Begin typing your search above and press return to search.

సృష్టిక‌ర్త కొంప ముంచిన రోల్ అది!

క్రియేటివ్ డైరెక్ట‌ర్ కృష్ణ‌వంశీ 'రంగ‌మార్తాండ' తో విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లందుకున్నా! ద‌ర్శ‌కుడిగా మాత్రం బిజీ కాలేదు

By:  Tupaki Desk   |   17 Aug 2023 8:08 AM GMT
సృష్టిక‌ర్త కొంప ముంచిన రోల్ అది!
X

క్రియేటివ్ డైరెక్ట‌ర్ కృష్ణ‌వంశీ 'రంగ‌మార్తాండ' తో విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లందుకున్నా! ద‌ర్శ‌కుడిగామాత్రం బిజీ కాలేదు. ఆ సినిమా విజ‌యంతో వంశీ ఈజ్ బ్యాక్ అనిపించినా ఇంత‌వ‌ర‌కూ కొత్త సినిమా ప్ర‌క‌టిం చ‌లేదు. వ‌రుస ప‌రాజ‌యాల‌తో ఇబ్బంది పడుతోన్న స‌మ‌యంలో 'రంగ‌మార్తాండ' రూపంలో ఊర‌ట ద‌క్కింది. కానీ ఈ సీనియ‌ర్ ని నుంచి మాత్రం స్వీట్ న్యూస్ ఇంకా రాలేదు. ఇక కృష్ణవంశీ తెర‌కెక్కించిన 'ఖ‌డ్గం' అప్ప‌ట్లో ఎలాంటి విజ‌యం సాధించిందో తెలిసిందే. ద‌ర్శ‌కుడిగా ఆయ‌న స్థాయిని పెంచిన చిత్ర‌మ‌ది.

విజ‌యంతో పాటు ఓసెక్ష‌న్ లో విమ‌ర్శ‌లు కూడా తీసుకొచ్చింది. సినిమాలో పృధ్వీరాజ్ రోల్ బాల‌య్య‌ని ఉద్దేశించి పెట్టార‌ని అప్ప‌ట్లో బాగా ప్ర‌చారంలోకి వ‌చ్చింది. దీనిపై బాల‌య్య అభిమానులు సీరియ‌స్ అయ్యారు. తాజాగా ఈ అంశాల‌న్నింటిపై ఓ ఇంట‌ర్వ్యూలో కృష్ణ వంశీ క్లియ‌ర్ చేసారు. ఆ పాత్ర ఎవ‌ర్నీ ఉద్దేశించి చేసింది కాదు. ఆ పాత్ర వ‌ల్ల నేనే న‌ష్ట‌పోయాను. బాల‌య్య లా డైలాగులు ఏ హీరో చెప్ప‌గ‌ల‌డు? కానీ అజ్ఞానం..అమాయ‌క‌త్వం తో సృష్టంచిన పృధ్వీ పాత్ర తో నాపై చాలా మంది ప‌గబ‌ట్టారు.

ఇప్పుడ‌వ‌న్నీ మ‌ర్చిపోయారు. అంతా బాగానే ఉంది. ద‌ర్శ‌కుల్లో వ‌ర్మ‌తో పాటు బాపు.. రాఘ‌వేంద్ర‌రావు కూడా స్పూర్తి. వాళ్ల సినిమాల‌ ప్ర‌భావం నాపై ఉంటుంది' ' అన్నారు. అలాగే ఇండ‌స్ట్రీలో కృష్ణ వంశీ కూడా వ‌ర్మ స్కూల్ నుంచి వ‌చ్చిన వారు అన్న సంగ‌తి తెలిసిందే. ఆయ‌న వ‌ద్ద అసిస్టెంట్ గా ప‌నిచేసి ద‌ర్శ‌కుడైన వాళ్ల‌లో వంశీ ఒక‌రు. వ‌ర్మ కూడా వంశీకి మంచి ప్రాధాన్య‌త ఇస్తారు. పూరికంటే ముందు వంశీ ప్రియ శిష్యుడిగా మెలిగే వారు అంటారు.

ఇలా ఇండ‌స్ట్రీలో ఒక‌ప్పుడు ఓ వెలుగు వెలిగిన కృష్ణ వంశీ ఇప్పుడు సినిమాల జోరు బాగా త‌గ్గింది. అప్ప‌ట్లో బాల‌య్య‌కి 'రైతు' క‌థ చెప్పిన సంగ‌తి తెలిసిందే. బాల‌య్య కూడా ఒకే చెప్పారు. కానీ కీల‌కమైన పాత్ర‌కు అమితాబ‌చ్చ‌న్ నో చెప్ప‌డంతో ఆ ప్రాజెక్ట్ ముందుకు వెళ్ల‌లేదు. దీంతో బాల‌య్య వేర్వేరు సినిమాలో బిజీ అయి రైతుని పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు.