనం వ్యక్తం చేస్తున్నారు.

గతంలోనూ మారుతీపై ఓ సారి అసహనం వ్యక్తం చేశారు ప్రభాస్ ఫ్యాన్స్. సినిమా అఫీషియల్‌గా అనౌన్స్ చేయకపోయినప్పటికీ సహనంతో ఉన్న ఫ్యాన్స్.. మూవీకి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ ఇవ్వలేదని ఫీలవుతూ దర్శకుడు మారుతిపై పుల్ ఫైర్ అయ్యారు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు మరోసారి బాగా మండిపడ్డారు.