Begin typing your search above and press return to search.

మొత్తానికి క్రిష్ మొదలెట్టాడు

ఈ సినిమా పూర్తి కావాలంటే పవన్ కళ్యాణ్ మరో 35 నుంచి 40 రోజుల కాల్ షీట్స్ ఇవ్వాలంట. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఎన్నికల బిజీలో ఉన్నారు

By:  Tupaki Desk   |   10 Feb 2024 10:13 AM GMT
మొత్తానికి క్రిష్ మొదలెట్టాడు
X

పవన్ కళ్యాణ్ హీరోగా హరిహర వీరమల్లు సినిమాని రెండేళ్ల క్రితం డైరెక్టర్ క్రిష్ స్టార్ట్ చేశారు. అయితే ఈ సినిమా ఆరంభం నుంచి అవాంతరాలు ఎదుర్కొంటూనే ఉంది. ఈ చిత్రం కోసం పవన్ కళ్యాణ్ కాల్ షీట్స్ కేటాయించలేకపోయారో లేక ఇతర కారణాల వలన ఆలస్యం అవుతూ వచ్చిందో తెలియదు కానీ ఇప్పటికి మూవీ షూటింగ్ కంప్లీట్ కాలేదు.

ఈ సినిమా పూర్తి కావాలంటే పవన్ కళ్యాణ్ మరో 35 నుంచి 40 రోజుల కాల్ షీట్స్ ఇవ్వాలంట. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఎన్నికల బిజీలో ఉన్నారు. ఎలక్షన్స్ తర్వాత ఓజీ మూవీ కంప్లీట్ చేయాల్సి ఉంది. దాని తర్వాత హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ పూర్తి చేసి హరిహర వీరమల్లుపై ఫోకస్ పెట్టే ఛాన్స్ ఉంది. ఇక రీసెంట్ గా క్రిష్ ఆ పవన్ ప్రాజెక్టు నుంచి తప్పికున్నట్లు టాక్ గట్టిగానే వచ్చింది. క్రిష్ దర్శకత్వంలో వీరమల్లు ఉండకపోవచ్చని టాక్.

ఇక క్రిష్ తన కొత్త ప్రాజెక్టుతో బిజీ అయ్యాడు. అనుష్క లీడ్ రోల్ లో ఫీమేల్ సెంట్రిక్ మూవీ ఒకటి స్టార్ట్ చేశారు. యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. తాజాగా మూవీ సెట్స్ పైకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఎలాంటి హడావిడి లేకుండా సైలెంట్ గా ఈ చిత్రాన్ని క్రిష్ స్టార్ట్ చేసేసాడంట. మూవీ కోసం ప్రత్యేకంగా ఓ సెట్ వేశారంట. ఇందులోనే కీలక సన్నివేశాల షూటింగ్ మొదలైందని టాక్ వినిపిస్తోంది. ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా కథ ఉంటుందంట.

అంటే దీనిని బట్టి చిత్రంలో అనుష్క పాత్ర ఉత్తరాంధ్ర స్లాంగ్ లో మాట్లాడుతుందని స్పష్టం అవుతోంది. తనకి జరిగిన అన్యాయంపై పోరాటం చేసే ఒక సాధారణ అమ్మాయిగా అనుష్క ఈ మూవీలో కనిపించబోతోందని తెలుస్తోంది. సినిమాలో ఓ యంగ్ హీరో నటిస్తున్నాడంట. అయితే అతను ఎవరనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గానే ఉంది. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

వేదం మూవీ తర్వాత క్రిష్, అనుష్క కాంబినేషన్ లో వస్తోన్న మూవీ కావడంతో కాస్తా హైప్ ఉంది. మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో అనుష్క గత ఏడాది బ్లాక్ బస్టర్ హిట్ ని ఖాతాలో వేసుకుంది. ఈ సినిమా గ్రామీణ నేపథ్యంలో ఉంటుందని తెలుస్తోంది. మరి ఆమె పాత్రని క్రిష్ ఎలా చూపించబోతున్నాడు అనేది వేచి చూడాలి.